వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్ఎస్ ఓటమికి ప్లాన్ వేశాం: టి-టిడిపి, మీ ఇష్టం!: బాబు, అంతలేదన్న దానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రానున్న స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు వ్యూహాలు సిద్ధం చేశామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు తమ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చెప్పారు.

చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాదుకు వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ టిడిపి నేతలు ఆయనతో భేటీ అయ్యారు. రానున్న శాసన మండలి, గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల పైన చర్చించారు. నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్‌లలో పార్టీకి ఉన్న బలం పైన చర్చించారు.

మహబూబ్ నగర్ నుంచి పార్టీ సీనియర్ నేత కొత్తకోట దయాకర్ రెడ్డిని బరిలోకి దించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఈ విషయాన్ని వారు అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారు.

అదే సమయంలో వారు మాట్లాడుతూ... టీఆర్ఎస్‌ను ఓడించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. చంద్రబాబు మాట్లాడుతూ... మీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అవసరాలకు అనుగుణంగా జిల్లాల పర్యటనలను ఖరారు చేసుకోవాలన్నారు.

 T TDP leaders meet Chandrababu Naidu

నాపై చర్యలు తీసుకునే అధికారం ఎవరికీ లేదు: దానం నాగేందర్

తన పైన చర్యలు తీసుకునే అధికారం ఎవరికీ లేదని గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ బుధవారం చెప్పారు. ఈ రోజు సాయంత్రం కలవాలని పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు చెప్పారని ఆయన అన్నారు.

కాగా, దానం నాగేందర్ పైన ఆ పార్టీ ముఖ్య నేతలు చాలా రోజులుగా మండిపడుతున్న విషయం తెలిసిందే. పార్టీ కార్యక్రమాల పట్ల దానం అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో దానం ఎలాంటి కార్యకలాపాలు చేపట్టడం లేదని అంటున్నారు.

ఇలాగే ఉంటే వరంగల్ ఉప ఎన్నిక ఫలితమే గ్రేటర్ ఎన్నికల్లో కూడా పునరావృతమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ అధ్యక్ష పదవి నుంచి దానంను తొలగించాలనే నిర్ణయానికి పీసీసీ వచ్చినట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దానం పైవిధంగా స్పందించారు.

English summary
Telangana TDP leaders met AP CM Chandrababu Naidu on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X