వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్ ల మీద ట్విస్ట్: స్వాతి ఆరోపణలను ఖండించిన నరేష్ సోదరి నీలిమ, వారిద్దరూ పూణెలోనే

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్వాతి ఆత్మహత్య కేసు, నరేష్ అదృశ్యం కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. నరేష్ , స్వాతిలు ఎక్కువ కాలంపాటు తమ తల్లిదండ్రుల వద్ద లేరని నరేష్ సోదరి ఆరోపించింది.ఈ మేరకు

By Narsimha
|
Google Oneindia TeluguNews

భువనగిరి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్వాతి ఆత్మహత్య కేసు, నరేష్ అదృశ్యం కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. నరేష్ , స్వాతిలు ఎక్కువ కాలంపాటు తమ తల్లిదండ్రుల వద్ద లేరని నరేష్ సోదరి ఆరోపించింది.ఈ మేరకు నరేష్ సోదరి సెల్పీ వీడియో రికార్డు చేసినట్టుగా ఓ తెలుగు మీడియా ఛానల్ ప్రసారం చేసింది.

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నరేష్, స్వాతిలు కులాంతర వివాహం చేసుకొన్నారు. ఈ వివాహం చేసుకొన్న తర్వాత నరేష్ అదృశ్యం కావడం, స్వాతి ఆత్మహత్య చేసుకొంది.అయితే నరేష్ అదృశ్యంపై కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.

అదే సమయంలో స్వాతి ఆత్మహత్య చేసుకొంది. స్వాతి ఆత్మహత్య కేసులో కూడ ట్విస్ట్ చోటుచేసుకొంది. ఆత్మహత్య కు ముందే సెల్పీ వీడియోను రికార్డ్ చేసింది స్వాతి.నరేష్ తో పాటు అతడి కుటుంబసభ్యులపై స్వాతి ఆరోపణలు చేసింది. తనను ఆస్తి కోసం వేధించారని స్వాతి ఆరోపణలు చేసింది.

అయితే ఈ ఆరోపణలపై నరేష్ కుటుంబసభ్యులు తీవ్రంగా ఖండించారు. నరేష్ సోదరి ఈ విషయాన్ని ఖండించారు.ఈ మేరకు నరేష్ సోదరి సెల్పీ వీడియోను రికార్డ్ చేసింది. స్వాతి ఆరోపణలను ఆమెను ఖండించారు.ఈ మేరకు ఓ తెలుగు మీడియా చానల్ ఈ విషయాన్ని ప్రసారం చేసింది.

స్వాతి ఆరోపణల్లో వాస్తవం లేదు

స్వాతి ఆరోపణల్లో వాస్తవం లేదు

ఆత్మహత్య చేసుకోవడానికి ముందుగా స్వాతి సెల్పీ వీడియోలో చేసిన ఆరోపణలు వాస్తవం కాదని నరేష్ సోదరి నీలిమ తేల్చి చెప్పారు.ఈ మేరకు ఆమె కూడ సెల్పీ వీడియో ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.ఈ వీడియోను ఓ తెలుగున్యూస్ ఛానల్ ప్రసారం చేసింది. వివాహమైన తర్వాత నరేష్, స్వాతి తమ తల్లిదండ్రుల వద్ద ఎక్కువ రోజులు లేరని చెప్పారు. తన సోదరుడు. స్వాతి పూణెలో ఉన్నారని ఆమె ఆ వీడియోలో చెప్పారు

వరకట్నం కోసం వేధించారనే స్వాతి ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. అయితే తన సోదరుడిని ఏమైనా చేయగల సత్తా స్వాతి తండ్రికి ఉందని ఆమె ఆరోపించారు. తన తల్లిదండ్రులున్న ముంబైలో కాని, తన సోదరుడు నివాసం ఉన్న పూణెలో వెళ్ళి విచారణ చేస్తే వాస్తవాలు తెలుస్తాయని ఆమె చెప్పారు.

నరేష్ ఎక్కడ?

నరేష్ ఎక్కడ?


ముంబాయి నుండి హైద్రాబాద్ కు తిరిగివచ్చిన తర్వాత నరేష్ అదృశ్యమయ్యాడు. .భువనగిరి బస్టాండ్ లో నరేష్ స్వాతిని ఆమె తండ్రి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించాడు. అ తర్వాత నుండి ఆయన ఆచూకీ కన్పించడం లేదు. దీంతో నరేష్ ఆచూకీ కోసం తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. నరేష్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే స్వాతి ఆత్మహత్యచేసుకోవడం కూడ విషాదం నింపింది.ఇద్దరికీ వివాహం చేస్తానని స్వాతి తండ్రి వారిని హైద్రాబాద్ కు రప్పించారని నరేష్ కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే భువనగిరికి చేరుకొన్న నాటి నుండి నరేష్ ఆచూకీ కన్పించడం లేదు.

స్వాతి డైరీలో ఇంట్రెస్టింగ్ విషయాలు

స్వాతి డైరీలో ఇంట్రెస్టింగ్ విషయాలు

స్వాతి పాకెట్ నోట్ బుక్ లో డైరీ రాసుకొంది. ఈ డైరీలో పలు అంశాలను ఆమె ప్రస్తావించింది. నరేష్ పై తనకున్న ప్రేమను ఆ డైరీలో ఆమె రాసింది. రోజుకో విషయం ఈ ఘటనలో వెలుగుచూస్తున్నాయి. అయితే చావైనా బతుకైనా స్వాతితోనే తేల్చుకొంటానని నరేష్ రాసిన ఉత్తరం ఒకటి ఓ మీడియాఛానల్ ప్రసారం చేసింది. నరేష్ అదృశ్యం కావడానికి ముందుగానే ఈ లేఖ రాసినట్టు ఆ చానల్ ప్రసారం చేసింది. అయితే స్వాతి కూడ నరేష్ పై ప్రేమను తాను రాసుకొన్న డైరీలో వ్యక్తం చేసిది. మరో వైపు నరేష్ కూడ తల్లిదండ్రులకు రాసిన లేఖలో స్వాతితోనే జీవితం అంటూ లేఖ రాశారు.

స్వాతి తండ్రి గత చరిత్రపై పోలీసుల పరిశోథన

స్వాతి తండ్రి గత చరిత్రపై పోలీసుల పరిశోథన

స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి గత చరిత్రను కూడ పోలీసులు తవ్వుతున్నారు. శ్రీనివాస్ రెడ్డికి నేరప్రవృత్తి ఏమైనా ఉందా ఇతరత్రా అంశాలను పరిశీలిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి. నరేష్ అదృశ్యం వెనుక, స్వాతి ఆత్మహత్య వెనుక శ్రీనివాస్ రెడ్డి ప్రమేయం ఏమైనా ఉందా అనే విషయాన్ని పోలీసులు విచారణ చేస్తున్నారు.అయితే అదే సమయంలో ఇంకా ఇతరత్రా అంశాలు ఏమైనా వీటికి దోహదపడ్డాయా అనే కోణంలో కూడ దర్యాప్తు చేస్తున్నారు. జూన్ 1వ, తేదిన హైకోర్టులో నరేష్ ను కోర్టు ముందు హాజరుపర్చాలని ఆదేశించింది.అయితే ఇప్పటివరకు నరేష్ అదృశ్యంపై ఇంకా స్పష్టత రాలేదు. మరో వైపు స్వాతి ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ కాని, సెల్పీ వీడియో కాని లేదని చెప్పిన కుటుంబసభ్యులు, చివరికి ఈ సెల్పీ వీడియో బయటకు రావడం పట్ల కూడ పోలీసులు ఆరాతీస్తున్నారు.

English summary
Naresh sister Neelima condemened swathi allegations.She recorded a selfi video about swati allegations, Telugu news channel telecasted this video.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X