హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆరుగురికి స్వైన్ ఫ్లూ: భయంతో నర్సింగ్ స్టూడెంట్స్ ఇలా... (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ఆరుగురు స్వైన్‌ఫ్లూతో హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రుల్లో చేరారు. స్వైన్ ఫ్లూతో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన 31 ఏళ్ల యువకుడు కిమ్స్‌ ఆస్పత్రిలో చేరాడు. హైదరాబాద్‌ రామాంతపూర్‌ నివాసి అయిన 21 ఏళ్ల యువతి సాయివాణి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఏడాది వయసున్న బాలిక కాంటినెంటల్‌ ఆస్పత్రిలో, నిజామాబాద్‌కు చెందిన 57 ఏళ్ల మహిళ కృష్ణ ఆస్పత్రిలో, యాప్రాల్‌కు చెందిన 56 ఏళ్ల మహిళ మాక్స్‌క్యూర్‌ ఆస్పత్రిలో, ఐదేళ్ల బాలిక హోప్‌ చిల్డ్రన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వార్తలు వచ్చాయి.

ఒక్క హైదరాబాద్‌ జిల్లాలోనే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1041 మందికి స్వైన్‌ఫ్లూ సోకింది. కాగా, ఆదిలాబాద్‌ జిల్లా చెందారు చెన్నూర్‌ మండలంలోని శివలింగాపూర్‌ గ్రామానికి చెందిన ఇడుదుల శంకరయ్య(45) మంగళవారం డెంగ్యూతో మృతి చెందాడు. ఉట్నూర్‌ మండలంలోని ఎంకాలో సిందే జ్ఞానోబా(48)అనే వ్యక్తి జ్వరంతో చనిపోయాడు.

స్వైన్ ఫ్లూ భయంతో..

స్వైన్ ఫ్లూ భయంతో..

స్వైన్ ఫ్లూ రెచ్చిపోతుండడంతో భయపడి నర్సింగ్ విద్యార్థినులు మాస్క్‌లు ధరించారు. రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

అవగాహన కల్పించేందుకు..

అవగాహన కల్పించేందుకు..

విస్తృత ప్రచారం ద్వారా స్వైన్ ఫ్లూపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ ఆసుపత్రిలో మందులు, మెడికల్ టెస్టులు ఉచితంగా చేయాలని ఆదేశించింది. జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో నమూనాల సేకరణ చేయనున్నారు.

నారాయణ విజ్ఞప్తి

నారాయణ విజ్ఞప్తి

స్వైన్‌ప్లూపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఆయన గాంధీ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ రోగులను పరామర్శించారు. ప్రజలను అప్రమత్తంగా ఉంచేందుకు ప్రభుత్వం ప్రచార సాధనాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు.

బోర్డులు ఏర్పాటు చేయాలి..

బోర్డులు ఏర్పాటు చేయాలి..

ప్రతి మురికివాడలో స్వైన్‌ఫ్లూపై జాగ్రత్తల తీసుకోవాలనే సూచికలతో బోర్డులు ఏర్పాటు చేయాలని సిపిఐ నేత నారాయఅ అన్నారు.

మాస్క్‌లతో ఇలా..

మాస్క్‌లతో ఇలా..

హైదరాబాదులోని నర్సింగ్ విద్యార్తినులు స్వైన్ ఫ్లూను ఎదుర్కోవడానికి మాస్క్‌లు ధరించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

English summary
Swine Flu is increasing in Telangana state. The nursing students are wearing masks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X