వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌కు షాకింగ్: 'సంక్రాంతి తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుంది!'

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని తెరాస ఘన విజయం సాధించింది. 119 నియోజకవర్గాలకు గాను ఆ పార్టీ 88 సీట్లు గెలుచుకుంది. మరో ఇద్దరు స్వతంత్రులు తెరాసకు మద్దతు పలికారు. మరికొందరు కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

<strong>వైయస్ రాజశేఖర రెడ్డి దెబ్బకు భయపడే చంద్రబాబు వద్దకు కేసీఆర్ వచ్చారా?</strong>వైయస్ రాజశేఖర రెడ్డి దెబ్బకు భయపడే చంద్రబాబు వద్దకు కేసీఆర్ వచ్చారా?

తెరాస గెలిచి దాదాపు ఇరవై రోజులు అవుతోంది. కానీ కేసీఆర్ ఇప్పటి వరకు కేబినెట్‌ను ఖరారు చేయలేదు. ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించలేదు. సంక్రాంతి వరకు పీడ దినాలు ఉండటంతో ఆ తర్వాతే కేబినెట్ విస్తరణ, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. తెరాస గెలిచిన నెల రోజుల తర్వాత కాని కేబినెట్ విస్తరణ జరిగేలా ఉంది.

కేసీఆర్ డబుల్ రోల్

కేసీఆర్ డబుల్ రోల్

ఈ విషయాలను పక్కన పెడితే, తెరాస గెలిచిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఐదు రోజుల పాటు భువనేశ్వర్, కోల్‌కతా, న్యూఢిల్లీలలో పర్యటించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం తనవంతు ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులను కలిసి విభజన హామీలపై చర్చించారు. ఓ వైపు తెలంగాణలో పాలనపై దృష్టి సారిస్తూ, మరోవైపు జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి సారించనున్నారు.

కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు, టీడీపీ నేతల కౌంటర్

కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు, టీడీపీ నేతల కౌంటర్

ఈ నేపథ్యంలో శనివారం నాడు కేసీఆర్ ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రారని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అతి దారుణంగా ఓడిపోతారని కూడా అన్నారు. చంద్రబాబుపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఏపీ టీడీపీ నేతలు, మంత్రులు కూడా కేసీఆర్ పైన ఎదురుదాడికి దిగారు.

వేమూరి ఆనంద్ సూర్య సంచలన వ్యాఖ్యలు

వేమూరి ఆనంద్ సూర్య సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ పైన తెలుగుదేశం పార్టీ నేతలు అన్ని రకాలుగా దాడి ప్రారంభించారు. చంద్రబాబుపై కేసీఆర్ చాలా దారుణంగా మాట్లాడారని, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, ఆయన వ్యాఖ్యలు సరికాదని, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తామని ఏపీ టీడీపీ నేతలు దుయ్యబట్టారు. ఇందులో భాగంగా టీడీపీ సీనియర్ నేత, ఏపీ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

 పీడదినాలు అయిపోయాక తెరాస ప్రభుత్వం కూలుతుంది

పీడదినాలు అయిపోయాక తెరాస ప్రభుత్వం కూలుతుంది

పీడదినాలు అయిపోయిన తర్వాత కేబినెట్ విస్తరించాలని కేసీఆర్ చూస్తున్నారని, కానీ అప్పుడు ఏకంగా తెలంగాణలో తెరాస ప్రభుత్వమే కూలిపోతుందని, తెరాసలో పెద్ద సంక్షోభం రాబోతుందని వేమూరి ఆనంద్ సూర్య జోస్యం చెప్పారు. పీడదినాలు పూర్తయ్యాక తెరాస ప్రభుత్వం కూలిపోవడం మాత్రం ఖాయమని అభిప్రాయపడ్డారు.

 స్పష్టమైన సమాచారం ఉందా అని ప్రశ్నిస్తే

స్పష్టమైన సమాచారం ఉందా అని ప్రశ్నిస్తే

వేమూరి ఆనంద్ సూర్య, తెరాస నేత, ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్‌లు ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. వేమూరి ఆనంద్ సూర్య వ్యాఖ్యలపై శ్రీనివాస్ స్పందిస్తూ.. ఇలాంటి కుట్రలు టీడీపీకి, చంద్రబాబుకు సహజమేనని విమర్శించారు. మొత్తానికి కేసీఆర్‌కు కౌంటర్‌గా వేమూరి ఆనంద్ సూర్య చేసిన వ్యాఖ్యలు హాట్‌గా మారాయి. ఇదే విషయమై సదరు ఛానల్ యాంకర్ మాట్లాడుతూ... ప్రభుత్వం కూలిపోతుందనేందుకు స్పష్టమైన సమాచారం మీ వద్ద ఉందా అని ప్రశ్నించగా... వేమూరి నుంచి సరైన సమాధానం రాలేదు.

 ఆవేశంలో చెప్పారా, సమాచారం ఉందా?

ఆవేశంలో చెప్పారా, సమాచారం ఉందా?

వచ్చే ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు ఘోరంగా ఓడిపోతారని కేసీఆర్ శనివారం నిప్పులు చెరిగిన నేపథ్యంలో ఏపీ టీడీపీ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. ఇందులో భాగంగా వేమూరి కూడా మాట్లాడారు. దీంతో కేసీఆర్ మాట్లాడినందుకు కౌంటర్‌గా ఆక్రోషంతో, ఆవేదనతో మాట్లాడారా లేక వారి వద్ద స్పష్టమైన సమాచారం ఉండి మాట్లాడుతున్నారా అనే చర్చ సాగుతోంది. ఈ వ్యాఖ్యలను కొందరు లైట్‌గా తీసుకుంటే, తెరాస నేతలు కొందరు మాత్రం నిజంగానే చంద్రబాబు మళ్లీ ఏదైనా కుట్ర చేస్తున్నారా అని చెవులు కొరుక్కుంటున్నారట.

English summary
Telugudesam Party leader Vemuri Anand Surya hot comments on K Chandrasekhar Rao government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X