వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొట్టేవాడు, ఆ తర్వాత సారీ, మారతానన్నాడు, కానీ: టెక్కీ మధుకర్ ఆత్మహత్యపై భార్య స్వాతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వారం క్రితం అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మధుకర్ ఆత్మహత్యపై బుధవారం ఉదయం ఆయన భార్య స్వాతి మీడియాతో మాట్లాడారు. తన భర్త మరణానికి తానే కారణమని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించడంపై ఆమె స్పందించారు. చివరిసారి ఆమెతో మధుకర్ మాట్లాడిన మాటలను రికార్డ్ చేసిన ఆమె ఆ సంభాషనను మీడియాకు వినిపించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. తనపై రవీందర్ అనే వ్యక్తి దాడి చేశారని స్వాతి తెలిపారు. అతనే తన భర్తకు తన గురించి వ్యతిరేకంగా ఏదో చెప్పాడని చెప్పారు. ఈ విషయం గురించి తన భర్త మధుకర్‌ను కూడా అడిగినట్లు చెప్పారు. తాను మాత్రం అదేం లేదని అన్నాడని చెప్పారు. మధు పేరెంట్స్ కు కూడా ఈ విషయం గురించి చెప్పానని స్వాతి తెలిపారు. తనపై గాసిప్స్ క్రియేట్ చేస్తున్నాడని తెలిపినట్లు చెప్పారు.

మధు, తన మధ్య ఎలాంటి గొడవలు లేవని, గొడవలు ఉన్నా అవి చాలా చిన్నవని స్వాతి తెలిపారు. మధు చాలా మంచివాడని చెప్పారు. తరచూ డిప్రెషన్ కు లోనయ్యే మధుకర్ తనను అప్పుడప్పుడు కొడుతుండేవాడని చెప్పారు. ఆ తర్వాత తప్పైపోయిందని తనతో బాగా ఉండేవాడని తెలిపారు. ప్రతిసారీ ఇలా చేస్తుండటంతో తాను.. మధుకర్‌ను నిలదీశానని చెప్పారు.

<strong>స్వాతిపై టెక్కీ మధుకర్ రెడ్డి బంధువుల దాడి</strong>స్వాతిపై టెక్కీ మధుకర్ రెడ్డి బంధువుల దాడి

Swathi on her husband Madhukar Reddy suicide

మధుకర్ పలుమార్లు డిప్రెషన్ విషయంలో ట్రీట్‌మెంట్ కూడా తీసుకున్నారని స్వాతి తెలిపారు. అయితే, ఆత్మహత్య చేసుకుని మధుకర్ తప్పు నిర్ణయం తీసుకున్నారని స్వాతి అన్నారు. పనికి సంబంధించిన ఒత్తిడి వల్లే మధుకర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. అతడ్ని తాను బాగా చూసుకున్నానని చెప్పిన స్వాతి.. అతడు కూడా తనను బాగానే చూసుకునేవాడని చెప్పారు. ప్రాపర్టీకి సంబంధించిన విషయంలోనే మధుకర్ కుటుంబసభ్యులు తనతో గొడవకు దిగుతున్నారని చెప్పారు.

గత మార్చి నుంచి తరచూ మధుకర్ డిప్రెషన్‌కు గురవుతున్నాడని, మూడీగా ఉంటున్నాడని స్వాతి చెప్పారు. తనతో కూడా సరిగా మాట్లాడటం లేదని, పనిలో సహకరించలేదని చెప్పారు. ఏదైనా ఉంటే నాతో చెప్పు, ఇలావుండటం నాకు కష్టంగా ఉందని మధుతో తాను అన్నట్లు స్వాతి చెప్పారు. ఈ విషయాన్ని మధుకర్ తల్లిదండ్రులకు కూడా చెప్పానని తెలిపారు.

మధుకర్ అప్పుడప్పుడు తనను కొడుతున్నాడని, ఆ తర్వాత మంచిగా ఉంటున్నాడని వారికి చెప్పినట్లు తెలిపారు. అయితే, మధుకర్ తల్లిదండ్రులు, కుటుంసభ్యులు తన బాధను అర్థం చేసుకోలేదని స్వాతి తెలిపారు. తాను మధుకర్ తో పెద్దగా గొడవపడిందీ లేదని చెప్పారు.

techie madhukar

నీ సంతోషం కోసం నేను మారతానని, బాగా చూసుకుంటానని మధుకర్.. తనతో చెప్పాడని స్వాతి తెలిపారు. మధుకర్ ఆత్మహత్య చేసుకున్న రోజున (ఏప్రిల్ 3న) ఆయన కొంత డిప్రెషన్‌లో ఉన్నారని స్వాతి చెప్పారు. వీసా పొడగింపు, ఉద్యోగం పోతుందనే భయంతో మధుకర్ కొంత ఆందోళనకు గురయ్యారని చెప్పారు.

తాను మార్నింగ్ 7గంటలకే ఆఫీసుకు వెళ్లిపోయానని. తనకు లంచ్ బాక్స్ కూడా మధుకరే ఇచ్చారని స్వాతి చెప్పారు. ఆత్మహత్యకు సంబంధించిన, నెగిటివ్ ఆలోచనలకు సంబంధించిన విషయాలను నెట్‌లో సెర్చ్ చేశాడని స్వాతి తెలిపారు. కాగా, మధుకర్ మృతదేహానికి మంగళవారం భువనగిరిలో అంత్యక్రియలు జరిగాయి. అయితే, ఇక్కడకు వచ్చిన స్వాతిపై మధుకర్ కుటుంబసభ్యులు దాడి చేశారు. మధుకర్‌ను ఆమే హత్య చేసిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే స్వాతి మీడియా ముందుకు వచ్చారు.

మధుకర్‌ను కాపాడుకోవాలనే చూశా: తప్పుడు ఆరోపణలతో దాడి చేయొద్దు

తాను మధుకర్ ప్రాపర్టీని కూడా అడగలేదని స్వాతి చెప్పారు. తనపై దాడి చేశారు.. తనకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులని ఆమె ప్రశ్నించారు. తన కూతురును ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. తన భర్త శవం ఉండగానే తనపై దాడి చేశారని అన్నారు. తనకు, తన కూతురుకు భద్రతా కల్పించాలని ఈ సందర్భంగా ఆమె పోలీసులను కోరారు. తనపై దాడి చేని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

మధుకర్ ఆత్మహత్యకు తాను కారణం కాదని తన అత్తమామయ్యలకు చెప్పారు. తాను తన భర్తను కాపాడుకునేందుకే ప్రయత్నించానని, సాధ్యం కాలేదని చెప్పారు. ఇంటి విషయాలను బయటికి తీసుకురావొద్దని తన భర్త చెప్పేవారని తెలిపారు. మధుకర్ ఆత్మకు శాంతి కలగాలని అందరం కోరుకుందామని చెప్పారు. దయచేసి పిల్లల మాటలను అర్థం చేసుకోండని ఆమె విజ్ఞప్తి చేశారు.

తన కూతురును కూడా తండ్రి మృతదేహాన్ని కడసారి చూసుకోనివ్వలేదని వాపోయారు.
తమ పేరుపై అమెరికాలో ఒక ఇల్లు మాత్రమే ఉందని చెప్పారు. అది కూడా లోన్‌పై కొన్నామని తెలిపారు. నేను తప్పు చేసి ఉంటే అమెరికా పోలీసులు ఇండియాకే రానిచ్చేవారు కాదని అన్నారు. తన కూతురుపై ఒట్టేసి చెబుతున్నా.. తన భర్త మరణానికి కారణం తాను కాదని స్వాతి చెప్పారు.

తన కూతరును షర్మిష్టను బాగా చూసుకోవాలని స్వాతి అన్నారు. ఇంత చెప్పినా వినకుండా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తారని అనుకోవడం లేదని చెప్పారు. అలా చేస్తే.. 'కుక్కలు మొరుగుతాయి.. వదిలేయాలి' అని తన భర్త చెప్పినట్లు చేస్తానని అన్నారు. తమ జీవితాలను నాశనం చేయొద్దని ఆమె కోరారు. మధుకర్ డిప్రెషన్ మూడ్‌లో ఉంటున్నాడని తెలిపేందుకే తాను తన భర్తతో మాట్లాడిన ఫోన్ సంభాషణను రికార్డు చేశానని, తన తల్లిదండ్రులతోపాటు తన అత్తామామలకు కూడా ఈ రికార్డ్ వినిపించాలనుకున్నట్లు తెలిపారు. కానీ, ఇంతలోనే మధుకర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని తాను ఊహించలేదని స్వాతి తెలిపారు.

English summary
Swathi on Wednesday spoke to media on her husband Madhukar Reddy suicide issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X