వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'వారం రోజులుగా అదే పని, చంద్రబాబును తిట్టేందుకు కేసీఆర్ మంత్రి పదవి పెడతారా?'

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: గత వారం రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మొదలు కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వారి వరకు ఇలా ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసి మాట్లాడటం విడ్డూరమని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శోభారాణి మంగళవారం అన్నారు.

<strong>తెరాస గెలుపుకు ముగ్గురు కారణం, ఎవరంటే, ఇక బాధ్యత నాదే: కూకట్‌పల్లిలో కేటీఆర్</strong>తెరాస గెలుపుకు ముగ్గురు కారణం, ఎవరంటే, ఇక బాధ్యత నాదే: కూకట్‌పల్లిలో కేటీఆర్

చంద్రబాబును తిట్టడం కోసం మంత్రి పదవి పెట్టేలా ఉన్నారు

చంద్రబాబును తిట్టడం కోసం మంత్రి పదవి పెట్టేలా ఉన్నారు

తెలంగాణ రాష్ట్రాన్ని పాలించమని బాధ్యతలు అప్పగిస్తే, వీళ్లు మాత్రం పని గట్టుకొని ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం విడ్డూరమని శోభారాణి అన్నారు. చంద్రబాబును తిట్టడం కోసం కేసీఆర్ ఓ మంత్రి పదవిని పెట్టేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. అందుకోసమే తెరాస నాయకులు పోటీ పడి తిడుతున్నారని విమర్శించారు.

కేసీఆర్ నాలుక కోస్తాం

కేసీఆర్ నాలుక కోస్తాం

చంద్రబాబుపై తెరాస నేతల విమర్శల మీద ఏపీ టీడీపీ నేతలు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. చంద్రబాబుపై ఇష్టానుసారంగా మాట్లాడితే కేసీఆర్ నాలుక కోస్తామని మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా అంతకుముందు హెచ్చరించారు. 40 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్న చంద్రబాబుపై విమర్శలు సరికాదన్నారు. తెలంగాణలో తెరాస గెలిస్తే ఏపీలో వైసీపీ సంబరాలు చేసుకుంటోందని మండిపడ్డారు. ఏపీకి పరిశ్రమలు వచ్చాయంటే అది చంద్రబాబు వల్లే అన్నారు.

కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

గుంతకల్లు పట్టణంలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారు. కేసీఆర్‌కు చంద్రబాబును విమర్శించే స్థాయి లేదన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేదంటే టీడీపీ కార్యకర్తలు బుద్ధి చెబుతారన్నారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

English summary
Telugudesam Party leaders fire at Telangana Chief Minister K Chandrasekhar Rao for blaming AP CM Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X