తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేవుడికి మొక్కు చెల్లిస్తే తప్పా, దద్దమ్మలే, ఇంకా సిగ్గు రాలేదు: తలసాని

దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తే తప్పేమిటని, తమ హయాంలో ప్రాజెక్టులు కడుతున్నామని, నిరంతర విద్యుత్ ఇస్తున్నామని, ఇవేమీ ఇవ్వని కాంగ్రెస్ నేతలను సన్నాసులు, దద్దమ్మలు అనక మరేమనాలని మంత్రి తలసాని శ్రీనివాస్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తే తప్పేమిటని, తమ హయాంలో ప్రాజెక్టులు కడుతున్నామని, నిరంతర విద్యుత్ ఇస్తున్నామని, ఇవేమీ ఇవ్వని కాంగ్రెస్ నేతలను సన్నాసులు, దద్దమ్మలు అనక మరేమనాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం నాడు ధ్వజమెత్తారు.

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్‌ పార్టీకి కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని, అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామన్నారు.

అవేమీ కాంగ్రెస్‌ పార్టీకి కనపడటం లేదా? అని నిలదీశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కాంగ్రెస్‌ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో బీసీలు ఆత్మగౌరవంతో బతికేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

<strong>తిరుమలకు కేసీఆర్ రూ.5 కోట్ల కానుకలు: విమర్శలపై పరిపూర్ణ జవాబు</strong>తిరుమలకు కేసీఆర్ రూ.5 కోట్ల కానుకలు: విమర్శలపై పరిపూర్ణ జవాబు

Talasani lashes out at Congress leaders

కాంగ్రెస్ నేతల పైన ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పేమీ మాట్లాడలేదన్నారు. 35వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినా, రాష్ట్రం కోసం ఇంత చేస్తున్నా.. ఏం చేయలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, అలాంటప్పుడు సన్నాసులు, దద్దమ్మలు అనక ఏమనాలన్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్వే తప్పని వాళ్ల పార్టీ వాళ్ల నేతలే చెబుతున్నారన్నారు. మార్చి 9వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశముందని, కాంగ్రెస్ నేతలు బాగా కసరత్తు చేసి సమావేశాలకు రావాలన్నారు.

<strong>శ్రీవారిని కేసీఆర్ ఆంధ్రా దేవుడిగా చూల్లేదు: పరిపూర్ణానందకు రాఘవులు కౌంటర్</strong>శ్రీవారిని కేసీఆర్ ఆంధ్రా దేవుడిగా చూల్లేదు: పరిపూర్ణానందకు రాఘవులు కౌంటర్

సీఎం కుర్చీ కోసం కోట్లాటే కానీ, ఎన్నడైనా ఒక్క మంచి పని కాంగ్రెస్ నేతలు చేశారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

అయినా కూడా కాంగ్రెస్ నేతలకు ఇంకా సిగ్గు రాలేదన్నారు. కాంగ్రెస్ నేతలు సన్నాసుల్లాగానే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు.

English summary
Minister Talasani Srinivas Yadav on Sunday lashed out at Congress leaders on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X