వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటర్ స్లిప్ లేదని టెన్షన్ ఎందుకు దండగ...! TE-POLL యాప్ ఉండగా...!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఓటర్ స్లిప్ రాలేదని బెంగ పడొద్దంటున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు. కొత్తగా ప్రవేశపెట్టిన TE-POLL యాప్ తో మీ ఓటర్ స్లిప్పులు మీరే పొందొచ్చని చెబుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో తొలిసారిగా ఈ సరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది.

te-poll app for voter slips

పంచాయతీ ఎన్నికల ప్రక్రియను స్పెషల్ సాఫ్ట్‌వేర్ తో నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా TE-POLL యాప్ ను తెరపైకి తెచ్చారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా.. ఓటర్ స్లిప్పుల కోసం ఎక్కడెక్కడో తిరగకుండా ఉన్నచోటు నుంచే డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

te-poll app for voter slips

ఆండ్రాయిడ్ ఫోన్లల్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి TE-POLL యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేసి జిల్లాతో పాటు ఓటర్ ఎపిక్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు.. ఓటర్ స్లిప్పులు డౌన్‌లోడ్ అవుతాయి. ఈ యాప్ ను తొలిసారిగా తెలంగాణలోనే వినియోగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల సమాచారం అందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఇప్పటికే tsec.gov.in అనే వెబ్ సైట్ ను అందుబాటులో ఉంచారు ఎన్నికల సంఘం అధికారులు. పంచాయతీ తొలివిడత ఎన్నికలు ఈనెల 21న ప్రారంభం కానున్నాయి. అయితే ఓటర్ స్లిప్పులు రాలేదని కంగారు పడకుండా ఈ యాప్ తో డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

English summary
This is a good news to the Voters who are worried about their voter slip. Telangana state EC has introduced a new app by name TE-POLL where in a voter can download his voter slip. For this voter needs to enter his district name and epic number said EC
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X