హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ ఉందా... నగరంలో అసలేం జరుగుతోంది...

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లో కమ్యూనిటీ స్ప్రెడ్ జరుగుతోందా.. అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రతీరోజూ నమోదవుతున్న కేసుల్లో అత్యధిక కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతుండటంతో కమ్యూనిటీ స్ప్రెడ్ జరుగుతోందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల ఇండియా ఇన్ పిక్సెల్స్ సర్వే తెలంగాణలో 122శాతం కమ్యూనిటీ స్ప్రెడ్‌కి అవకాశం ఉందని చెప్పడం కూడా దీనికి ఊతమిచ్చినట్టయింది. అయితే ప్రభుత్వం మాత్రం అది తప్పుడు లెక్క అని... రాష్ట్రంలో వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి జరగట్లేదని స్పష్టం చేసింది.

షాకింగ్ : తెలుగు సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్... షాకింగ్ : తెలుగు సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్...

హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు వైరస్ వ్యాప్తి...

హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు వైరస్ వ్యాప్తి...

ఒకవేళ హైదరాబాద్‌లో కమ్యూనిటీ స్ప్రెడ్ జరగకపోతే ప్రతీరోజూ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కేసులు ఎందుకు నమోదవుతున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ నుంచి జనగామ వెళ్లిన ఓ వ్యక్తి ఓ ఫర్టిలైజర్ షాపు యజమానిని కలవగా... అతని ద్వారా 30 మందికి అక్కడ కరోనా సోకినట్టుగా నిర్దారణ అయింది. దీంతో హైదరాబాద్‌ ద్వారా జిల్లాలకు కరోనా వ్యాప్తి జరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు నగరంలోని ఆస్పత్రులన్నీ ఇప్పటికే కరోనా పేషెంట్లతో నిండిపోయాయన్న కథనాలు వస్తున్నాయి. దీంతో సాధారణ పేషెంట్లు లేదా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న పేషెంట్ల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మాత్రం సాధారణ లక్షణాలు ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో చేర్చుకోవద్దని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలను ఆదేశించినట్టు చెబుతున్నారు.

హోమ్ క్వారెంటైన్ ప్యాకేజీలు...

హోమ్ క్వారెంటైన్ ప్యాకేజీలు...

ఒకవేళ సాధారణ లక్షణాలు బయటపడ్డా సరే.. ఇంటి వద్దే హోమ్ క్వారెంటైన్‌లో ఉండాలి తప్ప ఆస్పత్రులకు రావొద్దని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఒకవేళ వస్తే... 10 రోజులకు రూ.1లక్ష చెల్లించాల్సిందేనని చెబుతున్నారు. ఇప్పటికే యశోద,అపోలో ఆస్పత్రులు హోమ్ క్వారెంటైన్ కోసం ప్రత్యేక ప్యాకేజీలు కూడా ప్రకటించాయి. 15 రోజుల క్వారెంటైన్ కోసం రూ.19వేలతో యశోద ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యేక కిట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే రోజు తప్పించి రోజు ఫిజీషియన్‌తో వర్చువల్ అపాయింట్‌మెంట్ ఉంటుందని తెలిపింది. ఆన్‌లైన్ వీడియో ద్వారా పేషెంట్‌ను వైద్యుడు పరిశీలించి అవసరమైన సూచనలు,సలహాలు చేస్తారు.

Recommended Video

కొంపముంచిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌.. టెన్నిస్ స్టార్ Novak Djokovic కు Corona!
టెస్టుల ఫలితాల్లో జాప్యం

టెస్టుల ఫలితాల్లో జాప్యం

రాష్ట్రంలో జరుగుతున్న కరోనా టెస్టులపై ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షణాలు లేనివారిని,సాధారణ లక్షణాలు ఉన్నవారిని ఆస్పత్రుల్లోకి తీసుకోవద్దని ప్రభుత్వం చెబుతుండటంతో.. ఇలా అయితే అసలు కేసుల సంఖ్య ఎలా తేలుతుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3 నుంచి 4వేల టెస్టులు జరుగుతున్నాయి. అయితే ఈ టెస్ట్ రిజల్ట్స్ కూడా చాలా ఆలస్యంగా వస్తుండటం వైరస్ వ్యాప్తికి అవకాశం కల్పిస్తోందంటున్నారు. శాంపిల్స్ ఇచ్చినవారిని క్వారెంటైన్‌లో పెడుతున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. కొంతమంది శాంపిల్స్ ఇచ్చాక కూడా బయట తిరుగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శాంపిల్ రిజల్ట్స్ ఒక్కోసారి వారం రోజులకు వస్తుండటంతో.. ఆలోపు వారి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతోందని అంటున్నారు.రాష్ట్రానికి 10వేల టెస్టులు చేసే కెపాసిటీ ఉన్నా.. ఇంత జాప్యం ఎందుకు జరుగుతోందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

English summary
People suspecting that is coronavirus community spread in Hyderabad,but the government is clearly saying that there is no community spread till now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X