వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా పెళ్ళి ముహుర్తం ఎన్టీఆర్ పెట్టారు, రేవంత్‌తో కాంగ్రెస్‌‌కు నష్టం, కెసిఆర్ మిత్రుడు: మోత్కుపల్లి

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రేవంత్ రెడ్డి కారణంగానే తెలంగాణ రాష్ట్రంలో పార్టీ 22 శాతం నుండి 10 శాతానికి ఓటింగ్ పడిపోయిందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. చంద్రబాబునాయుడు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు సమయాన్ని కేటాయిస్తే పార్టీ పుంజుకొంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఎన్టీఆర్‌ తనకు వివాహ ముహుర్తాన్ని కుదిర్చారని మోత్కుపల్లి నర్సింహులు గుర్తు చేసుకొన్నారు. బతికినంత కాలం ఉంటానని హమీ ఇచ్చానని ఎన్టీఆర్ చనిపోయేవరకు ఆయనతోనే ఉన్నానని నర్సింహ్ములు చెప్పారు.తెలంగాణలో కాంగ్రెస్, టిఆర్ఎస్‌లు తమకు శత్రువులేనని ఆయన తేల్చి చెప్పారు.

ఓ తెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ మంత్రి , టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు పలు అంశాలపై స్పందించారు.రాజకీయరంగ ప్రవేశం నాటి నుండి చోటు చేసుకొన్న పరిణామాలను నర్సింహులు ఆ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

రేవంత్ ఎపిసోడ్ తర్వాత ఏర్పాటు చేసిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో కూడ పది వేల మంది కార్యకర్తలు కూడ హజరు కావడం పార్టీకి ఎలాంటి నష్టం లేదనేది స్పష్టమైందన్నారు. అయితే రాజకీయ విమర్శలు వేరు ఎన్నికల సమయంలో రాజకీయపొత్తులు వేరనే విషయాన్ని నర్సింహులు గుర్తు చేశారు.

 ఎన్టీఆర్ పెళ్ళి ముహుర్తం పెట్టారు

ఎన్టీఆర్ పెళ్ళి ముహుర్తం పెట్టారు

ఎన్టీఆర్ తన వివాహం ముహుర్తం పెట్టారని మాజీ మంత్రి నర్సింహులు గుర్తు చేసుకొన్నారు. తాను విద్యార్థిగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చినట్టు నర్సింహులు చెప్పారు. యూనివర్శిటీ నుండి నేరుగా టిడిపిలో చేరి ఆలేరు నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించినట్టు ఆయన చెప్పారు. 1985లో తాను వివాహం చేసుకోవాలని భావించిన విషయాన్ని ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్ళినట్టు నర్సింహులు చెప్పారు. అయితే ఆ విషయం విని ముహుర్తం గురించి అడిగారని చెప్పారు.అయితే అప్పటికప్పుడు క్యాలెండర్ తెప్పించి తన వివాహ ముహుర్తాన్ని ఎన్టీఆర్ పెట్టారని ఆయన చెప్పారు. తన వివాహనికి ఆయన దగ్గరే ఉన్నారని నర్సింహులు గుర్తు చేసుకొన్నారు. వివాహమైన మరునాడు కొత్త దంపతులను పిలిచి విందు ఇచ్చారని నర్సింహులు గుర్తు చేసుకొన్నారు.

 అందరి చిట్లా ఎన్టీఆర్ వద్ద ఉండేది

అందరి చిట్లా ఎన్టీఆర్ వద్ద ఉండేది

ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసిన సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం సమయంలో బెంగుళూరు హోటల్‌లో ఎమ్మెల్యేతో క్యాంపులు నిర్వహించారని నర్సింహులు గుర్తు చేసుకొన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యేలు హోటళ్ళలో ఏం చేశారనే విషయం ఎన్టీఆర్ తన డైరీలో చిట్టా రాసుకొన్నారని ఆయన చెప్పారు. 1985లో టిక్కెట్ల కేటాయింపు సమయంలో ఈ విషయమై ఎన్టీఆర్ తన వద్ద ఈ అంశాలను ప్రస్తావించారని చెప్పారు. హోటల్ లో భోజనం, లుంగీ, టవల్స్, బ్రష్ లాంటి వాటికి ఖర్చు తప్ప ఇతరత్రా ఖర్చులు తాను పెట్టలేదని ఎన్టీఆర్ వద్ద ప్రస్తావించిన విషయాన్ని నర్సింహులు గుర్తు చేశారు. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ తనను కౌగిలించుకొని తన డైరీలో ఎమ్మెల్యేల చిట్టాను బయటపెట్టాడని నర్సింహులు గుర్తు చేసుకొన్నారు. ఆ తర్వాత 1985లో ప్రభుత్వం ఏర్పాటు కాగానే తనకు మంత్రి పదవిని ఇచ్చారని నర్సింహులు గుర్తు చేసుకొన్నారు.

 1989లో టిక్కెట్టు ఇవ్వలేదు

1989లో టిక్కెట్టు ఇవ్వలేదు

నల్గొండ జిల్లాలో ఆలేరు, భువనగిరి సమితి ప్రెసిడెంట్లుగా బొందుగుల నర్సింహరెడ్డి, ఎలిమినేటి మాధవరెడ్డిలను టిడిపిలోకి తీసుకొచ్చింది తానేనని నర్సింహులు గుర్తు చేశారు. మాధవరెడ్డిని నల్గొండ ఎంపీగా పోటీ చేయించాలని భావించినట్టు చెప్పారు. ఆయితే ఆ సమయంలో రఘుమారెడ్డి ఎంపీగా పోటీ చేయడంతో మాధవరెడ్డిని ఎన్టీఆర్ వద్దకు తీసుకెళ్ళడంతో భువనగరి టిక్కెట్టు ఇస్తానని ఎన్టీఆర్ హమీ ఇచ్చిన విషయాన్ని నర్సింహులు గుర్తు చేశారు.. నల్గొండ జిల్లాకు చెందిన కొందరు టిడిపి నేతలు చెప్పిన మాటలు విన్న ఎన్టీఆర్ 1989లో తనకు టిక్కెట్టు ఇవ్వలేదని చెప్పారు.. ఈ విషయాన్ని ఎన్టీఆర్ తనను పిలిపించి చెప్పారన్నారు. అయితే తాను గెలిచి నా శక్తి ఏమిటో చూపిస్తానని ఎన్టీఆర్ వద్ద సవాల్ చేసి వచ్చానని నర్సింహులు గుర్తు చేశారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఆ ఎన్నికల్లో విజయం సాధించినట్టు నర్సింహులు చెప్పారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నాచారం స్టూడియోలో ఉన్న ఎన్టీఆర్ ను కలిసినట్టు చెప్పారు.తనను ఆప్యాయంగా పిలిచి టిపిన్ పెట్టాడని నర్సింహులు గుర్తు చేసుకొన్నారు. ఆనాడు టిడిపి ప్రతిపక్షంలో ఉందని అయినా తాను టిడిపితోనే ఉన్నానని నర్సింహులు గుర్తు చేసుకొన్నారు.

 1999లోనే కాంగ్రెస్ తరపున పోటీ చేయాల్సి వచ్చింది

1999లోనే కాంగ్రెస్ తరపున పోటీ చేయాల్సి వచ్చింది

ఎన్టీఆర్‌పై తిరుగుబాటు తర్వాత తామంతా ఎన్టీఆర్ వెంటే ఉన్నామని నర్సింహులు చెప్పారు. అయితే ఎన్టీఆర్ మరణించిన తర్వాత ముద్దుకృష్ణమనాయుడు, ఇంద్రారెడ్డి, తాను 1999లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించినట్టు చెప్పారు. అయితే ఆ సమయంలో తాను వారి ఇంటి వద్దకు వెళ్లలేదన్నారు నర్సింహులు.ఎన్టీఆర్ కు సన్నిహితులుగా ఉన్న తామంతా ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లుపై పోటీ చేయాల్సి వచ్చిందని నర్సింహులు చెప్పారు.

చంద్రబాబు ఆహ్వనించారు

చంద్రబాబు ఆహ్వనించారు

ఎలిమినేటి మాధవరెడ్డి మరణించిన తర్వాత ఆయన సతీమణి ఉమా మాధవరెడ్డి రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో ఈ పరిణామాన్ని స్వాగతించినట్టు నర్సింహులు చెప్పారు. అయితే అదే సమయంలో తన ఇంటికి అప్పటి టిడిపి నేతలు గుత్తా సుఖేందర్ రెడ్డి, సోమిరెడ్డిలు వచ్చారని చెప్పారు. ఆ సమయంలోనే చంద్రబాబునాయుడు కూడ ఉమా మాధవరెడ్డికి మద్దతివ్వాలని కోరారని ఆయన చెప్పారు. ఉమా మాధవరెడ్డికి మద్దతిచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తనను సస్పెండ్ చేసిందన్నారు. అయితే పార్టీలో పనిచేయాలని బాబు ఆనాడు తనను కోరారని నర్సింహులు చెప్పారు. అప్పటి నుండి పార్టీలోనే కొనసాగుతున్నట్టు చెప్పారు.

 రేవంత్ తో కాంగ్రెస్ కు తీవ్ర నష్టం

రేవంత్ తో కాంగ్రెస్ కు తీవ్ర నష్టం

కాంగ్రెస్ పార్టీ కూడ భవిష్యత్ లో రేవంత్ కారణంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని మోత్కుపల్లి నర్సింహులు అభిప్రాయపడ్డారు. టిడిపిని కూడ రేవంత్ తీవ్రంగా నష్టపర్చారని ఆయన చెప్పారు. 22 శాతంగా ఉన్న టిడిపి ఓటింగ్ ను 10 శాతానికి పడిపోయేలా రేవంత్ చేశారని నర్సింహులు ఆరోపించారు. ఓటుకు నోటు కేసు విషయంలో పార్టీకి సంబంధం లేదన్నారు. రేవంత్ వ్యక్తిగతంగా తీసుకొన్న నిర్ణయం కారణంగానే ఈ కేసులో ఇరుక్కొన్నాడని నర్సింహులు చెప్పారు.

 కెసిఆర్ పై వ్యక్తిగత ద్వేషం లేదు

కెసిఆర్ పై వ్యక్తిగత ద్వేషం లేదు

కెసిఆర్‌పై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని నర్సింహులు చెప్పారు. పార్టీ అధినేతను రోజు విమర్శిస్తే పార్టీ ఉనికిని నిలబెట్టేందుకు కెసిఆర్ పై విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. కెసిఆర్ తనకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడని ఆయన చెప్పారు. టిడిపిలో కెసిఆర్ ఉన్న కాలంలో 10 ఏళ్ళ పాటు తామిద్దరం ఒకే మంచం, ఒకే కంచం అనే పరిస్థితిలో ఉన్నామని ఆయన గుర్తు చేశారు.

 బాబు టైమిస్తే పరిస్థితి మరోలా ఉంటుంది

బాబు టైమిస్తే పరిస్థితి మరోలా ఉంటుంది

తెలంగాణలో పార్టీ బలోపేతమయ్యేందుకు అన్ని అవకాశాలున్నాయని నర్సింహులు చెప్పారు. తెలంగాణ పార్టీ కోసం బాబు సమయాన్ని కేటాయిస్తే పార్టీ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉందని నర్సింహులు చెప్పారు.బాబు సమయాన్ని కేటాయించకపోతే పార్టీ మరింత దెబ్బతినే పరిస్థితి లేకపోలేదన్నారు. అయితే తెలంగాణలో టిడిపి అధ్యక్ష పదవిని , ఎంపీ పదవిని తనకు గతంలోనే కేటాయిస్తే పార్టీ పరిస్థితి మరోలా ఉండేదని నర్సింహులు అభిప్రాయపడ్డారు.

English summary
Former minister Motkupalli Narasimhulu said that Tdp voting decreased to 10 percent from 22 percent, because of Revanth Reddy. A telugu channel interviewed him recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X