వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తలసాని ఇష్యూ నా పరిధిలో లేదు, తెలంగాణకు ఇంచార్జీనే: భన్వర్‌లాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారం తన పరిధిలో లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ నసీం జైదీని భన్వర్‌లాల్ మంగళవారం కలిశారు.

ఈ సందర్భంగా భన్వర్‌లాల్ మీడియాతో మాట్లాడారు. తలసాని రాజీనామాపై ప్రశ్నించగా ఆ వ్యవహారం తన పరిధిలో లేదని, టిఆర్ఎస్ ప్రభుత్వానికీ తనకూ ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తాను ఏపీ క్యాడర్‌కు చెందిన వాడినని, తెలంగాణకు ఇంచార్జ్‌గా మాత్రమే ఉన్నానని భన్వర్‌లాల్ తెలిపారు.

 Talasani issue is not in my perview: Bhanwarlal

జీహెచ్ఎంసీ పరిధిలో ఆరుశాతం ఓట్లను తొలగించారని, నిజామాబాద్‌ జిల్లాలో 26 శాతం ఓట్లను తొలగించారని, తెలంగాణలోని చాలా చోట్ల ఓట్ల తొలగింపు జరిగిందని చెప్పారు. ఓట్ల తొలగింపుపై విచారణ జరిగిపి చర్యలు తీసుకుంటామన్నారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రకటన వస్తే తప్పకుండా తెలియజేస్తానని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.

కాగా, తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత టిఆర్ఎస్‌లో చేరి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గంలో చేరారు. ఈ వ్యవహారంపై తీవ్ర వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే.

English summary
State election officer Bhanwarlal said that Telangana minister Bhanwarlal issue is not in his perview.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X