వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేష్-స్వాతి కేసులో చిక్కుముడులు: తెల్లచొక్కా వ్యక్తి ఎవరు, ఆ వీడియో స్వాతిదేనా?

కులాంతర వివాహం చేసుకొన్న స్వాతి, నరేష్ ప్రేమ విషాదంగా ముగిసింది.స్వాతి ఆత్మహత్య చేసుకోగా, నరేష్ ను స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి చంపేశాడని పోలీసులు నిర్ధారించారు.అయితే ఈ కేసులో ఇంకా చిక్కుముడులున్నా

By Narsimha
|
Google Oneindia TeluguNews

భువనగిరి: కులాంతర వివాహం చేసుకొన్న స్వాతి, నరేష్ ప్రేమ విషాదంగా ముగిసింది.స్వాతి ఆత్మహత్య చేసుకోగా, నరేష్ ను స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి చంపేశాడని పోలీసులు నిర్ధారించారు.అయితే ఈ కేసులో ఇంకా చిక్కుముడులున్నాయని పోలీసులు చెబుతున్నారు.

ఈ ఏడాది మార్చి 25వ, తేదిన నరేష్, స్వాతి ముంబైలో వివాహం చేసుకొన్నారు. కులాంతర వివాహం చేసుకొన్నందుకుగాను స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి నరేష్ ను హత్య చేశాడు.

మరోసారి ఘనంగా వివాహం చేస్తానని నమ్మించి స్వగ్రామానికి రప్పించి మరీ ఆయన ఈ హత్యకు పాల్పడ్డాడు.నరేష్ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించడంతో నరేష్ ఎలా మరణించాడో ఎట్టకేలకు తేలిపోయింది.

అయితే స్వాతి సెల్పీ వీడియో కు సంబంధించి ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. స్వాతి చనిపోయిన సమయంలో ఎలాంటి వీడియోలు లేవని చెప్పిన కుటుంబసభ్యులు స్వాతి చనిపోయిన మూడు రోజుల తర్వాత బయటకు వచ్చిన సెల్పీ వీడియో సంచలనంగా మారింది.

స్వాతి- నరేష్ కేసులో ఇంకా చిక్కుముడులు

స్వాతి- నరేష్ కేసులో ఇంకా చిక్కుముడులు

ప్రేమ పెళ్ళిచేసుకొని విషాదంగా తనువు చాలించిన ప్రేమికులు నరేష్, స్వాతిల కేసులో ఇంకా చిక్కుముడులున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మహత్య చేసుకొన్న స్వాతి నకెలరోజులు గర్భిణీ. అయితే పోస్టుమార్టంలో ఇది ఆత్మహత్యగా తేలింది. స్వాతి తీసినట్టుగా చెబుతున్న సెల్పీ వీడియోలు పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఇది సెల్పీయా, కాదా అనేది నిర్ధారించుకోవడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఈ వీడియో పై నివేదిక పోలీసులకు కీలకంగా మారనుంది.

తెల్లరంగుచొక్కా ధరించిన వ్యక్తి ఎవరు?

తెల్లరంగుచొక్కా ధరించిన వ్యక్తి ఎవరు?

ఈ నెల రెండవతేదిన రాత్రి పది గంటల సమయంలో సిగరెట్ కాల్చుకోవడానికి ఇంటి నుండి బయటకు వచ్చిన శ్రీనివాస్ రెడ్డికి తన ఇంటి ముందు తెల్లరంగు చొక్కా ధరించిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై సంచరించడాన్ని గమనించాడు.మరో గంట తర్వాత కూడ ఇదే జరిగింది. అయితే అతడెవరో చూద్దామనుకొన్న ఉద్దేశ్యంతో ఇంట్లో ఉన్న సత్తిరెడ్డితో కలిసి మరో బైక్ పై వెంబడించాడు శ్రీనివాస్ రెడ్డి.

అయితే శ్రీనివాస్ రెడ్డి తన వెంట ట్రాక్టర్ రాడ్ ను కూడ తీసుకెళ్ళాడు. 1.5 కి.మీ. వెంటాడిన ద్విచక్ర వావాహనదారుడిని అందుకోలేకపోయారు. అయితే శ్రీనివాస్ రెడ్డి పొలానికి సమీపంలో మరో వ్యక్తి తమ ముందు వెళ్తున్న బైక్ ను ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ, బైక్ ఆగకుండా వెళ్లిపోయింది. ఆ బైక్ ను ఆపేందుకు యత్నించిన వ్యక్తి నరేష్ గా గుర్తించారు శ్రీనివాస్ రెడ్డి.

నరేష్ ను బైక్ పై తీసుకెళ్ళి చంపేశారు

నరేష్ ను బైక్ పై తీసుకెళ్ళి చంపేశారు


నరేష్ తో పాటు వచ్చిన తెల్లచొక్కా ధరించిన వ్యక్తి ఎవరనే విషయాన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉంది. అయితే నరేష్ ను తన పొలం వద్ద చూసిన శ్రీనివాస్ రెడ్డి, సత్తిరెడ్డిలు ఇక్కడ ఏం చేస్తున్నావంటూ ప్రశ్నించారు. బైక్ మధ్యలో నరేష్ ను కూర్చొబెట్టుకొన్నారు. కంది చేను వద్దకు తీసుకెళ్ళారు. నరేష్, సత్తిరెడ్డిలు కూర్చొని మాట్లాడుతుండగా శ్రీనివాస్ రెడ్డి ట్రాక్టర్ రాడ్ తో నరేష్ మెడబాగంలో కొట్టి చంపేశఆడు. దీంతో నరేష్ అక్కడికక్కడే మరణించాడు. పొలంలోనే టైర్లు, పెట్రోలు పోసి తగులబెట్టారు.ముంబైలో తన కూతురు పడిన బాధకు ప్రతీకారంగానే హత్య చేసినట్టు శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు.

ఫేస్ బుక్ తో ప్రేమ పెళ్ళి

ఫేస్ బుక్ తో ప్రేమ పెళ్ళి

యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన టిడిపి మండల నాయకుడు తుమ్మల శ్రీనివాస్ రెడ్డి కూతురు స్వాతితో ఇదే మండలం పల్లెర్ల గ్రామానికి చ ెందిన ఆంబోజు నరేష్ కు రెండేళ్ళ క్రితం పరిచయమేర్పడింది.పల్లెర్లలోని తాత ఇంటి వద్ద ఉంటూ భువనగిరిలో నరేష్ డిగ్రీ చదువుతున్నాడు. స్వాతి వలిగొండలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఫేస్ బుక్ ద్వారా వీరిద్దరికి పరిచయమైంది. వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.ఈ ఏడాది మార్చి 24న, ముంబై వెళ్ళిన స్వాతి, నరేష్ మరునాడే వివాహం చేసుకొన్నారు.

హైద్రాబాద్ కు వచ్చి ముంబై ఎందుకు వెళ్ళింది?

హైద్రాబాద్ కు వచ్చి ముంబై ఎందుకు వెళ్ళింది?

స్వాతి ముంబైకి వెళ్ళిపోవడంతో శ్రీనివాస్ రెడ్డి ఆత్మకూర్ (ఎం) పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశాడు. రామన్నపేట ఇన్స్ పెక్టర్ కోరడంతో ముంబై నుండి నరేష్, స్వాతిలు ఈ ఏడాది మార్చి 27న, రామన్నపేటకు వచ్చారు. అదే రోజు స్వాతి తన తండ్రితో వెళ్ళిపోయింది. నరేష్ ముంబై వెళ్ళిపోయాడు. స్వాతిని ఉప్పల్ లోని ఆమె సోదరి వద్ద ఉంచాడు శ్రీనివాస్ రెడ్డి. ఇదిలా ఉంటే, మార్చి 31న, స్వాతి ముంబైకి వెళ్ళిపోయింది.

English summary
It was a tragic end to a love story that tried to defy all odds. Ten days after Swathi committed suicide, police discovered that her husband Naresh, who was missing since May 2, was murdered by her family members, apparently for their family 'honour'. Rachakonda police on Saturday arrested Swathi's father Srinivas Reddy and cousin Sathi Reddy for the murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X