• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్రియుడి మోజులో టెక్కీ భర్త హత్య: చిన్న క్లూతో వీడిన మిస్టరీ

By Pratap
|

నల్లగొండ: ప్రియుడి మోజులో టెక్కీ భర్తను హత్య చేసిన భార్య చిన్న పొరపాటుతో పోలీసులకు చిక్కింది. పక్కా పథకం ప్రకారం భర్తను హత్య చేసిన భార్య చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది.

  Another Nagarkurnool Swathi Found : మరో స్వాతి: ప్రియుడితో రాసలీలలు, హత్య

  టెక్కీ భర్త హత్య, ప్రియుడితో సంబంధం: 'ప్లాన్ అంతా భార్యదే, ఆ వీడియోలు చూపించేది'టెక్కీ భర్త హత్య, ప్రియుడితో సంబంధం: 'ప్లాన్ అంతా భార్యదే, ఆ వీడియోలు చూపించేది'

  హతుడి జేబులో వదిలి పెట్టిన చిన్న చీటీ ఆధారంగా చౌటుప్పల్ పోలీసులు కేసును ఛేదించారు. భర్తను హత్య చేసిన సంఘటనలో భార్య, ప్రియుడు, అతని ముగ్గురు మిత్రులను అరెస్ట్ చేసి రామన్నపేట కోర్టులో హాజరుపరిచారు.

   కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు

  కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు

  హతుడి శవాన్ని తరలించేందుకు ఉపయోగించిన స్విఫ్ట్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో యాదాద్రిభువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

   అది గమనించి నాగరాజుతో పెళ్లి..

  అది గమనించి నాగరాజుతో పెళ్లి..

  మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం రాచాల గ్రామానికి చెందిన కమ్మరి జ్యోతి (20) ఏడేళ్ల క్రితం హైదరాబాదులోని నాచారంలో ఉంటున్న మేనమామ ఇంట్లో జరిగిన వివాహానికి వెళ్లింది. ఆ సమయంలో మహంకాళి కార్తీక్ పరిచయమయ్యాడు. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. దాన్ని గుర్తించి కుటుంబసభ్యులు సొంత గ్రామానికి చెందిన నాగరాజుతో ఆరెళ్ల కిందట పెళ్లి చేశారు.

   ప్రియుడి ఫోన్ నెంబర్ సంపాదించి..

  ప్రియుడి ఫోన్ నెంబర్ సంపాదించి..

  భార్య జ్యోతితో నాగరాజు ఆరేళ్లుగా కర్మన్‌ఘాట్‌లో నివాసం ఉంటున్నాడు. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. ఇటీవల జ్యోతి పాత ప్రియుడి సెల్ నెంబర్ సేకరించి ప్రేమ వ్యవహారం నడిపింది. ఇది గమనించిన భర్త మందలించాడు. ప్రియుడి మోజులో పడిపోయిన జ్యోతి అతన్ని పెళ్లి చేసుకోవాలని భావించి భర్తను హత్య చేసేందుకు కార్తీక్‌తో కలిసి పథకం వేసింది.

  పిల్లలు నిద్రపోయిన తర్వాత..

  పిల్లలు నిద్రపోయిన తర్వాత..

  నిద్రమాత్రలు ఇవ్వడంో మత్తులోకి నాగరాజును పిల్లలు నిద్రపోగానే దిండుతో అదిమిపట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసింది. తర్వాత ప్రియుడు కార్తీక్‌కు ఫోన్‌చేసింది. తన మామ వద్ద ఉన్న స్విఫ్ట్ కారు తీసుకుని నరేష్ తన మిత్రులతో వచ్చాడు. నాచారానికి చెందిన మహ్మద్ బిస్మిల్లాఖాన్ (19), నదియాల్ గౌరవ్ అలియాస్ దీపక్, లాలపేట్‌కు చెందిన శివప్ప నరేష్ (23)తో కలిసి అతను ప్రేయసి ఇంటికి చేరుకున్నాడు. శవాన్ని కారులో వేసుకోని చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ జిల్లెడుచెల్క గ్రామ శివారులో చెట్ల పొదల్లో పడేశారు.

  పశువుల కాపరి చూడడంతో..

  పశువుల కాపరి చూడడంతో..

  డిసెంబర్ 31న పశువుల కాపరి చూడడంతో నాగరాజు మృతి విషయం తెలిసింది. అతను ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి గుర్తుతెలియని శవంగా కేసు నమోదు చేశారు. అతని జేబులో కార్పెంటర్ పని కోసం మెటీరియల్ కొనుగోలు చేసిన చీటీ లభించింది. దుకాణంలో ఆన్‌లైన్‌లో పేమెంటు చేయడంతో నాగరాజు చిరునామా తెలిసింది. నాగరాజు ఇంటికి వెళ్లి పోలీసులు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు శవాన్ని గుర్తించి తీసుకువెళ్లారు.

  తలకు గాయమైనట్లు గుర్తించారు..

  తలకు గాయమైనట్లు గుర్తించారు..

  పోస్టుమార్టం నివేదికలో నాగరాజు తలకు గాయమైనట్టు వచ్చింది. దీంతో భార్య జ్యోతిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో హత్య మిస్టరీ వీడింది. శివప్ప నరేష్ భయంతో బ్లేడ్‌తో గొంతు కోసుకొని ఆసుపత్రిలో చేరి అసలు విషయం చెప్పేశాడు. స్విఫ్ట్ కారును, మూడు సెల్‌ఫోన్‌లలను, హత్యకు ఉపయోగించిన దిండును పోలీసులు సీజ్ చేశారు.

  English summary
  Police have busted techie Nagaraju's murder case with a small receit left in the pocket of deeased.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X