ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపిలో మరోవికెట్ డౌన్, టిఆర్ఎస్ లోకి రమేష్ రాథోడ్?

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రమేష్ రాథోడ్ టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రమేష్ రాథోడ్ టిఆర్ఎస్

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రమేష్ రాథోడ్ టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రమేష్ రాథోడ్ టిఆర్ఎస్ లో చేరేందుకు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఈ నెల 29, రాథోడ్ టిడిపిని వీడి టిఆర్ఎస్ లో చేరే అవకాశాలున్నాయని సమాచారం.

ఆదిలాబాద్ మాజీ ఎంపి , టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రమేష్ రాథోడ్ టిడిపిని వీడి టిఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం తెలుస్తోంది. 2019 ఎన్నికలలోపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉట్నూర్ లేదా ఖనాపూర్ నుండి ఆయన పోలీచేసేందుకు టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ హామీ ఇచ్చారని సమాచారం.

Tdp senior leader, Adilabad former Mp Ramesh Rathod will join in Trs

టిఆర్ఎస్ లో చేరేలా రాథోడ్ ను ఒప్పించారని సమాచారం.ప్రస్తుతం ఆధిలాబాద్ పార్లమెంట్ స్థానం నుండి టిఆర్ఎస్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న నగేష్ ఒకవేళ్ బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగితే ఆదిలాబాద్ ఎంపీ స్థానం నుండి రమేష్ రాథోడ్ ను పోటీ చేయించే అవకాశాలున్నాయని ప్రచారం కూడ సాగుతోంది.

రాజకీయభవిష్యత్ పై కెసిఆర్ స్పష్టమైన హామీ ఇవ్వడంతో టిఆర్ఎస్ లో చేరేందుకు రమేష్ రాథోడ్ కూడ ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. అయితే రమేష్ రాథోడ్ టిడిపిని వీడి టిఆర్ఎస్ లో చేరేందుకుగాను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మధ్యవర్తిత్వం వహించారని టిఆర్ఎస్ వర్గాలు చెబతున్నాయి.అన్నీ అనుకొన్నట్టుగా జరిగితే ఈ నెల 29, రమేష్ రాథోడ్ టిడిపిని వీడి టిఆర్ఎస్ లో చేరనున్నారు.

English summary
Tdp senior leader, Adilabad former Mp Ramesh Rathod will join in Trs on 29 May 2017, Kcr assured him to his political career.minister Tummala Nageshwar rao coordinate with Ramesh Rathod.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X