వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రైవర్ గురునాధం మృతి: తహసీల్దార్ విజయారెడ్డిని కాపాడబోయి: చికిత్స పొందుతూ కన్నుమూత..!

|
Google Oneindia TeluguNews

తహసీల్దార్ విజయారెడ్డిని కాపాడబోయి తీవ్రంగా గాయాలపాలైన డ్రైవర్ గురునాధం మృతి చెందారు. అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజాయా రెడ్డి పైన పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో ఆమె కార్యాలయం లో నే ప్రాణాలు విడిచారు. తన అధికారి ప్రాణాలు కాపాడేందుకు డ్రైవర్ గురునాధం ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో గురునాధంకు 84 శాతం మేర కాలింది. దీంతో..సిబ్బంది ఆయనను అపోలో డిఆర్ఢీఓ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూనే గురునాధం ప్రాణాలు విడిచారు. అదే విధంగా ఈ దారుణానికి కారణమైన సురేష్ సైతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే ఈ ఘటన పైన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆందోళనలు జరుగుతున్నాయి. పోలీసుల విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

Recommended Video

తహసీల్దార్‌ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి || Oneindia Telugu
Tahasildar Vijayareddy driver Gurunatham died in hospital

అధికారిని రక్షించబోయి..

గురునాధం అబ్దుల్లా పూర్ మెట్ తహసీల్దార్ విజయా రెడ్డి వద్ద డ్రైవర్ గా పని చేస్తున్నారు. తన అధికారి పైన కార్యాలయంలోనే సురేస్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసాడు. ఆ సమయంలో విజయా రెడ్డిని కాపాడేందుకు గురునాధం తీవ్రంగా ప్రయత్నించాడు. ఆ సమయంతో తన ఒంటికి గాయాలు అయ్యాయి. కొద్ది సేపటికే తహసీల్దార్ విజయారెడ్డి అక్కడే ప్రాణాలో కోల్పోయారు. దీంతో..తీవ్రంగా గాయపడిన డ్రైవర్ గురునాధ్ ను కార్యాలయ సిబ్బంది డీఆర్డీఓ అపోలో ఆస్పత్రికి తరలించారు.

తహసీల్దార్ హత్యలో కొత్త కోణాలు: ఆ భూముల పైన పెద్దల కళ్లు: వాంగ్మూలంలో ఇలా..!తహసీల్దార్ హత్యలో కొత్త కోణాలు: ఆ భూముల పైన పెద్దల కళ్లు: వాంగ్మూలంలో ఇలా..!

అప్పటికే గురునాధం శరీరం 84 శాతం కాలిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అయితే, అత్యవసర చికిత్సా విభాగంలో చికిత్స కొనసాగించారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం డ్రైవర్ గురునాధం మృతి చెందారు. దీంతో..ఈ ఘటనలో తహసీల్దార్ విజయా రెడ్డి..డ్రైవర్ గురునాధంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో గాయపడని అటెండర్ చంద్రయ్య ప్రస్తుతం 50 శాతం కాలిన గాయాలతో అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tahasildar Vijayareddy driver Gurunatham died in hospital

విజయారెడ్డి ప్రాణాలు కాపాడాలని..

తహసీల్దార్ కార్యాలయంలోనే తన ఛాంబర్ లో విజయారెడ్డి విధులు నిర్వహిస్తున్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎలాగైనా విజయారెడ్డిని కాపాడాలని డ్రైవర్ గురునాధం..అటెండర్ చంద్రయ్య చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. తొలుత మంటల్లో విజయారెడ్డి కనిపించగానే ఈ ఇద్దరు అయోమయానికి గురయ్యారు. ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో మంటలను సైతం లెక్క చేయకుండా తమ వంతు ప్రమత్నం చేసారు. ఆ సమయంలో వారు సైతం మంటల్లో తీవ్రంగా గాయపడ్డారు.

కారు డ్రైవర్‌ గురునాథ్, అటెండర్‌ చంద్రయ్యను కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఎల్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా, కొద్ది సేపటి క్రితం డ్రైవర్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అటెండర్ చంద్రయ్య చికిత్స పొందుతున్నాడు. మొత్తంగా ఈ వ్యవహారం పైన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు కారకుడైన సురేష్ ప్రస్తుతం ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని దగ్గర నుండి పోలీసులు వాంగ్మూలం సేకరించారు.

English summary
Tahasildar Vijayareddy driver Gurunatham died in hospital. He tried to save Vijayareddy when she was burning. At that time Gurunatham also burned nearly 8 percent. After that He joined in Hospital. Doctors declared his death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X