• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాబోవు రాజకీయ పరిణామాలను ధీటుగా ఎదుర్కొంటాం.!టీడీపీ తెలంగాణ పగ్గాలు చేపట్టిన ఎల్.రమణ ప్రకటన..!

|

హైదరాబాద్: రానున్న రాజకీయ పరిణమాలను ఛాలెంజ్ గా తీసుకుని పార్టీని విజయతీరాలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలుగుదేశం తెలంగాణ అద్యక్షుడు యల్ రమణ స్పష్టం చేసారు. తెలంగాణ అద్యక్ష మార్పు తప్పదని ఊహాగాణాలు చెలరేగుతున్న తరుణంలో, మళ్లీ రమణ చేతికే పర్టీ పగ్గాలు అప్పగించి ఊహాగాణాలకు తెరదించింది పార్టీ అధిష్టానం. తెలుగుదేశం పార్టీ కమిటీలను పార్టీ జాతీయ అధ్యక్షుడు సోమవారం ప్రకటించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ప్రస్తుత అధ్యక్షుడు ఎల్. రమణను కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకున్నారు.

 రాజకీయాలు ఛాలెంజ్ గా ఎదుర్కొంటాం.. పార్టీని బలోపేతం చేస్తానన్న యల్ రమణ..

రాజకీయాలు ఛాలెంజ్ గా ఎదుర్కొంటాం.. పార్టీని బలోపేతం చేస్తానన్న యల్ రమణ..

ఇటీవలే రమణను తొలగించి, మరొకరిని అవకాశం ఇవ్వాలంటూ పలువురు టీడీపీ నేతలు బహిరంగంగానే చంద్రబాబును డిమాండ్ చేశారు. దీంతో టీటీడీపీలో కాస్త అలజడి రేగింది. కానీ ఈ పరిణామం ఎంత వరకు వాస్తవమో కాదో తెలియదు గానీ ఇలాంటి తిరుగుబాటు దారులను సమర్థవంతంగా కట్టడిచేసారు బాబు. తెలంగాణలో పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో బాద్యతలను మోయడానికి ధైర్యం చేసి, ముందుకు వచ్చిన రమణ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు... ఆయనవైపే మొగ్గు చూపారు. పార్టీ బాద్యతలను మరోసారి కట్టబెడుతున్నట్టు అదికారికంగా ప్రకటించారు.

 తెలుగుదేశం తెలంగాణ శాఖలో కొత్త ముఖాలు.. అవకాశం ఇచ్చిన బాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్న నేతలు..

తెలుగుదేశం తెలంగాణ శాఖలో కొత్త ముఖాలు.. అవకాశం ఇచ్చిన బాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్న నేతలు..

ఇదిలా ఉండగా ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసినిని అధిష్ఠానం ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె తెలుగుదేశం నుంచి కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఇక జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొత్తకోట దయాకర్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షులుగా అశ్వారావు పేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావును టీడిపి అధిష్టానం నియమించించింది. ఇక పార్టీ అత్యున్నతమైన పొలిట్ బ్యూరో విభాగంలో తెలంగాణ నుంచి సీనియర్ నేతలైన రావుల చంద్రశేఖర రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, ఎల్. రమణకు అవకాశం కల్పించారు. జాతీయ అధికార ప్రతినిధులుగా తిరునగరి జోత్స్న, నన్నూరి నర్సిరెడ్డిలను నియమించారు.

 వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటుతాం.. పార్టీకి పూర్వ వైభవం తెస్తానన్న రమణ..

వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటుతాం.. పార్టీకి పూర్వ వైభవం తెస్తానన్న రమణ..

అంతే కాకుండా అద్యక్షుడిగా కొనసాగింపు పొందిన తర్వాత యల్ రమణ మీడియాతో తన భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు 2018 అసెంబ్లీ ఎన్నికల వరకే పరిమితమని స్పష్టం చేసారు. రాబోవు జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం టీడీపీ పోటీ చేస్తుందని తెలిపారు. త్వరలో జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో చర్చించి ఎన్నికల ప్రణాళిక రూపొందించనున్నట్లు యల్. రమణ పేర్కొన్నారు.

  Telangana Telugu Desam Cadre With L. Ramana | నాయకత్వం లో మార్పు ఉండదు .
   పార్లీల్లో అసంతృప్తి సర్వసాధారణం .. అందరిని కలుపుకుని ముందుకు వెళ్తానన్న అద్యక్షుడు..

  పార్లీల్లో అసంతృప్తి సర్వసాధారణం .. అందరిని కలుపుకుని ముందుకు వెళ్తానన్న అద్యక్షుడు..

  ఇదిలా ఉండగా తన పనితీరుపైన, సమర్థత పైన నమ్మకం‌ ఉంది కాబట్టే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా మళ్లీ చంద్రబాబు అవకాశమిచ్చారని రమణ తెలిపారు. తనకంటే సమర్థవంతంగా పార్టీని నడిపేవారుంటే బాధత్యలు అప్పజెప్పమని చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్టు చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీల్లో అసంతృప్తులు ఉండడం, వ్యతిరేక గళాలు వినిపించడం చాలా సహజమని కాలమే కొన్ని సమస్యలకు సమాధానం చెబుతుందని రమణ వివరించారు. సాద్యమైనంత వనరకు పార్టీలో విభేదాలు తలెత్తకుండా ముందుకెళ్లనున్నట్లు తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ వన్ ఇండియాతో స్పష్టం చేశారు.

  English summary
  The Telugu Desam party committees were announced by the party national president on Monday. Incumbent President L.Ramana is the new president of Telangana TDP. Chandrababu Naidu made the final decision to continue L.Ramana.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X