హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిసిఎస్ టెక్కీ అనుశ్రీ అచూకీ గుర్తింపు: మతిస్థిమితం కోల్పోయింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గచ్చిబౌలి నుంచి రెండు రోజుల క్రితం అదృశ్యమైన టిసిఎస్ సాఫ్టువేర్ ఇంజినీర్ అనుశ్రీ అచూకీని గుర్తించారు. ఆమె పటాన్‌చెరు సమీపంలోని ఓ చెరువు వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు, పోలీసులు గుర్తించారు. వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

Picture of the day : అంతా ఎరుపే

ఆమెను చెరువు వద్ద గుర్తించిన స్థానిక పోలీసులు ఆమెతో మాట్లాడే ప్రయత్నాలు చేశారు. ఆయితే ఆమె సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో ఆమె మానసిక పరిస్థితి బాగా లేదని భావిస్తున్నారు. ఆమెను స్థానిక పోలీస్ స్టేషన్ తీసుకు వచ్చి.. అనంతరం గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

TCS techie Anushree found at Patancheru

ఆమె చెరువు వద్దకు ఎందుకు వెళ్లిందో కూడా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఎట్టకేలకు అనుశ్రీ ఆచూకీ లభ్యం కావడంతో తల్లిదండ్రులు, సహోద్యోగులు అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

శివారు ప్రాంతాల్లో ఆమె సంచరిస్తున్నట్లు గుర్తించారు. చివరకు పటాన్ చెరు సమీపంలోని చెరువు వద్ద ఆమె ఉన్నట్లుగా గుర్తించారు. కాగా, కర్నాటకకు చెందిన అనుశ్రీ రెండు రోజుల క్రితం అదృశ్యమైన విషయం తెలిసిందే. ఆమె మతిస్థిమితం లేని స్థితిలో ఉన్న ఆమెను హాస్పిటల్లో చేర్చారు.

English summary
TCS techie Anushree found at Patancheru on Wednesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X