వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ కేసీఆర్: టీడీపీకి 18 సీట్లు, హైదరాబాద్‌పై, చంద్రబాబు కన్ను, కాంగ్రెస్ వెనుక.. తమ్ముళ్లు!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

తెలంగాణ లో టార్గెట్ కేసీఆర్ గా ముందుకు వెళ్తున్నచంద్రబాబు

హైదరాబాద్: మహాకూటమిలో తెలుగుదేశం పార్టీకి 12 స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాత్రం 20కి పైగా స్థానాలు కోరాలని భావించింది. అయితే సోమవారం ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వారికి సీట్లపై చేసిన ఉద్భోతతో తెలుగు తమ్ముళ్లు తగ్గారు.

చదవండి: టిక్కెట్లపై ఎక్కువ ఆశలొద్దు.. 18సీట్లతో సర్దుకుపోదాం, కాంగ్రెస్ గెలుపు ముఖ్యం!: బాబు షాకింగ్

కాంగ్రెస్ పార్టీ మనకు 12 సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, మరికొన్ని స్థానాలు అడుగుదామని చంద్రబాబు చెప్పారు. పొత్తులో భాగంగా తమకు బలం ఉన్న మరో ఆరు స్థానాలను అడగాలని చంద్రబాబు భావిస్తున్నారు. అవసరమైతే కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా 18 స్థానాలతో టీడీపీ సరిపెట్టుకునే అవకాశముంది.

చదవండి: లంచం కేసులో సీబీఐ అధికారుల వార్: రంగంలోకి ప్రధాని నరేంద్ర మోడీ

హైదరాబాదులో ఆరు స్థానాలపై కన్ను

హైదరాబాదులో ఆరు స్థానాలపై కన్ను

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆరు స్థానాలపై తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఉప్పల్ స్థానాలను ఇచ్చేందుకు ఇప్పటికే కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. ఈ మేరకు ఆ పార్టీ టీడీపీకి సంకేతాలు ఇచ్చింది. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌తో పాటు మరో స్థానాన్ని అడుగుతానని చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో చెప్పారు. శేరిలింగంపల్లి నుంచి భవ్య సిమెంట్స్ ఆనంద్ ప్రసాద్‌కు టిక్కెట్ లభించే అవకాశముంది.

నిన్నటి దాకా తెలంగాణలో బలమైన పార్టీ, ఇప్పుడు తోక పార్టీ

నిన్నటి దాకా తెలంగాణలో బలమైన పార్టీ, ఇప్పుడు తోక పార్టీ

ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీలా మారిందని అంటున్నారు. విభజనకు ముందు వరకు, ఇంకా చెప్పాలంటే విభజన బిల్లును పార్లమెంటులో పెట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లోను తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాదులో టీడీపీ సత్తా చాటింది. 2014లో ఎన్ని స్థానాల్లో గెలిచిందో, ఇప్పుడు దాదాపు అటు ఇటుగా అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. అంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ తోక పార్టీలా మారిందని చెప్పవచ్చునని అంటున్నారు.

టార్గెట్ కేసీఆర్

టార్గెట్ కేసీఆర్

చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు, టీడీపీ తీరు చూస్తుంటే కేసీఆర్‌ను టార్గెట్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌తో సీట్ల విషయంలో సర్దుకుపోవాలని, మహాకూటమి గెలుపు కోసమే పని చేయాలని టీడీపీ నేతలకు సూచించారు. తద్వారా చంద్రబాబు టార్గెట్ కేసీఆర్‌గానే కనిపిస్తోంది.

తెలంగాణతో జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయం

తెలంగాణతో జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయం

కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యులతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారని రావుల చంద్రశేఖర రెడ్డి చెప్పారు. తాజా రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చించామని అన్నారు. కూటమి విషయంలో తెలంగాణ టీడీపీ నేతలు, ఎల్ రమణ తీరును చంద్రబాబు ప్రశంసించారని చెప్పారు. జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడేలా కృషి చేయాలని సూచించారని అన్నారు.

చంద్రబాబు ప్రశంసించారు

చంద్రబాబు ప్రశంసించారు

తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, కూటమి అజెండాలను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లామని రావుల చంద్రశేఖర రెడ్డి చెప్పారు. ప్రజా కూటమి గెలుపు లక్ష్యంగా పని చేయాలని చంద్రబాబు చెప్పారని అన్నారు. సీట్ల అంశాన్ని పార్టీ సీనియర్ నేతలు నామా నాగేశ్వర రావు, ఎల్ రమణలు చూసుకుంటారని చెప్పారు. సరైన దిశలో టీటీడీపీ ముందుకు వెళ్తుందని చంద్రబాబు ప్రశంసించారని అన్నారు.

English summary
Telangana Telugudesam party eyeing on Hyderabad, may get 18 seats in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X