వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడే దొరికిపోయారు: విచారణలో స్వాతి షాకింగ్, ప్రియుడికి సర్జరీ చేయించి పుణేకు వెళ్లాలనుకొని

|
Google Oneindia TeluguNews

Recommended Video

అక్కడే దొరికిపోయారు.. విచారణలో షాక్ !

హైదరాబాద్;/నాగర్ కర్నూలు: ప్రియుడు రాజేష్ సహాయంతో భర్తను చంపేసిన స్వాతి విచారణలో ఎన్నో షాకింగ్ విషయాలు వెల్లడించిందని తెలుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘోరం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ప్రియుడికి తెలియదు!: భర్తను చంపిన స్వాతి కేసులో ట్విస్ట్, ఏ క్షణమైనా రాజేష్ అరెస్ట్ప్రియుడికి తెలియదు!: భర్తను చంపిన స్వాతి కేసులో ట్విస్ట్, ఏ క్షణమైనా రాజేష్ అరెస్ట్

పోలీసులు స్వాతిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. కోర్టులో ప్రవేశ పెట్టి రిమాండుకు తరలించారు. పోలీసుల విచారణలో ఆమె ఎన్నో విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఆమె చెబుతున్న విషయాలు విని పోలీసులు షాకయ్యారని సమాచారం. స్వాతి గురించి భర్త సుధాకర్‌కు నాలుగు రోజుల ముందు తెలిసినట్లుగా సమాచారం.

ఒంటరితనం, ప్రియుడిపై వ్యామోహం: స్వాతి భర్తను చంపడానికి కారణాలివే!ఒంటరితనం, ప్రియుడిపై వ్యామోహం: స్వాతి భర్తను చంపడానికి కారణాలివే!

 రెండేళ్లుగా రాజేష్‌తో పరిచయం, ప్లాస్టిస్ సర్జన్‌ను కలిశాం

రెండేళ్లుగా రాజేష్‌తో పరిచయం, ప్లాస్టిస్ సర్జన్‌ను కలిశాం

తనకు రెండేళ్లుగా రాజేష్‌తో పరిచయం ఉందని స్వాతి విచారణలో వెల్లడించిందని తెలుస్తోంది. తన భర్తను చంపడానికి నాలుగు రోజుల ముందు ప్లాస్టిక్ సర్జన్‌ను కలిసినట్లు చెప్పింది. ఆయనను సంప్రదించి వివరాలు తెలుసుకున్నారని చెప్పింది.

 రూ.10 లక్షలతో ప్రియుడికి సర్జరీ చేయించి, పుణేకు వెళ్లాలని

రూ.10 లక్షలతో ప్రియుడికి సర్జరీ చేయించి, పుణేకు వెళ్లాలని

సంగారెడ్డి ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ ఖర్చుపై స్వాతి, రాజేష్‌లు వాకబు చేశారని విచారణలో తెలిసింది. రూ.10 లక్షలతో ప్రియుడు రాజేష్‌కు ప్లాస్టిక్ సర్జరీ చేయించాలని స్వాతి సిద్ధపడింది. రాజేష్‌కు తన భర్త రూపు వచ్చాక పుణేకు చెక్కేద్దామని స్వాతి ప్లాన్ వేసిందని పోలీసుల విచారణలో తేలింది.

 అప్పుడే అనుమానం కలిగింది

అప్పుడే అనుమానం కలిగింది

యాసిడ్ దాడి జరిగిన తమ కుమారుడు ఆసుపత్రిలో బెడ్ పైన చికిత్స పొందుతున్నాడని భావించి, కోడలికి మనోధైర్యాన్ని ఇచ్చారు సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు. కానీ వారికి ఓ సమయంలో అనుమానం వచ్చింది. ఈ విషయాన్నే పోలీసులు వెల్లడించారు.

 మటన్ సూప్ ఇవ్వబోగా నిరాకరించడంతో

మటన్ సూప్ ఇవ్వబోగా నిరాకరించడంతో

బెడ్ పైన ఉన్నది సుధాకర్ కాదన్న అనుమానం అతని తల్లిదండ్రులకు ఎక్కడ వచ్చిందన్న విషయాన్ని పోలీసులు తెలిపారు. సాధారణంగా ఆసుపత్రి బెడ్‌పై ఉంటే వారికి బలవర్దక ఆహారంగా మటన్ సూప్‌ను ఇస్తారని, రాజేష్‌కు కూడా ఆసుపత్రి వర్గాలు మటన్ సూప్‌ను ఇవ్వబోగా ఆయన దాన్ని నిరాకరించాడని చెప్పారు.

అక్కడే అనుమానం వచ్చింది

అక్కడే అనుమానం వచ్చింది

మాంసాహారి అయిన సుధాకర్ మటన్ సూప్‌ను ఇష్టంగానే తాగుతుంటాడని తెలుస్తోంది. తల్లిదండ్రులకు ఈ విషయం తెలియకుండా ఉండదు. బెడ్ పై ఉన్న కుమారుడు మటన్ సూప్ వద్దనడం, బలవంతం చేయబోయినా ముట్టక పోవడంతో వారికి మొదటిసారి అనుమానం వచ్చింది.

 అలా స్వాతి బండారం బట్టబయలు

అలా స్వాతి బండారం బట్టబయలు

రాజేష్ శాకాహారి కావడంతోనే మటన్ సూప్‌ను వద్దని చెప్పాడు. దాంతో సుధాకర్ తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో ఈ విషయం తమదాకా వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. వారి ఫిర్యాదుతో స్వాతి బండారం బట్టబయలు అయింది.

ఎవడు సినిమాలోలా.. ఆసుపత్రి సిసిటీవీల్లో ఇలా

ఎవడు సినిమాలోలా.. ఆసుపత్రి సిసిటీవీల్లో ఇలా

ప్రియుడు రాజేష్‌తో కలిసి భర్తను చంపిన స్వాతి.. తన ప్రియుడికి 'ఎవడు' సినిమాలో వలె ప్లాస్టిక్ సర్జరీ చేయించుదామని భావించింది. ఇందుకోసం అతనిపై యాసిడ్ పోసింది. ఆ తర్వాత రాజేష్‌ను ఆసుపత్రిలో చేర్పించింది. రాజేష్‌ను ఆసుపత్రిలో చేర్పించినప్పుడు స్వాతి వెంట సుధాకర్ తల్లి కూడా ఉన్నారు. అయితే ఆమె రాజేష్‌ను సుధాకర్‌గానే భావించి.. కన్నీరుమున్నీరు అయింది. ఆ తర్వాత స్వాతి ఘోరం చేసిన విషయం వెలుగు చూడటంతో ఆమెను ఉరితీయాలని సుధాకర్ తల్లి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు.

 స్వాతిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు

స్వాతిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు

కాగా, ఇద్దరు పిల్లలు ఉన్న స్వాతికి తన భర్తను చంపేందుకు ఇన్ని ప్లాన్‌లు వేయడంపై గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. పిల్లలు కలిగి, మంచి భర్త ఉన్న స్వాతికి ఇదేం బుద్ధి అని అంటున్నారు. భర్తను దారుణంగా చంపిన స్వాతిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటన మరొకటి జరగకూడదన్నారు.

 రాజేష్ తల్లిదండ్రులు ఏం చెబుతున్నారంటే

రాజేష్ తల్లిదండ్రులు ఏం చెబుతున్నారంటే

మరోవైపు రాజేష్ తల్లిదండ్రులు కూడా స్పందించారు. తమ కొడుకు చాలా మంచివాడని, హత్య కేసులో ఇరుక్కుంటాడని ఊహించలేదని చెబుతున్నారు. రాజేష్‌ను తమకు చూపించాలని, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియాలన్నారు.

 రాజేష్‌ను విచారించిన పోలీసులు

రాజేష్‌ను విచారించిన పోలీసులు

ఆసుపత్రి బెడ్ పైన ఉన్న రాజేష్‌ను పోలీసులు మంగళవారం విచారించారు. గత నాలుగు రోజులుగా రాజేష్ కోలుకోవడం కోసం ఎదురుచూసిన నాగర్ కర్నూల్ పోలీసులు ఈ ఉదయం వైద్యుల అనుమతితో రాజేష్‌తో మాట్లాడారు. తాము పోలీసులమని పరిచయం చేసుకుని.. హాయ్ సుధాకర్... ఎలా ఉన్నావు? అని అడిగారు. ఆపై కేసు విచారణ నిమిత్తం ఆధార్ ఐడెంటిఫికేషన్ చేయాలని, కాసేపట్లో ఆధార్ యంత్రంతో వస్తామని పోలీసులు చెప్పగా హతాశుడైన రాజేష్, ఏం చేయాలో, ఎలా చెప్పాలో పాలు పోని స్థితికి వెళ్లిపోయాడని తెలుస్తోంది. స్వాతి బండారం బట్టబయలైన విషయం చెప్పి రాజేష్ వేలిముద్రలు తీసుకుని, అతను సుధాకర్ కాదన్న తొలి సాక్ష్యాన్ని అధికారికంగా నమోదు చేసుకున్నారు. కాగా, నిన్న రాజేష్‌ను అరెస్ట్ చేయాలని చూసినా అతని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కుదరలేదని, కేసు విచారణ ఇక మరింత వేగవంతం అవుతుందని పోలీసులు చెబుతున్నారు.

English summary
In a crime plot straight out of a film, a woman and her boyfriend allegedly murdered her husband and disfigured the boyfriend so that he can impersonate the husband and take possession of his assets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X