వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు, హరీష్ రావు కీలకం కానున్నారా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు వచ్చే ఎన్నికల్లో మెదక్ లోకసభ స్థానం నుంచి పోటీ చేయనున్నారా? ఫెడరల్ ఫ్రంట్ కోసం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. వచ్చే లోకసభ ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్‌లో కేసీఆర్ తరఫున హరీష్ రావు కీలకపాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయా? అంటే కొట్టి పారేయలేమని వార్తలు వస్తున్నాయి.

'దేవుడి'కి దూరం: పవన్ కళ్యాణ్‌ను వదిలివెళ్తున్న సన్నిహితులు, నిన్న ఒకరు, రేపు మరొకరు!'దేవుడి'కి దూరం: పవన్ కళ్యాణ్‌ను వదిలివెళ్తున్న సన్నిహితులు, నిన్న ఒకరు, రేపు మరొకరు!

ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నాలు

ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నాలు

ఫెడరల్ ఫ్రంట్‌తో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఫ్రంట్ ఏర్పాటు కోసం తనకు తోడుగా హరీష్ రావు సహకారాన్ని తీసుకోనున్నారని తెలుస్తోంది. ప్రంట్ కోసం ఏర్పాటుతో పాటు ఎన్నికల తర్వాత ఢిల్లీలో కేసీఆర్ తరఫున హరీష్ రావు కీలకపాత్ర పోషించేందుకు మెదక్ లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తారట. అయితే ఈ వార్తలు ఎంత వరకు నిజమో తేలాల్సి ఉంది.

హరీష్ రావు మెదక్ నుంచి పోటీ చేస్తారా

హరీష్ రావు మెదక్ నుంచి పోటీ చేస్తారా

తన తనయుడు కేటీ రామారావును రాష్ట్ర రాజకీయాల్లో మరింత పైకి తీసుకు వచ్చేందుకు కేసీఆర్... హరీష్ రావును జాతీయ రాజకీయాల్లోకి పంపిస్తారనే ప్రచారం గతంలో జరిగింది. ఇప్పుడు ఫ్రంట్ కోసం కేసీఆర్‌కు చేయూతనిచ్చేందుకు మెదక్ నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నారు.

 కేసీఆర్ తరఫున హరీష్ రావు కీలకం

కేసీఆర్ తరఫున హరీష్ రావు కీలకం

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 150 సీట్లకు మించి రావని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 100 సీట్లకు మించి రావని కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఇతర పార్టీలు కీలకంగా మారనున్నాయని భావిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఫెడరల్ ఫ్రంట్ తరఫున కేసీఆర్ కీలకపాత్ర పోషించే ప్రయత్నాలు చేస్తున్నారు. హరీష్ రావు మెదక్ నుంచి పోటీ చేస్తే, కేసీఆర్ తరఫున ఆయనే కీలకం కానున్నారట. అయితే ఇవన్నీ వట్టి ప్రచారాలుగానే కనిపిస్తున్నాయని అంటున్నారు. జాతీయ రాజకీయాల్లోకి హరీష్ రావు వెళ్లరు, కేసీఆర్ పంపించరని చెబుతున్నారు.

English summary
Telangana Rashtra Samiti leader and former minister T. Harish Rao may be asked to contest the Lok Sabha election from Medak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X