హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బస్సుల్లో ప్రయాణికుల వద్ద నుంచి మొబైల్స్ దొంగిలించే గ్యాంగ్ ఇదే (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బస్సు ప్రయాణికుల మొబైల్స్‌ను చోరీ చేస్తున్న ఓ ముఠాను వెస్ట్ జోన్ టాస్క్ పోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్‌ఫోర్క్‌ డీసీపీ లింబారెడ్డి, వెస్ట్‌జోన్‌ సీఐ రాజావెంకట్‌రెడ్డి శుక్రవారం నిందితుల వివరాలను వెల్లడించారు. ఆసిఫ్‌నగర్‌, వెంకటమ్మతోట ప్రాంతానికి చెందిన మహ్మద్‌ యూసుఫ్‌ (42) స్థానిక రౌడీషీటర్‌.

ఇతను టౌలిచౌకీ, బృందావన్‌ కాలనీకి చెందిన కార్ల డీలర్‌ మహ్మద్‌ జకీర్‌ ఆలీ(30), బంజారాహిల్స్‌ ఠాణాలో రౌడీషీటర్‌, ఎన్‌బీటీ కమాన్‌కు చెందిన సయ్యద్‌ నూర్‌(34), రాజేంద్రనగర్‌, చింతల్‌మెట్‌కు చెందిన మహ్మద్‌ షాహేన్‌(31), షేక్‌ వాజిద్‌(26), బంజారా హిల్స్‌, సయ్యద్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ అస్లాం(30), అమన్‌నగర్‌, కలబ్‌కట్టకు చెందిన సుల్తాన్‌ బిన్‌ మహ్మద్‌(26), షఫీ, ఒస్మాన్‌లతో కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు.

వీరంతా కూడా రద్దీగా ఉండే ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రయాణికుల మొబైల్స్‌ను దొంగిలించి తలుపు వద్ద ఉన్న వ్యక్తికి చేరవేసేవారు. అతను బస్సు దిగి వెనుక వస్తున్న నూర్‌, సయ్యద్‌ అస్లాంల ఆటోలోకానీ, బైకుపై కానీ తప్పించుకునేవాడు. చోరీ చేసిన మొబైల్స్‌ను ఆబిడ్స్‌ జగదీష్‌ మార్కెట్‌లోని సుల్తాన్‌ బిన్‌ మహ్మద్‌(26)కు విక్రయించేవారు.

ఈ క్రమంలో వెస్ట్ జోన్ పరిధిలో పెద్ద ఎత్తున ఈ మొబైల్ చోరీ కేసులు నమోదవుతుండటంతో వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిఘా పెట్టి ముఠాలోని ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. సుల్తాన్‌ బిన్‌ మహ్మద్‌ను కూడా అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ఒస్మాన్‌, షఫీల కోసం గాలిస్తున్నారు.

 గజదొంగను అరెస్ట్ చేసిన మాదన్న పేట పోలీసులు

గజదొంగను అరెస్ట్ చేసిన మాదన్న పేట పోలీసులు

పదమూడు ఏళ్లుగా భారీ దొంగతనాలకు పాల్పడుతున్న గజదొంగను మాదన్నపేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.17 లక్షల విలువైన 57 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడిపై ఐదు నాన్ బెయిల్‌బుల్ వారెంట్లు ఉన్నాయి.

గజదొంగను అరెస్ట్ చేసిన మాదన్న పేట పోలీసులు

గజదొంగను అరెస్ట్ చేసిన మాదన్న పేట పోలీసులు

మాదన్నపేట పోలీస్ స్టేషన్‌లో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ శుక్రవారం మీడియా సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. బహుదూర్‌పురా మండలం కిషన్‌బాగ్‌ డివిజన్‌ అసద్‌బాబానగర్‌ బస్తీ చెందిన సయ్యద్‌ షహ్‌జాద్‌(30) వృత్తి కూలి. ప్రవృత్తి చోరీలు. ఇళ్ల తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలను చోరీ చేసేవాడు.

గజదొంగను అరెస్ట్ చేసిన మాదన్న పేట పోలీసులు

గజదొంగను అరెస్ట్ చేసిన మాదన్న పేట పోలీసులు

మాదన్నపేట కూరగాయల మండి వద్ద గురువారం అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడ్ని మాదన్నపేట ఏఎస్సై దానయ్య అదుపులోకి తీసుకున్నారు. ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి.

 గజదొంగను అరెస్ట్ చేసిన మాదన్న పేట పోలీసులు

గజదొంగను అరెస్ట్ చేసిన మాదన్న పేట పోలీసులు

సంతోష్‌నగర్‌ పోలీసు డివిజన్‌కు చెందిన ఠాణాల్లోనే ఇతనిపై పది కేసులున్నాయి. చార్మినార్‌ ఠాణా పరిధిలో 2003లో ఒక కేసులో అరెస్టయ్యాడు. 2014లో మరోసారి అరెస్టై బెయిల్‌పై విడుదలై తప్పించుకు తిరుగుతున్నాడు.

English summary
Task Force Police Arrested Chain Snatchers Gang in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X