హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోయిన చోటే వెతుక్కునేందుకు తెలంగాణ తెలుగుదేశం ప్ర‌యాత్నాలు...

|
Google Oneindia TeluguNews

తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ ఎక్క‌డ బ‌ల‌హీన ప‌డిందో అక్క‌డ నుండే బ‌లోపేతం చేసేందుకు ముఖ్య నేత‌లు శ్రీకారం చుడుతున్నారు. వ‌రంగ‌ల్ జిల్లాలో ముఖ్య నేత‌లంద‌రూ పార్టీ మారినా నిరుత్సాహ ప‌డాల్సిన అవ‌స‌రం లేదంటూ.. అక్క‌డ నుండే పార్టీని ప‌ట్టాల‌పైకి ఎక్కించి ప‌రుగులు పెట్టించేందుకు పావులు క‌దుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్యాడ‌ర్ ను త‌యారు చేసి పార్టీలో నూత‌న జోష్ నింపుతామంటున్నారు నేత‌లు.అందులో భాగంగా పాత జిల్లాల ప్ర‌కారం ములుగు లో గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఛ‌లో ములుగు పేరుతో ఈ నెల 27న భారీ బ‌హిరంగా స‌భ నిర్వ‌హించాల‌ని టీటిడిపి నాయ‌కులు ప్ర‌ణాళిక‌ల ర‌చిస్తున్నారు.

తెలంగాణ తెలుగుదేశం పార్టీని మ‌లుపు తిప్ప‌నున్న ములుగు స‌భ‌..

తెలంగాణ తెలుగుదేశం పార్టీని మ‌లుపు తిప్ప‌నున్న ములుగు స‌భ‌..

తెలంగాణలో పార్టీ బలోపేతంపై టిడిపి దృష్టి పెట్టింది. సీనియర్లంతా పార్టీని వీడ‌డంతో కొత్త నాయకత్వాన్ని తయారు చేసే పనిలో పడింది టి-టిడిపి నాయ‌క‌త్వం. పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ, తోపాటు ఇతర సీనియర్లకు కొత్త నాయకత్వం తయారు చేసే బాధ్యతలను అప్పగించారు టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.అందులో భాగంగా యువ‌త‌కు పెద్ద పీట వేసి పార్టీలో న‌వ చైత‌న్యం తీసుకొచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు ముఖ్య నేత‌లు. తెలంగాణాలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వర‌కు పార్టీని పున‌రుద్ద‌రించే ప‌నిలో నిమ‌జ్ఞ‌మ‌య్యారు. వ‌చ్చే శ‌ని, ఆది వారాల్లో పార్టీ జాతీయ అద్య‌క్షుడు చంద్ర‌బాబు తెలంగాణా నేత‌ల‌కు అందుబాటులో ఉండే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి పార్టీ బ‌లోపేతం పై నియోజ‌క వ‌ర్గాల వారిగా స‌మావేశాలు నిర్వ‌హించి క‌మీటీలు వేసే అవ‌కాశం ఉంద‌ని సీనియ‌ర్ నేత‌లు భావిస్తున్నారు.

27 న గిరిజ‌న విశ్వ విద్యాల‌యం కోసం ఛ‌లో ములుగు చేప‌ట్టిన టీటీడిపి..

27 న గిరిజ‌న విశ్వ విద్యాల‌యం కోసం ఛ‌లో ములుగు చేప‌ట్టిన టీటీడిపి..

ఆలోపుగా జిల్లా నేత‌ల‌తో స‌మావేశాలు ఏర్పాటు చేసి యువ‌త‌కు అవ‌కాశాలు క‌ల్పంచే అంశాల‌పై చ‌ర్చించేందుకు తెలంగాణా అద్య‌క్షుడుతో పాటు కార్య‌నిర‌వ్వ‌హ‌క అద్య‌క్షుడు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. అంతే కాకుండా ఎక్క‌డైతే పార్టీ బ‌ల‌హీన ప‌డిందో అక్క‌డ నుండే పార్టీకి జ‌వ స‌త్వాలు నింపేందుకు కార్య‌చ‌ర‌ణ స‌ద్దం చేసారు నేత‌లు. ముందుగా వ‌రంగ‌ల్ జిల్లాలో పార్టీని ప‌ట్టాలెక్కించేందుకు నూత‌న కార్యాల‌యాన్ని ప్రారంభిచ‌డ‌మే కాకుండా పార్టీనుండి వెళ్లిపోయిన క్యాడ‌ర్ కు ధీటుగా యువ‌త‌ను త‌యారు చేస్తామంటోంది తెలంగాణా నాయ‌క‌త్వం. కేంద్ర ప్ర‌భుత్వం ములుగులో గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం కోసం అనుమ‌తులు మంజూరు చేసినా రాష్ట్ర ప్ర‌భుత్వం ఎందుకు మీన మేషాలు లెక్కిస్తోంద‌ని టీటిడిపి ప్ర‌శ్నిస్తోంది. విశ్వ విద్యాల‌యం కోసం కేంద్రం ప్ర‌తిపాదించిన భూమిని ఎందుకు కేటాయించ‌లేక పోతోంద‌ని కేసీఆర్ ప్ర‌భుత్వం పై నిప్పులు చెరుగుతున్నారు తెలుగు త‌మ్ముళ్లు.

బ‌ల‌హీన ప‌డ్డ వ‌రంగ‌ల్ జిల్లా నుంచే బ‌లోపేతానికి శ్రీ‌కారం..

బ‌ల‌హీన ప‌డ్డ వ‌రంగ‌ల్ జిల్లా నుంచే బ‌లోపేతానికి శ్రీ‌కారం..

వ‌రంగ‌ల్ జిల్లాలో నేత‌లంద‌రూ అదికార పార్టీలోకి వెళ్లిపోవ‌డంతో అక్క‌డ‌నుండే పార్టీ బ‌లోపేతం పై ద్రుష్టి పెట్టింది తెలంగాణా నాయ‌క‌త్వం. తెలంగాణాలో టీడిపి మ‌న గ‌లిగే పరిస్తితి లేదని చెప్తున్న నేత‌ల‌ వ్యాఖ్య‌ల‌ను కూడా ఛాలెంజ్ గా తీసుకుంది తెలంగాణా శాఖ‌. పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన నాయ‌కుల‌కు క‌నువిప్పు క‌లిగేలా క్యాడ‌ర్ ను త‌యారు చేస్తామ‌ని పార్టీ అద్య‌క్షుడు ర‌మ‌ణ‌ ప్ర‌క‌టించారు. సంక్షోబాల‌ను అదిగ‌మించ‌డం, నాయ‌కుల‌ను త‌యారు చేసుకోవ‌డం తెలుగు దేశం పార్టీకి కొత్తేమి కాదని ఛ‌లో ములుగు పోస్ట‌ర్ విడుద‌ల సంవ‌ద‌ర్బంగా ర‌మ‌ణ తెలిపారు.వ‌రంగ‌ల్ జిల్లాలో పార్టీని రెచ్చ‌గొట్టార‌ని.. క్షేత్ర స్థాయిలో బ‌లప‌డి తెలుగుదేశం సత్తా ఏంటో చూపించాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు నేత‌లు. కాలం చెల్లిన నేత‌ల‌ను అంద‌లం ఎక్కించి అబాసు పాల‌య్యే బ‌దులు యువ‌ర‌క్తాన్ని పార్టీలోకి ఆహ్వానించి ఫ‌లితాన్ని రాబ‌ట్టాల‌నుకుంటోంది టీడిపి. అందులో భాగంగా యూనివ‌ర్సిటి విద్యార్థి నేత‌ల‌తో పాటు తెలుగు విద్యార్థి విభాగం లోని కీల‌క నాయుకుల‌ను క్రియాశీల రాజ‌కీమ‌యాల్లోకి తీసుకుని నూత‌న సాంప్ర‌దాయానికి శ్రీ‌కారం చుట్టేందుకు వ‌రంగ‌ల్ జిల్లానే వేదిక‌గా చేసుకుంటోంది టీడిపి.

ఛ‌లో ములుగు కార్య‌క్ర‌మంలో యువ నాయ‌కుల‌కు కీల‌క బాద్య‌త‌లు..

ఛ‌లో ములుగు కార్య‌క్ర‌మంలో యువ నాయ‌కుల‌కు కీల‌క బాద్య‌త‌లు..

అంతేకాకుండా ఖాళీ ఐన చోటే పార్టీని యువ‌ర‌క్తంతో నింపి ఇత‌ర పార్టీల‌కు స‌వాల్ విస‌రాల‌నుకుంటోంది. తెలంగాణా ముఖ్య నేత‌లు వ‌రంగ‌ల్ లో మ‌కాం వేసి పార్టీ ప‌టిష్ట‌త‌కు తీసుకోవాల్సిన అంశాల‌పై లోతుగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. పార్టీ బ‌లో పేతం కోసం దోహ‌ద‌ప‌డే అన్ని అంశాల‌పై సుధీర్గంగా మంత‌నాలు సాగిస్తున్నారు నేత‌లు. టి సీనియ‌ర్ నేత‌లు పార్టీ మారినా తెలంగాణా తెలుగుదేశం నేత‌ల ఆత్మ విశ్వాసం మాత్రం చెక్కు చెద‌ర లేదు. సంక్షోబాల‌ను అదిగ‌మించి పార్టీకి పూర్వ‌వైభవం తీసుకొస్తామంటున్నారు నేత‌లు. ఛ‌లో ములుగు కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు తెలుగు విద్యార్థి విభాగం నేత‌లు బాద్య‌త‌ల‌ను తీసుకున్నారు. వీరితో పాటు తెలుగు యువ‌త విభాగం కూడా చురుగ్గా పని చేస్తోంది. చేజారిన చోటే అందిపుచ్చుకోవాల‌నే సిద్దాంతంతో వ‌రంగ‌ల్ లోనే పార్టీని ప‌టిష్టం చేసి తీరుతాం అంటున్న నేత‌ల‌కు పార్టీ శ్రేణుల నుండి ఎంలాంటి స‌హ‌కారం ల‌భిస్తుందో చూడాలి.

English summary
telangana tdp planing to protest against trs government. inspite of central government sanction the tribal university in mulugu, trs government unable to allocate the land. thats why to bring pressure on the government, ttdp planning to chalo mulugu agitation on july 27th of this month. and also conduct a huge public meeting there at same day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X