వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం ఎక్కడ ప్ల కార్డు ప్రదర్శించింది వీరే, కనుక్కొన్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. ఎవరంటే...

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గ్రేటర్ పరిధిలో పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి నివాసం ప్రగతి భవన్‌లో కూడా కరోనా కలవరం నెలకొంది. సిబ్బందికి వైరస్ సోకిందనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే సీఎం కేసీఆర్ మాత్రం ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు. ఆయన ప్రగతి భవన్ ఎందుకు రావడం లేదు, మీడియాతో ఎందుకు మాట్లాడటం లేదు అని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే బుధవారం ఇద్దరు యువకులు మాత్రం ప్రగతి భవన్ వద్ద మెరుపువేగంతో నిరసన చేసి వార్తల్లో నిలిచారు.

 task force police arrest two youth for show placard..

సీఎం కేసీఆర్ ఎక్కడ, ఆయన మా సీఎం, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం మా హక్కు అంటూ రాసిన ప్ల కార్డు ప్రదర్శించారు. ఆ తర్వాత వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయాడు. రెప్పపాటులో ఘటన జరగడంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. తర్వాత వారు పారిపోగా.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఆ యువకుల వివరాలను పోలీసులు కనుగొన్నారు. అయితే వారు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యులని తేలింది.

Recommended Video

Petrol Diesel Price Hike : గాంధీ భవన్‌‌ ను ముట్టడించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు!!

యువకులు ఎవరు అనే కనుక్కొనే బాధ్యత టాస్క్ ఫోర్స్ పోలీసులు నిమగ్నమయ్యారు. వారిద్దరూ సైదాబాద్‌కు చెందినవారీగా గుర్తించారు. కోట్ల సాయిబాబా (లడ్డు పటేల్), బీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన సాయికుమార్ అని తెలిపారు. వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నామని.. వారిద్దరూ యూత్ కాంగ్రెస్ నేతలు అని పోలీసులు తెలిపారు.

English summary
task force police arrest two youth for show placard in infront of pragathi bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X