వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌పై అసభ్య వ్యాఖ్యలు: రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు, బిజెపి-కాంగ్రెస్‌కు మందకృష్ణ మద్దతు

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్/హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసభ్య వ్యాఖ్యలు చేసి, హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ అడ్వోకేట్ జెఏసి గురువారం నాడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్‌ను కోరింది.

ప్రశ్నిస్తే దాడులా: కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజకీయ ఐకాస, బిజెపి ముందు ఉండి పోరాటం చేశాయని బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్ష పార్టీలు నిలదీస్తుంటే టిఆర్ఎస్ ఎదురు దాడి చేస్తున్నారని మండిపడ్డారు.

T Advocate JAC complaint against Revanth Reddy

తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంటులో ఆమోదించే సమయంలో కెసిఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి ఎవరిని కలవకుండా ఫాం హౌస్‌కు పరిమితమై పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. హామీల పైన ప్రశ్నిస్తే ఎదురు దాడి విడ్డూరమన్నారు.

బిజెపి, కాంగ్రెస్‌లకు మందకృష్ణ మద్దతు

వరంగల్ ఉప ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీని ఓడించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గురువారం పిలుపునిచ్చారు. తమ మద్దతు బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ఉంటుందన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రోద్బలంతో మాదిగల పైన దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

English summary
Telangana Advocate JAC complaint against Revanth Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X