వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వాతిపై టెక్కీ మధుకర్ రెడ్డి బంధువుల దాడి

వారం రోజుల క్రితం అమెరికాలో ఆత్మహత్య చేసుకొన్న టెక్కీ మధుకర్ రెడ్డి మృతదేహం మంగళవారం నాడు భువనగిరికి చేరుకొంది.అయితే భర్త మృతదేహం చూసేందుకు వచ్చిన భార్య స్వాతిని భర్త తరపు బంధువులు దాడికి పాల్పడ్డాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

భువనగిరి: వారం రోజుల క్రితం అమెరికాలో ఆత్మహత్య చేసుకొన్న టెక్కీ మధుకర్ రెడ్డి మృతదేహం మంగళవారం నాడు భువనగిరికి చేరుకొంది.అయితే భర్త మృతదేహం చూసేందుకు వచ్చిన భార్య స్వాతిని భర్త తరపు బంధువులు దాడికి పాల్పడ్డాడు.దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

భువనగిరి మండలం మద్దెలగూడెనికి చెందిన స్వాతితో మధుకర్ రెడ్డి వివాహం జరిగింది. మధుకర్ రెడ్డి కాలిపోర్నియాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి శర్మిష్ట అనే నాలుగేళ్ళ కూతురు ఉంది. కొంత కాలం పాటు దంపతుల మధ్య కలహాలు ఏర్పడ్డాయి.

కుటుంబ కలహాల కారణంగానే మధుకర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారనే కుటుంబసభ్యులు చెబుతున్నారు.అయితే మంగళవారం నాడు భువనగిరిలో మధుకర్ రెడ్డి అంత్యక్రియల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకొంది.

Techie Madhukar Reddy family members attacked on his wife swathi

అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన మధుకర్ రెడ్డి భార్య స్వాతిని మధుకర్ రెడ్డి బంధువులు కొట్టారు.మధుకర్ మృతికి స్వాతి కారణమని వారు ఆరోపిస్తున్నారు.

దీంతో తనకు ప్రాణహాని ఉందంటూ స్వాతి భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.భర్త మృతదేహం చూసేందుకు వచ్చిన తన కూతురిపై దాడి చేయడం సరైంది కాదన్నారు స్వాతి తల్లి. తమ కూతురు ఆరు మాసాలుగా నరకం అనుభవిస్తోందన్నారామె.

అయితే కూతురు కోసమే ఆమె ఈ భాధను పంటిబిగువున భరించిందని చెప్పారు. మధుకర్ మృతి విషయమై మీడియా తన కూతురుపై రకరకాలుగా వార్తలు వచ్చాయన్నారు.అయితే ఈ విషయమై జాగ్రత్తగా వ్యవహరించాలని ఆమె కోరారు.మరో వైపు మధుకర్ రెడ్డిది హత్యో , ఆత్మహత్యో త్వరలోనే తేలుతోందని ఆమె చెప్పారు.అన్ని రకాల ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆమె చెప్పారు.

English summary
Techie Madhukar Reddy family members attacked on his wife swathi on Tuesday at Bhuvanagiri.Swathi complaint against Madhukar Reddy family members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X