వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లే ఆఫ్‌లతో ఉద్యోగాలు హరీ...: రోడ్డెక్కిన హైదరాబాద్ టెక్కీలు

హైదరాబాదు టెక్కీలు రోడ్డెక్కారు. ఉద్యోగాలు పోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు తమకు న్యాయం చేయాలంటూ శుక్రవారం ర్యాలీ నిర్వహించారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదు టెక్కీలు రోడ్డెక్కారు. ఉద్యోగాలు పోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు తమకు న్యాయం చేయాలంటూ శుక్రవారం ర్యాలీ నిర్వహించారు.

పలువురు టెక్కీలు హైటెక్ సిటీ సమీపంలో వాక్ ఫర్ జస్టిస్ అంటూ ర్యాలీ తీశారు. ఫోరం ఫర్ ఐటి ప్రొఫెషనల్స్ బ్యానర్ కింద వారంతా ఏకమయ్యారు.

వారు శుక్రవారంనాడు హైదరాబాదులోని రహేజా మైండ్‌సెట జంక్షన్ వద్ద గుమికూడారు. తమకు న్యాయం చేయాలంటూ ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన టెక్కీలు నినాదాలు చశారు.

స్లోగన్స్ ఇలా.....

స్లోగన్స్ ఇలా.....

వుయ్ వాంట్ జస్టిస్ (మాకు న్యాయం కావాలి), డౌన్ విత్ కార్పోరేట్ గ్రీడ్ (కార్పోరేట్ అత్యాశ నశించాలి) వంటి నినాదాలతో పాటు గివ్ బ్యాక్ మై జాబ్ (నా ఉద్యోగం తిరిగి ఇవ్వు, గివ్ బ్యాక్ మై లైఫ్ (నా జీవితం తిరిగి ఇవ్వు) వంటి నినాదాలు చేశారు.

పనితీరు బాగాలేదని....

పనితీరు బాగాలేదని....

పనితీరు బాగా లేదని, సమర్థంగా పనిచేయడం లేదని సాకులు చెబుతూ తమను ఉద్యోగాల నుంచి తీసేయడం అన్యాయమని వారు విమర్శించారు. ఉద్యోగులకు చట్టం రక్షణ కల్పిస్తుందని, చట్ట వ్యతిరేకంగా ఉద్యోగాల నుంచి తమను తొలగించే హక్కు లేదని వారంటున్నారు.

లేబర్ కమిషనర్‌కు మొర పెట్టుకున్నా...

లేబర్ కమిషనర్‌కు మొర పెట్టుకున్నా...

హైదరాబాద్ లేబర్ కమిషనర్‌కు తాము ఎన్నో విజ్ఞప్తులు చేశామని, అయినా పట్టించుకోవడం లేదని, తమ మొర ఆలకించడం లేదని, దాంతో తాము హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని వారు చెబుతున్నారు. తమను అక్రమంగా ఉద్యోగాల నుంచి తీసేశారని నలుగురు ఉద్యోగులు హైకోర్టుకు వెళ్లారు. దాంతో హైకోర్టు టెక్ మహేంద్రకు నోటీసులు జారీ చేసింది.

రెండు కారణాలు..

రెండు కారణాలు..

పెద్ద యెత్తున ఐటి కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన చెప్పడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. వాటిలో ఒకటి ఐటి రంగం తిరోగమన దిశలో పయనించడం కాగా రెండోది ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి యాంత్రీకరణకు పూనుకోవడం.

తెలంగాణ ప్రభుత్వానికీ నోటీసులు...

తెలంగాణ ప్రభుత్వానికీ నోటీసులు...

ఉద్యోగులకు ఉద్వాసన పలికిన పిటిషన్లపై హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన లేబర్ కమిషనర్‌కు, డిప్యూటీ లేబర్ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమను అక్రమంగా తొలగించారని, ముందస్తు నోటీసులు కూడా జారీ చేయలేదని పిటిషనర్లు ఆరోపించారు.

English summary
Troubled over the retrenchment of employees in the information technology (IT) sector in Hyderabad, several techies held a 'walk for justice' near Hi-Tec city on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X