హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబూ! తట్టుకోలేవ్: తలసాని తీవ్రఆగ్రహం, జగన్ మీద దాడిపై శ్రీరెడ్డి ట్వీట్, రివర్స్

|
Google Oneindia TeluguNews

Recommended Video

చంద్ర బాబు పై తలసాని మండి పాటు

హైదరాబాద్: విశాఖపట్నం విమానాశ్రయంలో ఏపీ ప్రతిపక్ష వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ను లాగడంపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం మండిపడ్డారు.

ఇబ్బంది పెట్టాలనుకుంటే తట్టుకోలేవ్

ఇబ్బంది పెట్టాలనుకుంటే తట్టుకోలేవ్

బాధ్యత గల ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగినప్పుడు ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన అన్నారు. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము ఎవరితోనే కుమ్మక్కై చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనుకుంటే తట్టుకోలేరని హెచ్చరించారు. ముప్పై ఏళ్లు తాను చంద్రబాబుతో కలిసి టీడీపీలో ఉన్నానని, ఆయన డ్రామాలు నాకు తెలుసునని చెప్పారు. చంద్రబాబు నిన్న మాట్లాడిన విధానం తనకు బాధ కలిగించిందని చెప్పారు. గత కొద్ది నెలలుగా జరుగుతున్న డ్రామాల్లో భాగంగానే ఈ దాడి జరిగిందన్నారు.

ట్విస్ట్: 'జగన్‌పై ప్రాణాపాయంలేని దాడి జోస్యం నిజమైంది, సీఎం చేయాలనే పిచ్చి అభిమానమే'ట్విస్ట్: 'జగన్‌పై ప్రాణాపాయంలేని దాడి జోస్యం నిజమైంది, సీఎం చేయాలనే పిచ్చి అభిమానమే'

సిగ్గులేకుండా మాట్లాడుతున్నారా?

సిగ్గులేకుండా మాట్లాడుతున్నారా?

భ్రష్టుపట్టిన రాజకీయాలతో మీరు బాగుపడలేరని చంద్రబాబును హెచ్చరించారు. అసలు విషయం వదిలి పెట్టి తెలుగుదేశం పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేత జగన్‌కు గాయమైతే కేసీఆర్ వంటి సీఎం పరామర్శిస్తే తప్పుబడతారా అని నిలదీశారు. చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు. ప్రతిపక్ష నేతపై దాడి జరిగినప్పుడు గవర్నర్ డీజీపీతో మాట్లాడితే తప్పేమిటన్నారు. కాగా, తలసాని జగన్‌ను ఆసుపత్రిలో పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

చంద్రబాబు తీరును తప్పుబట్టిన టీ కాంగ్రెస్ నేత

చంద్రబాబు తీరును తప్పుబట్టిన టీ కాంగ్రెస్ నేత

జగన్‍‌కు తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా పరామర్శించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు తీరును ఆయన తప్పుబట్టారు. ఈ ఘటనపై చంద్రబాబు స్పందన బాగా లేదని చెప్పారు. ఇలాంటి సంఘటనలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెప్పారు. జగన్ దాటి ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని అన్నారు.

దాడిపై శ్రీరెడ్డి.. నెటిజన్ల ఝలక్

దాడిపై శ్రీరెడ్డి.. నెటిజన్ల ఝలక్

జగన్ పైన దాడి ఘటనపై శ్రీరెడ్డి స్పందించారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు రివర్స్ అయ్యాయి. మా జగన్ అన్నకు ఏమయింది, రాష్ట్రం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి జగన్ అహర్నిషలు శ్రమిస్తున్నారని, అలాంటి వ్యక్తి మీద ప్రతిపక్షాలు దాడులు చేయడం ఏమిటని, దమ్ముంటే జగన్‌ను ధైర్యంగా ఎదుర్కోవాలని, అంతేకాని జనం కోసం పోరాడుతున్న వారిపై దాడులు సరికాదని, జగనన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొంది. అయితే జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారని, అంతమాత్రం తెలియదా అని నెటిజన్లు ఆమెకు కౌంటర్ ఇస్తున్నారు. జగన్ ఏపీలో ప్రతిపక్షమేనని ఆమెకు గుర్తు చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఎవరో తెలియని స్థితిలో ఉన్నావా అని చురకలు అంటించారు.

English summary
Telangana Minister Talasani Srinivas Yadav fired at AP CM Chandrababu Naidu over attack on YSRCP chief YS Jagan Mohan Reddy issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X