వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ ఎన్టీఆర్ - సోదరుడుతో కలిసి నివాళి : కుటుంబ సభ్యులంతా..!!

|
Google Oneindia TeluguNews

టీడీపీ వ్యవస్థాపకులు..మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఎన్టీఆర్ జన్మదినం కావటంతో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ .. సోదరుడు కళ్యాణ రాంతో కలిసి నివాళి అర్పించారు. తెల్లవారు జామునే ఘాట్ వద్దకు సోదరులు ఇద్దరూ తాతకు నివాళి అర్పించి ఆయన్ను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి సైతం నివాళి అర్పించారు. దగ్గుబాటి వేంకటేశ్వర రావు - పురంధేశ్వరి దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చారు. ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పించారు.

ఘాట్ వద్దకు నందమూరి ఫ్యామిలీ

ఘాట్ వద్దకు నందమూరి ఫ్యామిలీ

ఎన్టీఆర్ కుమారులు - కుమార్తెలు - అల్లుళ్లు..కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోతారంటూ లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు. అయితే, కటుంబ సభ్యుల కంటే ముందుగానే జూనియర్ ఎన్టీఆర్ - తారక్ ఇద్దరూ నివాళి అర్పించి వెళ్లిపోయారు. ఇటు..నందమూరి బాలక్రిష్ణ తన తండ్రి ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో శత జయంతి వేడుకలను ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం నిమ్మకూరు చేరుకున్న బాలయ్య..ఈ ఉదయం గ్రామంలోని దేవాలయంలో పూజలు చేసారు.

నిమ్మకూరులో బాలయ్య

నిమ్మకూరులో బాలయ్య

తన తల్లి- తండ్రుల విగ్రహాలకు నివాలి అర్పించారు. అధికారికంగా శత జయంతి వేడుకలను ప్రారంభించారు. తెనాలి వెళ్లనున్న బాలయ్య అక్కడ పెమ్మసాని థియేటర్ లో ఏడాది పాటు ప్రదర్శించే ఎన్టీఆర్ సినిమాలను ప్రారంభించనున్నారు. ఆ తరువాత మహానాడుకు హాజరవుతారు.

ఇక, హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు..హైదరాబాద్ స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి నందమూరి కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. ఇటు మహానాడులోనూ ఎన్టీఆర్ కు పార్టీ అధినేత చంద్రబాబు సహా.. పార్టీ నేతలంతా నివాళి అర్పించనున్నారు.

మహానాడులో శత జయంతి వేడుకలు ప్రారంభం

మహానాడులో శత జయంతి వేడుకలు ప్రారంభం

శత జయంతి వేడుకల క్యాలెండర్ ను చంద్రబాబు ప్రకటిచంనున్నారు. వచ్చే ఏడాది బేగంపేట కేంద్రంగా ఎన్టీఆర్ వందో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని..ఈ ఏడాది మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా కార్యక్రమాలు కొనసాగించాలని ఇప్పటికే డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి ఈ రోజున అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక, నందమూరి అభిమానులతో పాటుగా..టీడీపీ కార్యకర్తలు సైతం ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు.

English summary
Tarak and NAnadamuri Family members visit NTR Ghat and pays tributes on his his 99th birth day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X