వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎర్రబెల్లి, రేవంత్ పోటాపోటీ లేఖలు: స్పీకర్ వద్ద ఉన్న ఆప్షన్లు ఏమిటి?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తమది అసలైన టిడిఎల్పీగా గుర్తించి, తమను తెరాసలో విలీనమైనట్లు గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావు మరో తొమ్మిది మంది శాసనసభ్యులతో కలిసి రాసిన లేఖపైనే కాకుండా, వారిపై అనర్హత వేటు వేయాలని కొత్త టిడిఎల్పీ నేతగా ఎంపికైన రేవంత్ రెడ్డి రాసిన లేఖపై కూడా స్పీకర్ మధుసూదనాచారి ఏం చేస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.

టిడిఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి ఎన్నికైనట్లు లేఖ ఇచ్చినప్పటికీ ఆ విషయాన్ని గుర్తించినట్లు స్పీకర్ కార్యాలయం నుంచి సమాధానం రాలేదు. దీంతో టిడిఎల్పీగా ఏ గ్రూపును స్పీకర్ గుర్తిస్తారనేది విషయం ఉత్కంటను రేపుతోంది.

తెలుగుదేశం పార్టీని వీడిన పదిమంది ఎమ్మెల్యేలు తమను తెరాస సభ్యుల జాబితాలో చేర్చాలని కోరుతున్న వ్యవహారంపై శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి న్యాయ, రాజ్యాంగ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెల్సింది. టిడిపి శాసనసభా పక్షం సభ్యుల్లో మూడింట రెండొంతులుగా ఉన్న తాము తెరాసలో చేరుతున్నామని, టిడిఎల్పీని తెరాస ఎల్పీలో విలీనం చేయాలని ఎర్రబెల్లి దయాకరరావు సభాపతికి లేఖ రాసిన విషయం తెలిసిందే.

TDLP issue: all eyes are on speakerTDLP issue: all eyes are on speaker

టిడిపిన వీడిన పదిమంది ఎమ్మెల్యేల వ్యవహారంపై స్పీకర్ దృష్టి సారించినట్లు తెలిసింది. గతంలోనే కొంత మంది టిడిపి ఎమ్మెల్యేలు తెరాసలో చేరినపుడు వారిపై అనర్హతవేటు వేయాలని, పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని మిగతా టిడిపి ఎమ్మెల్యేలు కోరారు. దీనిపై పలువురు న్యాయస్థానాల్లో కేసులు కూడా వేశారు.

ఈ స్థితిలో తాజాగా 10 మంది ఎమ్మెల్యేలు తమను తెరాస సభ్యులుగా గుర్తించాలని కోరిన విషయంపై ఇప్పుడెలా స్పందించాలి? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? గతంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తినపుడు ఎలా వ్యవహరించారు? ఇతర రాష్ట్రాల్లో ఎలా చేశారన్న విషయాలపై స్పీకర్ పరిశీలిస్తున్నారు.

మూడింట రెండువంతుల మంది సభ్యులు పార్టీ మారుతున్నామని ప్రకటిస్తూ స్పీకర్‌కు లేఖ ఇస్తే అది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి రాదని శాసనసభ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2003లో చేసిన 91వ రాజ్యంగ సవరణను వారు ఉదహరిస్తున్నారు. స్పీకర్ ఇలాగే నిర్ణయం తీసుకోవాలని కూడా ఎక్కడా లేదని, ఇలాంటి వాటిపై ప్రత్యేకంగా చట్టాలు కూడా ఏమీ లేవని కూడా అంటున్నారు.

గతంలో తెలంగాణ శాసనమండలిలో దాదాపు ఇలాంటి పరిస్థితే తలెత్తిందని, అప్పుడు శాసనమండలిలో టిడిపికి ఆరుగురు సభ్యులుంటే వారిలో నలుగురు తెరాసలో చేరుతున్నట్లు లేఖ ఇచ్చారని గుర్తు చేశారు. వారి లేఖ ఆధారంగా శాసనమండలి ఛైర్మన్‌ శాసనమండలి సమావేశాల్లో బులిటెన్‌ విడుదల చేశారని, ఇప్పుడు కూడా ఇక్కడ అలాగే చేయవచ్చని చెబుతున్నారు.

అయితే, మిగిలిన రేవంత్ రెడ్డి, తదితర సభ్యులను ఎలా గుర్తించాలన్న దానిపై స్పష్టత రాలేదు. శాసనమండలిలో మిగిలిన టిడిపి సభ్యుల కాలపరిమితి ముగిసింది. కానీ, ఇక్కడ కాలపరిమితి కనీసం మూడేళ్లు ఉన్నది. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాన్ని స్పీకర్ తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.
స్పీకర్ తీసుకునే నిర్ణయమే అంతిమం అవుతుందని, ఆయన రాబోయే బడ్జెట్‌ సమావేశాల్లోపే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

English summary
All eyes are on Telangana speaker Madhusudanachari on the letters written by Errabelli Dayakar Rao and Revanth Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X