హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సైబర్ టెర్రరిజం ప్రపంచానికే సవాల్: ‘నిసా’లో రాజ్‌నాథ్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రపంచానికి, దేశానికి సైబర్ టెర్రరిజం అత్యంత ప్రమాదకరంగా మారిందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సైబర్ టెర్రరిజంతో దేశ ఆర్థికాభివృద్ధిని దెబ్బ తీసేందుకు ముష్కర మూకలు కాచుకొని ఉన్నాయన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సైబర్ టెర్రరిజంపై సమర భేరి మోగించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

తద్వారా దేశాన్ని ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి సాధించేలా పాటుపాడాలని సిఐఎస్‌ఎఫ్ బలగాలకు పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ హకీంపేటలోని జాతీయ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఎన్‌ఐఎస్‌ఎ)లో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌కు రాజ్‌నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్‌ఐఎస్‌ఎలో 66మంది అసిస్టెంట్ కమాండెట్లు, 459మంది ఎస్‌ఐలు శిక్షణ పూర్తి చేసుకున్నారు.

ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బంది సమాజంలో ఎన్ని ఒత్తిడులు, ఒడిదుడుకులు ఎదురైనా చిరునవ్వుతో విధులు(డ్యూటీ విత్ స్మైల్) నిర్వహించాలని సూచించారు. ప్రపంచంలో భారత్‌కు వసుధైక కుటుంబమనే పేరుందని, దాన్ని నిలబెట్టేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా యావత్ ప్రపంచానికి పెను ముప్పుగా మారిన ఉగ్రవాదదాడుల ప్రభావం ప్రజలపై ఎక్కువకాలం ఉంటుందన్నారు. అప్పట్లో అమెరికాలో ట్విన్ టవర్స్, తాజ్ హోటల్‌పై జరిగిన 26/11, ముంబయి, హైదరాబాద్‌లో జరిగిన వరుస పేలుళ్ల ప్రభావం ఇప్పటికీ ప్రజల్లో కనిపిస్తోందని గుర్తుచేశారు.

రాజ్‌నాథ్

రాజ్‌నాథ్

ప్రపంచానికి, దేశానికి సైబర్ టెర్రరిజం అత్యంత ప్రమాదకరంగా మారిందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

రాజ్‌నాథ్‌తో నాయిని

రాజ్‌నాథ్‌తో నాయిని

సైబర్ టెర్రరిజంతో దేశ ఆర్థికాభివృద్ధిని దెబ్బ తీసేందుకు ముష్కర మూకలు కాచుకొని ఉన్నాయన్నారు.

రాజ్‌నాథ్‌తో నాయిని

రాజ్‌నాథ్‌తో నాయిని

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సైబర్ టెర్రరిజంపై సమర భేరి మోగించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

‘నిసా'లో రాజ్‌నాథ్

‘నిసా'లో రాజ్‌నాథ్

తద్వారా దేశాన్ని ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి సాధించేలా పాటుపాడాలని సిఐఎస్‌ఎఫ్ బలగాలకు పిలుపునిచ్చారు.

‘నిసా'లో రాజ్‌నాథ్

‘నిసా'లో రాజ్‌నాథ్

మంగళవారం హైదరాబాద్ హకీంపేటలోని జాతీయ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఎన్‌ఐఎస్‌ఎ)లో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌కు రాజ్‌నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్‌ఐఎస్‌ఎలో 66మంది అసిస్టెంట్ కమాండెట్లు, 459మంది ఎస్‌ఐలు శిక్షణ పూర్తి చేసుకున్నారు.

‘నిసా'లో రాజ్‌నాథ్

‘నిసా'లో రాజ్‌నాథ్

ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బంది సమాజంలో ఎన్ని ఒత్తిడులు, ఒడిదుడుకులు ఎదురైనా చిరునవ్వుతో విధులు(డ్యూటీ విత్ స్మైల్) నిర్వహించాలని సూచించారు.

‘నిసా'లో రాజ్‌నాథ్

‘నిసా'లో రాజ్‌నాథ్

ప్రపంచంలో భారత్‌కు వసుధైక కుటుంబమనే పేరుందని, దాన్ని నిలబెట్టేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

‘నిసా'లో రాజ్‌నాథ్

‘నిసా'లో రాజ్‌నాథ్

అదేవిధంగా యావత్ ప్రపంచానికి పెను ముప్పుగా మారిన ఉగ్రవాదదాడుల ప్రభావం ప్రజలపై ఎక్కువకాలం ఉంటుందన్నారు.

‘నిసా'లో రాజ్‌నాథ్

‘నిసా'లో రాజ్‌నాథ్

అప్పట్లో అమెరికాలో ట్విన్ టవర్స్, తాజ్ హోటల్‌పై జరిగిన 26/11, ముంబయి, హైదరాబాద్‌లో జరిగిన వరుస పేలుళ్ల ప్రభావం ఇప్పటికీ ప్రజల్లో కనిపిస్తోందని గుర్తుచేశారు.

‘నిసా'లో రాజ్‌నాథ్

‘నిసా'లో రాజ్‌నాథ్

రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. సీఐఎస్‌ఎఫ్‌లో శిక్షణ పొందిన సిబ్బంది నిర్వహించిన విన్యాసాలు ఎంతో ఆకట్టుకున్నాయని అన్నారు.

‘నిసా'లో రాజ్‌నాథ్

‘నిసా'లో రాజ్‌నాథ్

జాతీయ పారిశ్రామిక భద్రత దళం అకాడమి (నిసా)లో నిర్వహించిన అసిస్టెంట్‌ కమాండెంట్‌, సబ్‌ఇన్స్‌పెక్టర్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు ఆయన విచ్చేసి గౌవర వందనం స్వీకరించారు.

‘నిసా'లో రాజ్‌నాథ్

‘నిసా'లో రాజ్‌నాథ్

శిక్షణ పూర్తి చేసిన 525 మంది అసిస్టెంట్‌ కమాండెంట్లు, ఎస్సైలు చేసిన విన్యాసాలను ఆద్యంతం తిలకించారు.

‘నిసా'లో రాజ్‌నాథ్

‘నిసా'లో రాజ్‌నాథ్

తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, నిసా డైరెక్టర్‌ జనరల్‌ సురేందర్‌సింగ్‌ పాల్గొన్నారు.

‘నిసా'లో రాజ్‌నాథ్

‘నిసా'లో రాజ్‌నాథ్

పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్‌ సీఐఎస్‌ఎఫ్‌ సంస్థలో వివిధ విభాగాల్లో సేవలు అందించిన 34 మంది అధికారులు, సిబ్బందికి రాష్ట్రపతి, పోలీస్‌ పతకాలను అందచేశారు.

అలాంటి ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఎన్‌ఐఎస్‌ఎ పోరాటం సాగించాలన్నారు. ప్రపంచం మొత్తం దేశం వైపు చూస్తోందని, వేగంగా వృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థ భారత్‌దేనని అన్నారు. ప్రస్తుతం రెండు ట్రిలియన్ డాలర్లకే పరిమితమైన దేశ ఆర్థిక ప్రగతి ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో రానున్న ఎనిమిదేళ్లలోగా ఏడు ట్రిలియన్ డాలర్లకు చేరుతుందన్న ధీమా వ్యక్తం చేశారు.

దేశ ఆర్థికాభివృద్ధికి ఉగ్రవాదం అడ్డురాకుండా ఎన్‌ఐఎస్‌ఎ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఎన్‌ఐఎస్‌ఎలో ప్రస్తుతం 1.39 లక్షల మంది ఉన్నారని, భవిష్యత్తులో దీనిని రెండు లక్షలకు పెంచుతామన్నారు. అలాగే దేశ రక్షణ రంగంలో మహిళల సంఖ్య పెరగాల్సిన ఆవశ్యకత ఉందని వ్యాఖ్యానించారు.

తాను కేంద్ర హోం మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత హోంశాఖలో జరిగే అన్ని నియామకాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేలా సర్క్యులర్ జారీ చేశానని గుర్తు చేశారు. గతంలో ఎన్‌ఐఎస్‌ఎ సిబ్బంది కేవలం ప్రభుత్వ సంస్థల భద్రతకే పనిచేసేదన్నారు. లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, మోడరనైజేషన్‌తో ఎన్‌ఐఎస్‌ఎ దేశంలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీల భద్రతకు కన్సల్‌టెంట్‌గానూ పనిచేస్తోందని ప్రశంసించారు.

అలాగే వామపక్ష తీవ్రవాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని మైనింగ్, పారిశ్రామిక కార్యకలాపాలు సాఫీగా సాగడంలో, మౌలిక వసతుల కల్పనలో ఎన్‌ఐఎస్‌ఎ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. భవిష్యత్‌లో ఎన్‌ఐఎస్‌ఎ సేవలు మరింత విస్తృతమవుతాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

English summary
The Union Home Minister, Rajnath Singh called upon the CISF officers to prepare themselves to effectively meet the emerging challenges posed by new forms of terrorism, insurgency and stressed upon the growing role of CISF in the changing security scenario, particularly in key areas like VIP security, Disaster Management, Government building security and aviation security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X