వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

139 మంది లైంగికదాడి కేసు: యాంకర్ సహా అందరీపై చర్యలు తీసుకొండి: ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ

|
Google Oneindia TeluguNews

దళిత మహిళ గ్యాంగ్ రేప్ ఘటనను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఖండించింది. యువతి జీవితాన్ని చిదిమేసిన యాంకర్, మీడియా ప్రతినిధులు, ఎస్ఎఫ్ఐ, అధికార పార్టీకి చెందిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇవాళ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. 139 మందిలో ఏ ఒక్కరినీ వదిలేయొద్దని.. లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ప్రముఖ యాంకర్..

ప్రముఖ యాంకర్..

బుల్లితెరపై అలరించే యాంకర్.. టీవీ షోలలో నీతి వ్యాఖ్యలు చేస్తూ.. నిజ జీవితంలో నైజం ఇదీ అని సిద్దిపేట జిల్లా అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా నేత కొండ ప్రశాంత్ ధ్వజమెత్తారు. దళిత అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార పార్టీకి చెందిన వారిని వదిలిపెట్టొద్దని.. వదిలేస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని తెలిపారు. ఈ 139 మందిలో అందరూ అగ్రవర్ణాలకు చెందినవారేనని ధ్వజమెత్తారు. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రశాంత్ ఆరోపించారు. యువతిని వేధించినవారిపై ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలన్నారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలతో కలిపి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామ హెచ్చరించారు.

మైనర్‌గా ఉండగానే పెళ్లి..

మైనర్‌గా ఉండగానే పెళ్లి..

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలేనికి చెందిన మహిళ తన గోడును వెల్లబోసుకుంది. మైనర్‌గా ఉండగానే 2009లో మిర్యాలగూడకు చెందిన కే రమేశ్ అనే వ్యక్తితో పెళ్లి చేశారని తెలిపింది. దీంతో ఆమెకు కష్టాలు స్వాగతం పలికాయి. భర్త గాక ఆడపడుచు, అత్త, మామ, సోదరులు.. బంధువులు 20 మంది వరకు వేధించారు. సూటి పోటీ మాటలతోపాటు లైంగికంగా కూడా వేధింపులకు గురిచేశారు. 9 నెలల గడిచిన తర్వాత విషయాన్ని తన తల్లికి చెప్పడంతో మరుసటి ఏడాది భర్త నుంచి విడాకులు తీసుకుంది. తిరిగి పుట్టింటికి చేరి.. అక్కడ చదువుకుంటోంది.

ఉద్యోగం పేరు చెప్పి లైంగికదాడి..

ఉద్యోగం పేరు చెప్పి లైంగికదాడి..

హైదరాబాద్ చేరి చదువు కొనసాగిస్తోండగా మళ్లీ సమస్యల సుడిగుండంలో చేరింది. తమ వసతి గృహనికి సుమన్ అనే వక్తి వచ్చాడని మహిళ తెలిపింది. ఉద్యోగం ఇస్తానని చెప్పి.. లైంగికదాడి చేశాడని పేర్కొన్నది. తర్వాత అతని స్నేహితులు కూడా రేప్ చేశారని వాపోయింది. తనపై లైంగికదాడి చేసిన వారిలో కొందరు సినీనటులు, మాజీ నేత పీఏ కూడా ఉన్నారని వివరించింది. వారు తనతో నగ్నంగా నృత్యాలు చేయించారని.. మద్యం తాగించి వీడియోలు కూడా తీశారని నిట్టూర్చింది. తన జీవితం ఇలా అయ్యేందుకు కారణమైన సుమన్ సెక్స్ రాకెట్ కూడా నిర్వహిస్తున్నామని తెలిపింది.

Recommended Video

#JusticeForSugaliPreethi : Sugali Preethi కి న్యాయం జరిగేది ఎప్పుడు? ఇంత జాప్యమా ? ప్రజల ఆగ్రహం
9 ఏళ్లలో 5 వేల సార్లు లైంగికదాడి

9 ఏళ్లలో 5 వేల సార్లు లైంగికదాడి

9 ఏళ్లలో వారు తనను వివిధ ప్రాంతాలే కాక ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి లైంగికదాడి చేశారని వాపోయింది. వారి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు కూడా అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఇలా 5 వేల సార్లు అత్యాచారం చేశారని బోరున విలపించింది. లైంగికదాడి చేసిన 138 మంది పేర్లను తన ఫిర్యాదులో యువతి రాసింది. బాధితురాలి ఫిర్యాదుతో 42 పేజీల ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.

English summary
take serious action about all 139 members in rape case all india forward bloc party demanded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X