• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీ టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైద్రాబాద్లో అరెస్ట్, 'కుట్రచేశారు'

By Narsimha
|

హైదరాబాద్:నకిలీ పత్రాలతో భూముల కబ్జాలకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని హైద్రాబాద్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు.అయితే ఈ కేసులో తనను కుట్రచేసి ఇరికించారని ఆయన ఆరోపించారు.

దీపక్ రెడ్డిపై హైద్రాబాద్ నగరంలో పలు భూ కబ్జా కేసులున్నాయి. వందల ఎకరాలను ఆయన అనుచరులు కబ్జాలో ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు దీపక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై భూ కబ్జాలకు సంబంధించిన ఆరు కేసులున్నాయి.

deepak reddy

దీపక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు శాస్త్రీయంగా ఆధారాలను సేకరించి అరెస్టు చేసినట్టు సమాచారం. దీపక్ రెడ్డితో పాటు ఆయన లాయర్ శైలేష్ సక్సేనాతో పాటు మరో బ్రోకర్ ను కూడ పోలీసులు అరెస్టు చేశారు.

దీపక్ రెడ్డి భూ కబ్జాలపై లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు. దీపక్ రెడ్డి మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డికి అల్లుడు. ఇటీవలే ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

కుట్ర చేశారు

పథకం ప్రకారంగానే తనను ఈ కేసులో ఇరికించారని ఏపీ టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆరోపించారు.తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారని చెప్పారు. త్వరలోనే అన్ని విషయాలు వెలుగుచూస్తాయన్నారాయన.

మరోవైపు తనను ఈ కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు.అంతేకాదు దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు దీపక్ రెడ్డి.

English summary
Andhra pradesh state TDP Mlc Deepak Reddy arrested for land grabbing case. hyderababad police arrested on Tuesday night. he has 6 land scam cases in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X