వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరీ విశాల్: తమిళనాడులో తెలుగోడి సత్తా

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆర్‌కె నగర్ ఉప ఎన్నికల బరిలో నిలిచిన సినీ నటుడు విశాల్ తెలుగు వాడే, విశాల్ బాల్యం హైద్రాబాద్‌లో గడిచింది. విశాల్ కుటుంబం కొంత కాలం హైద్రాబాద్‌లో నివసించింది. అయితే కొన్ని కారణాల రీత్యా విశాల్ కుటుంబం తమ నివాసాన్ని చెన్నైకు మార్చారు. ప్రస్తుతం విశాల్ తమిళ రాజకీయాలతో పాటు హట్ టాపిక్‌గా మారారు.

ఆ ఇద్దరే నాకు స్సూర్తి, కమల్‌ హసన్‌కు ఫోన్ చేస్తా: విశాల్ఆ ఇద్దరే నాకు స్సూర్తి, కమల్‌ హసన్‌కు ఫోన్ చేస్తా: విశాల్

తమిళనాడు రాష్ట్రంలో ఆర్‌కె నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ ఉప ఎన్నికల్లో సినీ నటుడు విశాల్ కూడ బరిలోకి దిగుతున్నాడు. జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత విశాల్ నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు వెళ్ళాడు.

ఆర్‌కె నగర్ బై పోల్: పోటీ చేయనున్న విశాల్, 2021 నాటికి కొత్త పార్టీ?ఆర్‌కె నగర్ బై పోల్: పోటీ చేయనున్న విశాల్, 2021 నాటికి కొత్త పార్టీ?

ఆర్‌కె నగర్ ఉప ఎన్నికల్లో విశాల్ పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారంది. అయితే విశాల్ పోటీ చేయాలనే నిర్ణయం తమిళ రాజకీయాల్లో హట్ టాపిక్ గా మారింది.

చదవండి: జయ సమాధి వద్ద విశాల్, వెనుక ఎవరు: క్యూలో ఇండిపెండెంట్లు షాక్

విశాల్ తెలుగువాడే

విశాల్ తెలుగువాడే

తమిళహీరో విశాల్ తెలుగువాడే. విశాల్ కుటుంబం కొంత కాలం హైద్రాబాద్‌లో నివసించింది. విశాల్ పూర్తి పేరు విశాల్ కృష్ణారెడ్డి, విశాల్ అని ముద్దుగా పిలుస్తారు. జికె రెడ్డి,జానకి దేవి దంపతుల కొడుకు విశాల్. 1977 ఆగష్టు 29న విశాల్ పుట్టాడు. విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణ సినిమా రంగంతో సంబంధాలున్నాయి. విశాల్‌కు ఇద్దరు చెల్లెల్లున్నారు.

 హైద్రాబాద్‌లో విశాల్ విద్యాభ్యాసం

హైద్రాబాద్‌లో విశాల్ విద్యాభ్యాసం

విశాల్ కుటుంబం హైద్రాబాద్‌లో నివసించే సమయంలో విశాల్ బాల్యంలో హైదరాబాదులోని దిల్‌షుర్‌నగర్ పబ్లిక్ స్కూల్లో చదివాడని చెబుతారు. ఆ తర్వాత విశాల్ కుటుంబం హైద్రాబాద్‌ నుండి చెన్నైకు మకాం మార్చారు. దీంతో విశాల్ చదువంతా చెన్నైలోనే సాగింది.విశాల్ సెకండరీ ఎడ్యుకేషన్‌ను చెన్నైలోని డాన్ బోస్కో మెట్రిక్యులేన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పూర్తి చేశాడు. ఆ తర్వాత లయోలా కాలేజీ నుంచి విజ్యువల్ మీడియాలో డిగ్రీ చేశారు.

 విశాల్ తండ్రి పలు సినిమాలకు నిర్మాత

విశాల్ తండ్రి పలు సినిమాలకు నిర్మాత

చెన్నైలో స్థిరపడిన జికె రెడ్డి తమిళ, తెలుగు సినిమాలను నిర్మించారు. అన్న విక్రమ్ కృష్ణ విశాల్ నటించిన పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. సినిమాలకు నిర్మాతగా వ్యవహరించే జికె రెడ్డి ఈ కారణంగానే తన నివాసాన్ని హైద్రాబాద్ ‌నుండి చెన్నైకు మార్చారని చెబుతారు. జెకె రెడ్డి తర్వాత ఆయన కొడుకు విక్రమ్ కృష్ణ కూడ సిని రంగంలోనే కొనసాగాడు. అదే బాటలో విశాల్ కూడ పయనించాడు.

శరత్‌కుమార్‌ను ఓడించిన విశాల్ ప్యానెల్

శరత్‌కుమార్‌ను ఓడించిన విశాల్ ప్యానెల్

దక్షిణ భారత సినీ నటుల సంఘం ఎన్నికల్లో శరత్ కుమార్ ప్యానెల్‌ను విశాల్ ప్యానెల్ ఓడించి సంచలనం సృష్టించింది.ఈ ఎన్నికల సమయంలో సినీ నటి రాధిక విశాల్ తెలుగు వాడని ప్రచారం కూడ చేసింది. అయినా ఆ ఎన్నికల్లో విశాల్ ప్యానెల్ భారీ విజయాన్ని సాధించింది. అయితే శరత్‌కుమార్‌కు వ్యతిరేక వర్గమంతా విశాల్ వెంట నడిచారు. దీంతో ఈ ఎన్నికల్లో విశాల్ ప్యానెల్ విజయం సాధించింది.

 ఆర్‌కె నగర్ ఉప ఎన్నికల్లో

ఆర్‌కె నగర్ ఉప ఎన్నికల్లో

ఆర్‌కె నగర్ ఉప ఎన్నికల్లో అనుహ్యంగా విశాల్ బరిలోకి దిగాడు. అయితే ఈ నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో హట్ టాపిక్‌గా మారింది. అయితే విశాల్ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉంటుందనే ప్రచారం సాగుతోంది. అంతేకాదు భవిష్యత్తులో విశాల్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడ చేస్తున్నారనే ప్రచారం కూడ సాగుతోంది.

English summary
Tamil actor Vishal primary studies completed in Hyderabad. He was studied in Dilsukhnagar public school.Vishal family long back shifted from Hyderabad to Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X