హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ ఏమన్నారు?: టీఆర్ఎస్‌లోకి టీడీపీ ఎంపీ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా బుధవారం ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

బంగారు తెలంగాణనే సాధనగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సి ఉందన్నారు. బంగారు తెలంగాణ కోసం రాజకీయ పునరేకీకరణ అవసరమన్నారు. అందరం కలిసి పనిచేసి అంతిమంగా బంగారు తెలంగాణ సాధించుకోవాలన్నారు.

తెలంగాణ అభివృద్ధి కోసమే అందరూ ఒకే గూటికి వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడకూడదని చెప్పిన ఆయన తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించాలని వచ్చిన మల్లారెడ్డితో పాటు ఆయన వెంట వచ్చిన వారందరికీ సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు చెప్పారు.

పార్టీలో కొత్తగా వచ్చిన మిత్రులను కలుపుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. జూన్ 2వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు పరేడ్ గ్రౌండ్స్‌కు భారీగా తరలిరావాలని సూచించారు. బంగారు తెలంగాణ సాధనలో వంద శాతం అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతామన్నారు.

 టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ ఎంపీ మల్లారెడ్డి

టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ ఎంపీ మల్లారెడ్డి

మల్కాజ్‌గిరి తెలుగుదేశం పార్టీ ఎంపీ మల్లారెడ్డి బుధవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా బుధవారం ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ ఎంపీ మల్లారెడ్డి

టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ ఎంపీ మల్లారెడ్డి

బంగారు తెలంగాణనే సాధనగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సి ఉందన్నారు. బంగారు తెలంగాణ కోసం రాజకీయ పునరేకీకరణ అవసరమన్నారు. అందరం కలిసి పనిచేసి అంతిమంగా బంగారు తెలంగాణ సాధించుకోవాలన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసమే అందరూ ఒకే గూటికి వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

 టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ ఎంపీ మల్లారెడ్డి

టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ ఎంపీ మల్లారెడ్డి

ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడకూడదని చెప్పిన ఆయన తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించాలని వచ్చిన మల్లారెడ్డితో పాటు ఆయన వెంట వచ్చిన వారందరికీ సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. పార్టీలో కొత్తగా వచ్చిన మిత్రులను కలుపుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.

 టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ ఎంపీ మల్లారెడ్డి

టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ ఎంపీ మల్లారెడ్డి

అంతకు ముందు ఎంపీ మల్లారెడ్డి సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని తన నివాసంలో అనుచరులతో సమావేశమై చర్చించారు. బంగారు తెలంగాణలోభాగస్వామ్యమయ్యేందుకు టీఆర్ఎస్‌లో చేరుతున్నానని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు తనను ఆకర్షించాయని, టీఆర్ఎస్‌లో చేరి మల్కాజ్‌గిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం మరింత కృషి చేయనున్నట్లు చెప్పారు.

 టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ ఎంపీ మల్లారెడ్డి

టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ ఎంపీ మల్లారెడ్డి

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ మంచి పథకాలని పేర్కొన్నారు. ఎపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇద్దరూ మంచి విజన్‌ ఉన్న నేతలని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఇద్దరు సీఎంలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

English summary
In a major jolt to the TS TD, Ch. Malla Reddy, the party’s lone Lok Sabha member representing Telangana state, has decided to join the TRS. Mr Malla Reddy will meet TRS chief and TS Chief Minister K. Chandrasekhar Rao at his camp office at 11 am on Wednesday and convey his decision to join the TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X