గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'టాప్' లేపిన తెలుగు విద్యార్ధులు: 3వ ర్యాంకులో టాపీ మేస్త్రీ కొడుకు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సీబీఎస్‌ఈ బోర్డు బుధవారం విడుదల చేసిన జేఈఈ-మెయిన్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు అగ్రస్థానంలో నిలిచారు. జాతీయ స్థాయిలో వరుసగా తొలి మూడు స్థానాలను సాధించి ప్రభంజనం సృష్టించారు. ఈ నెల 3వ తేదీన జరిగిన ఈ పరీక్షకు హాజరై 360 మార్కులకు గాను 345 మార్కులు సాధించడం ద్వారా తాళ్లూరి సాయితేజ (రోల్ నెం. 20438099) ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచాడు.

340 మార్కులకో కొండా విఘ్నేష్‌రెడ్డి రెండో స్థానం, 335 మార్కులతో గుంటూరు నగరానికి చెందిన మూల్పురు ప్రశాంత్‌రెడ్డి జాతీయస్థాయిలో మూడవ ర్యాంకర్‌గా నిలిచాడు. కాగా 335 మార్కులతో మరో విద్యార్ధి సొంఠి సాయిఆదిత్య కూడా మూడో స్థానంలో నిలిచి తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశారు.

మూల్పురు ప్రశాంత్‌రెడ్డి తండ్రి శివరామకృష్ణారెడ్డి తాపీమేస్త్రి కావడం విశేషం. గుంటూరులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చదివిన ప్రశాంత్‌రెడ్డి ఇంటర్మ్‌డియట్‌లో 987 మార్కులు సాధించాడు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ముంబై ఐఐటీలో చేరి కంప్యూటర్ సైన్స్ చదవాలనే లక్ష్యంతో ఉన్నట్లు ప్రశాంత్‌రెడ్డి తెలిపాడు.

'టాప్' లేపిన తెలుగు విద్యార్ధులు

'టాప్' లేపిన తెలుగు విద్యార్ధులు


సీబీఎస్‌ఈ నిర్వహించిన ఈ పరీక్షలో మొత్తం 360 మార్కులకు 300లకు పైగా సాధించిన తెలుగు విద్యార్థులు కనీసం 50 మంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ పరీక్షల్లో ఎన్నడూ లేనివిధంగా బాలికలు సైతం మంచి మార్కులను సాధించి ముందంజలో నిలవడం విశేషం. జాతీయస్థాయిలో ఈ నెల 3న జేఈఈ మెయిన్‌ రాత పరీక్ష, 9, 10 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించారు.

'టాప్' లేపిన తెలుగు విద్యార్ధులు

'టాప్' లేపిన తెలుగు విద్యార్ధులు


దేశవ్యాప్తంగా 12 లక్షల మంది పరీక్ష రాయగా తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.40 లక్షల మంది హాజరయ్యారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారినే ఐఐటీల్లో చేరేందుకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు పంపిస్తారు. ఈసారి 2 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు ఎంపిక చేశారు. మెయిన్‌లో వచ్చిన మార్కులకు 60 శాతం వెయిటేజీ ఇస్తారు.

 'టాప్' లేపిన తెలుగు విద్యార్ధులు

'టాప్' లేపిన తెలుగు విద్యార్ధులు


మిగతా 40 శాతానికి ఇంటర్‌ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. జేఈఈ మెయిన్‌ ర్యాంకులను జూన్‌ 30 లేదా ఆలోగా ప్రకటిస్తామని సీబీఎస్‌ఈ పేర్కొంది. గతేడాది వరకు జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణులైన లక్షన్నర మందినే అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు పంపేవారు. ఈసారి ఆ సంఖ్యను 2 లక్షలకు పెంచారు.

'టాప్' లేపిన తెలుగు విద్యార్ధులు

'టాప్' లేపిన తెలుగు విద్యార్ధులు

గతేడాది తెలుగు రాష్ట్రాల నుంచి 18 వేల మందికిపైగా అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధించారు. ఈసారి ఆ సంఖ్య 22-25 వేల వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 22న అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరగనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయాలనుకుంటే శుక్రవారం నుంచి మే 4 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వారు jeeadv.nic.in నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సీబీఎస్‌ఈ సూచించింది.

English summary
Tapi mestri son prasanth reddy gets 3rd rank in jee mains exam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X