వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌లో శాడిస్ట్ మొగుడు : తరచూ పోన్లో మాట్లాడుతుందని సుత్తితో భార్యను కొట్టి చంపిన భర్త !

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అనుమానం ఒక మహిళను బలితీసుకుంది. ఇద్దరు పిల్లలను తల్లికి దూరం చేసింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎం పహాడీ, సులేమాన్ నగర్ లో ఈ దారుణం జరిగింది. అమాన్ అనే వ్యక్తి గత రెండేళ్లుగా తన భార్య నగ్మా బేగంతో సులేమాన్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు. అమాన్, తన భార్య నగ్మా బేగంపై అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో భార్యను వేధించాడు. వేధింపులు తట్టుకోలేక రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో గతంలోనే కంప్లైంట్ ఇచ్చింది నగ్మా బేగం. పెద్దల సమక్షంలో పోలీసులు కౌన్సెలింగ్ జరపడంతో, తిరిగి అలాంటి తప్పు చేయనని ఒప్పుకుని కేసు విత్ డ్రా చేయించాడు అమాన్. ఐతే, ఆ తర్వాత కూడా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. యధావిధిగా భార్యను వేధించడం మొదలు పెట్టాడు.

talking wife on the phone.!husband Irritated.! Thats it .. hammered on head..!!

తన భార్య ఫోన్ లో ఎవరితో మాట్లాడినా అనుమానిస్తూ వచ్చాడు. ఇటీవల వారిద్దరిపై మనస్పర్థలు పెరిగిపోయాయి. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. కోపంలో అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు భర్త అమాన్. ఇంట్లో ఉన్న సుత్తి తీసుకుని.. భార్య తలపై కొట్టాడు. వద్దంటున్నా ఫోన్లో మాట్లాడుతున్నావంటూ చనిపోయేదాకా దాడిచేశాడు. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత.. ఇంట్లో నుంచి పరారయ్యాడు. ఇంట్లో గొడవ గమనించిన స్థానికులు.. నగ్మా బేగంను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. నగ్మా తండ్రి మాజీ సాబ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు.

English summary
Aman was the most brutally behaved in anger. The hammer in the house was hit by the head. He was talking on the phone and attacked until she died. After confirming that his wife was dead, he left home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X