వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ వెంట నడిచెదేవరు: లెక్కలు వేస్తున్న టిడిపి, అదే జరిగితే భారీ మూల్యం?

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే వెంట నడిచెదేవరు: అదే జరిగితే భారీ మూల్యం?

హైదరాబాద్:తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే తనతో పాటు ఎవరెవరిని పార్టీలో చేర్చుకొంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

కెసిఆర్‌‌కు వ్యతిరేకంగా రెడ్లు ఏకం కావాలి: జగ్గారెడ్డి సంచలనంకెసిఆర్‌‌కు వ్యతిరేకంగా రెడ్లు ఏకం కావాలి: జగ్గారెడ్డి సంచలనం

తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఇచ్చిన షాక్‌తో ఆ పార్టీ ఇంకా తేరుకోలేదు. నష్టనివారణ చర్యలకు టిడిపి నాయకత్వం ప్రారంభించింది.

కెసిఆర్ కాళ్ళకు దండం పెడితే తప్పేంటీ: రేవంత్‌పై పరిటాల శ్రీరామ్ ఫైర్కెసిఆర్ కాళ్ళకు దండం పెడితే తప్పేంటీ: రేవంత్‌పై పరిటాల శ్రీరామ్ ఫైర్

రాజకీయంగా భవిష్యత్ లేకపోవడం, పార్టీలో చోటుచేసుకొన్న పరిణామాలు పార్టీని తీవ్ర ఇబ్బందుల పాల్జేసింది. దరిమిలా పార్టీని వీడాలనే అభిప్రాయంతో ఉన్నారనే ప్రచారం సాగుతోంది.

అక్టోబర్ 20, తేదిన తెలంగాణ ముఖ్య నేతల సమావేశం నిర్వహించాలని తెలంగాణ టిడిపి నిర్ణయం ీసుకొంది. అయితే కాంగ్రస్ పార్టీలో చేరుతానని వస్తోన్ ప్రచారంపై రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

 రేవంత్‌ పార్టీ వీడితే ఆయనతో వెళ్లేవారెందరు?

రేవంత్‌ పార్టీ వీడితే ఆయనతో వెళ్లేవారెందరు?

రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైందనే ప్రచారం నేపథ్యంలో ఆయనతోపాటు కాంగ్రెస్‌ కండువాలు ఎవరెవరు కప్పుకుంటారనే అంశంపైనే ప్రధానంగా చర్చంతా జరుగుతోంది. బుధవారం రేవంత్‌ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడటం, ఏపీ మంత్రులు, నాయకులపై విమర్శలు చేయడం వంటి అంశాలను పరిశీలిస్తే.. ఆయన కాంగ్రెస్‌కు చేరువ కావడానికి మానసికంగా సిద్ధమైపోయారని అంటున్నారు. ఆయన వెంట ఎంత మంది వెళ్తారన్న విషయం చర్చనీయాంశమవుతోంది. అయితే నష్టనివారణకు టిడిపి ప్లాన్ చేస్తోంది. రేవంత్‌తో పార్టీని వీడాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు.

సగం జిల్లాల అధ్యక్షులంతా రేవంత్ వెంటే

సగం జిల్లాల అధ్యక్షులంతా రేవంత్ వెంటే

ఒకవేళ తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనతో పాటు మెజారిటీ నేతలు కొందరు అభిప్రాయపడున్నారు.పార్టీ మారేందుకు రేవంత్‌తో టచ్‌లో ఉన్న నేతలెవరనే విషయమై చర్చిస్తున్నారు.. రేవంత్ పార్టీ మారినా,... నష్టం వాటిల్లకుండా ఉండేందుకుగాను పార్టీ ముఖ్యుల సమావేశం నిర్ణయించారు.రేవంత్‌తో టచ్‌లో ఉన్న నేతల జాబితాను సిద్దం చేస్తున్నారని సమాచారం.

టిడిపిలో వర్గాలు

టిడిపిలో వర్గాలు


ఏడాది కిందటే టీడీపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయని అంటున్నారు.. పార్టీ శ్రేణుల్లో అత్యధికులు రేవంత్‌ను అధ్యక్షుడిగా చేయాలని అభిప్రాయ సేకరణలో చెప్పినా, చంద్రబాబు ఎల్‌.రమణనే అధ్యక్షుడిగా ప్రకటించారు. అప్పటి నుంచి పార్టీలో ఆధిపత్య పోరు సాగుతూనే ఉంది. ఇటీవల ప్రకటించిన జంబో కార్యవర్గంలో సైతం రేవంత్‌ వర్గానికి చెందిన కొందరికి పదవులు దక్కలేదు. ఆయన చేపట్టే కార్యక్రమాలకు, తీసుకునే నిర్ణయాలకు ఎప్పుడూ కొందరు సీనియర్లు అడ్డుపడుతున్నారని రేవంత్‌ వర్గీయులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లుగా ఓపిక పట్టిన వారంతా పార్టీని వీడాలని ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం.

.టిఆర్ఎస్‌తో పొత్తుకు బాబు సానుకూలమా?

.టిఆర్ఎస్‌తో పొత్తుకు బాబు సానుకూలమా?

. టీఆర్‌ఎస్‌తో పొత్తుకు కొందరు తెలంగాణ నేతలు చంద్రబాబుపై వీరే ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. రేవంత్‌ వెంట ఉన్నారని ప్రచారం జరుగుతున్న జిల్లాల టీడీపీ అధ్యక్షులంతా ఇటీవల సమావేశంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని వాదించారని, కానీ చంద్రబాబు ఆలోచన మరోలా ఉండటంతో టీడీపీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్‌ ఉండదన్న నిర్ణయానికి వచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది

English summary
TDP Telangana unit Working President A Revanth Reddy's reported decision to switch loyalties to Congress stirred a political storm within the yellow party . Mothkupalli has been opposing Revanth proposal to sail the TDP along with Congress in the next elections. The politburo member was demanding party high command joining hands with TRS only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X