వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ‌లో ప్ర‌మాణాల‌ సీజ‌న్! సిట్టింగ్‌లకు అనుకూలంగా, ప్ర‌తికూలంగా ప్ర‌తిజ్ఞ‌లు!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్: ముంద‌స్తు ఎన్నికల ప్ర‌క‌ట‌న తెలంగాణ ప్రజాప్ర‌తినిధుల ప్రాణా సంక‌టంగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డంతో పాటు గెలుపు కోసం అంద‌రూ క్రుషి చేయాల‌న్న గులాబీ బాస్ ఆదేశాలు తూచా త‌ప్ప‌కుండా పాటించేంద‌కు ప్ర‌జాప్ర‌తినిధులు రెఢీ అవుతున్నారు. ఇదే క్ర‌మంలో కొన్ని స‌ర్క‌స్ ఫీట్ల‌ను త‌ల‌పించే కార్య‌క్ర‌మాల‌కు సైతం రూక‌ల్ప‌న చేసిన‌ట్టు తెలుస్తోంది. ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మ‌ళ్లీ త‌మ స్థానాన్ని ప‌దిలం చేసుకునేందుకు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్న‌ట్టు స‌మాచారం అందుతోంది.

తెలంగాణ‌లో వింత ఆచారం..! టీఆర్ఎస్ కే ఓటేసే విధంగా ప్ర‌మాణాలు.!వ్య‌తిరేకిస్తూ మ‌రో వ‌ర్గం ప్ర‌తిజ్ఞ‌లు..!

తెలంగాణ‌లో వింత ఆచారం..! టీఆర్ఎస్ కే ఓటేసే విధంగా ప్ర‌మాణాలు.!వ్య‌తిరేకిస్తూ మ‌రో వ‌ర్గం ప్ర‌తిజ్ఞ‌లు..!

కొన్ని నియోజ‌క వ‌ర్గాల్లో సిట్టింగుల గెలుపుకోసం నాయ‌కులు విచిత్ర కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌వ్వాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఎన్ని సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టినా, పోలింగ్ బూత్ లోప‌లికి వెళ్లే స‌మ‌యానికి అవి గుర్తుంచుకునే అవ‌కాశం ఉంటుందా అనే సందేహంతో కొత్త కొత్త కార్య‌క్ర‌మాల‌కు టీఆర్ఎస్ నాయ‌కులు రూక‌ల్ప‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. నియోజ‌క వ‌ర్గాల్లో గులాబీ ఓట‌ర్లు త‌మ మ‌న‌సును మార్చుకుని ఇత‌రులకు ఓటు వేయ‌కుండా ఉండేందుకు గులాబీ నాయ‌కులు స‌రికొత్త ప్ర‌యోగాల‌కు శ్రీ‌కారం చుడుతున్న‌ట్టు ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ర్గాలు చెప్పుకొస్తున్నాయి.

సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు అనుకూలంగా ప్ర‌తిజ్ఞ‌లు చేయిస్తున్న నేత‌లు..! వ్య‌తిరేకిస్తున్న మ‌రో వ‌ర్గం ప్ర‌జ‌లు..!

సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు అనుకూలంగా ప్ర‌తిజ్ఞ‌లు చేయిస్తున్న నేత‌లు..! వ్య‌తిరేకిస్తున్న మ‌రో వ‌ర్గం ప్ర‌జ‌లు..!

తెలంగాణ‌లో ఉన్న 119 నియోజ‌క వ‌ర్గాల్లో సిట్టింగ్ స్థానాల‌ను ఎంపిక చేసుకుని ఆ స్థానాల్లో గ‌ట్టి ప్ర‌చారం చేసేందుకు గులాబీ ద‌ళం ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. ప్ర‌భుత్వ ప‌నితీరు ప‌ట్ల అసంత్రుప్తిగా ఉన్న ప్ర‌జానికాన్ని ఎక్క‌డా అస‌హ‌నం వెళ్ల‌గ‌క్క‌కుండా ఉండేలా జాగ్ర‌త్త పడాల‌ని భావిస్తోంది గులాబీ ద‌ళం. ఇచ్చిన హామీల అమ‌లు ప‌ట్ల ఆగ్ర‌హంగా ఉన్న ప్ర‌జానికాన్ని కూడా త‌మ‌వైపు తిప్పుకుని, భ‌విష్య‌త్తులో మంచి చేస్తామ‌నే బుజ్జ‌గింపుల‌కు సిద్ద‌మైంది గులాబీ నాయ‌క‌త్వం. మ‌రోసారి చంద్ర‌శేఖ‌ర్ రావుకు ముఖ్య‌మంత్రిగా అవ‌కాశం ఇస్తే తెలంగాణ స‌ర్వ‌తోముఖాభివ్రుద్ది ఖాయ‌మనే అంశం ప‌ట్ల ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా చేస్తున్నారు టీఆర్ఎస్ నాయ‌కులు. అంతే కాకుండా తెలంగాణ ప్ర‌జానికం తో కారుగుర్తుకే ఓటేస్తామ‌ని నిర్బంద ప్ర‌మాణాలు కూడా చేయిస్తున్నారు గులాబీ నేత‌లు.

నిర్బంద‌పు ప్ర‌మాణాల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అసంత్రుప్తి..! రెండు గ్రూపులుగా విడిపోతున్న ప్ర‌జ‌లు..!!

నిర్బంద‌పు ప్ర‌మాణాల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అసంత్రుప్తి..! రెండు గ్రూపులుగా విడిపోతున్న ప్ర‌జ‌లు..!!

ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్య‌తో తెలంగాణ ప్ర‌జానికం చేత బ‌ల‌వంత‌పు ప్ర‌తిజ్ఞ‌లు చేయిస్తున్నారు తెలంగాణ నాయ‌కులు. తెలంగాణ ప్ర‌భుత్వానికి త‌ప్ప మ‌రే ఇత‌ర పార్టీకి ఓటేసే ప్ర‌స‌క్తే లేద‌ని ప్ర‌మాణం చేయించుకుంటున్నారు. గ్రామంలో అందుబాటులో ఉన్న మ‌హిళ‌ల‌ను, యువ‌త‌ను గ్రామంలోని దేవాల‌యం వ‌ద్ద‌కు ఆహానించి ఇలాంటి ప్ర‌తిజ్ఞ‌లు చేయించుకోండం ప‌ట్ల ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. నాయ‌కుల ఒత్తిళ్ల‌తో ప్ర‌తిజ్ఞ చేస్తున్న‌ప్ప‌టికి మ‌న‌సులో మాత్రం మ‌రోలా అనుకుంటున్న‌రాట తెలంగాణ ప్ర‌జ‌లు. ఐతే ప్ర‌మాణం చేసిన ప్ర‌తి గ్రామ‌స్తుడు కారు గుర్తుకు ఓటేస్తాడా అన్న‌దే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది.

గులాబీ పార్టీకి అనుకూలంగా కొంద‌రు..! ప్ర‌తికూలంగా మ‌రి కొంద‌రి ప్ర‌తిజ్ఞ‌లు..!

గులాబీ పార్టీకి అనుకూలంగా కొంద‌రు..! ప్ర‌తికూలంగా మ‌రి కొంద‌రి ప్ర‌తిజ్ఞ‌లు..!

తెలంగాణ‌లో ఇలాంటి ప్ర‌తిజ్ఞ‌ల ప‌రంప‌ర‌లో కొత్త కోణాలు కూడా ఆవిష్ర్కుతమ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సిట్టింగ్ అభ్య‌ర్థిని మ‌ళ్లీ గెలిపిస్తామ‌ని ప్ర‌భుత్వానికి అనుకూలంగా ప్ర‌తిజ్ఞ చేయిస్తున్న వారికి వ్య‌తిరేకంగా మ‌రో గ్రూపు ఏర్పడుతున్న‌ట్టు తెలుస్తోంది. సిట్టింగ్ అభ్య‌ర్థిని ఎట్టి ప‌రిస్థితిలో ఓడిస్థామ‌ని ఈ గ్రూపు వారు అదే ప్ర‌తిజ్ఞ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో తెలంగాణ ప్ర‌జానికం మ‌ద్య విచిత్ర పరిస్థితులు నెల‌కొన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌బుత్వానికి వ్య‌తిరేకంగా ఒక వ‌ర్గం, అనుకూలంగా మ‌రో వ‌ర్గం ఎవ‌రికి వారు ప్ర‌తిజ్ఞ‌లు చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌భుత్వానికి, సిట్టింగ్ అభ్య‌ర్తుల‌కే తాము ఓటు వేస్తామ‌ని కొంద‌రు ప్ర‌మాణం చేస్తుంటే ఎట్టి ప‌రిస్థితిలో ప్ర‌భుత్వానికి గాని, సిట్టింగ్ అభ్య‌ర్థుల‌కు గాని ఓటు వేయ‌మ‌ని మ‌రో గ్రూపు ప్ర‌తిజ్ఞ చేయ‌డం తెలంగాణ స‌మాజంలో విచిత్రంగా అనిపిస్తోంది. అస‌లు ప్ర‌జ‌ల చేత నిర్బంద ప్ర‌మాణం చేయించ‌డ‌మే విద్వేషాల‌కు కార‌ణ‌మౌతోంద‌నే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి.

English summary
a wondering political actions are taking place in telangana. to get victory in next elections the leaders of telangana taking forceful swearing in favour of government. with this public dividing into two groups in telangana. one grouping supporting trs and another opposing trs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X