వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు చుక్కలు: వేటుతో దిక్కుతోచని స్థితి!, ఆదుకోవాలంటూ ప్రభుత్వాలకు మొర..

టెక్కీలు ఏర్పరుచుకున్న సదరు యూనియన్స్ ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాలేదు. టెక్కీలు సమర్పించిన లెటర్ హెడ్‌పై సైతం.. యూనియన్‌కు సంబంధించిన ఎలాంటి వివరాలు లేవు. అధ్యక్షుడు, ఎగ్జిక్యూటివ్ బాడీ లేకుండా యూ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తక్కువ నైపుణ్యం కలిగి ఉన్నారన్న కారణంతో ఇటీవల పలు ఐటీ కంపెనీలు కొంతమంది టెక్కీలకు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. సరైన కారణాలేవి చూపించకుండానే తమపై వేటు వేశారని సదరు టెక్కీలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తమకు న్యాయం చేయాల్సిందిగా పలువురు టెక్కీలు.. తెలంగాణ లేబర్ డిపార్ట్ మెంట్ ను ఆశ్రయించారు.

యూనియన్లుగా ఏర్పడ్డ కొంతమంది టెక్కీలు తమ డిమాండ్లను ఒక లెటర్ హెడ్ పై రాసి లేబర్ డిపార్ట్ మెంట్ కు అందజేశారు. కాగా, టెక్కీలు ఏర్పరుచుకున్న సదరు యూనియన్స్ ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాలేదు. టెక్కీలు సమర్పించిన లెటర్ హెడ్‌పై సైతం.. యూనియన్‌కు సంబంధించిన ఎలాంటి వివరాలు లేవు. అధ్యక్షుడు, ఎగ్జిక్యూటివ్ బాడీ లేకుండా యూనియన్ ఏర్పడటమేంటని లేబర్ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి యూనియన్లతో కష్టమే!:

ఇలాంటి యూనియన్లతో కష్టమే!:

ఇలాంటి పరిస్థితుల్లో టెక్కీలు ఇచ్చిన ఫిర్యాదును ఎలా స్వీకరించాలో అర్థం కావడం లేదంటున్నారు అధికారులు. టెక్ మహీంద్రాకు చెందిన ఐటీ ఉద్యోగులు కొంతమంది ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయిస్(ఎఫ్ఐటీఈ) పేరిట సమర్పించిన వినతిపత్రంపై లేబర్ అధికారులు ఇలా స్పందించారు.

ఈ ఫోరమ్ చెన్నై కేంద్రంగా ఏర్పడగా.. హైదరాబాద్ సహా మిగతా ఐటీ నగరాల్లోను పలువురు టెక్కీలు తమ రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదులు సమర్పిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ కు చెందిన టెక్కీలు ఇక్కడి లేబర్ డిపార్ట్ మెంటును ఆశ్రయించారు.

అయితే ఫోరమ్ తరుపున సమర్పించిన వినతిపత్రాన్ని స్వీకరించకపోయినప్పటికీ.. టెక్కీలంతా వ్యక్తిగతంగా తమ ఫిర్యాదులను వెల్లడించవచ్చునని లేబర్ డిపార్ట్ మెంట్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

కాగ్నిజెంట్ టెక్కీల ఫిర్యాదు:

కాగ్నిజెంట్ టెక్కీల ఫిర్యాదు:

టెక్ మహీంద్రాతో పాటు కాగ్నిజెంట్ సంస్థకు చెందిన టెక్కీలు కూడా లేబర్ డిపార్ట్ మెంట్ ను ఆశ్రయించారు. శుక్రవారం నాడు సంస్థ కార్యాలయంలో తమ ఫిర్యాదులను అందజేశారు. సరైన కారణాలేవి చూపించకుండానే తమను ఉద్యోగాల్లోంచి తొలగించినట్లు ఫిర్యాదు చేశారు.

అలా చేస్తే ఏం చేయలేం:

అలా చేస్తే ఏం చేయలేం:


ఇప్పటికే రాజీనామా లేఖపై సంతకం పెట్టి, ఉద్యోగం మానేసిన టెక్కీల విషయంలో ఏమి చేయలేమని లేబర్ డిపార్ట్ మెంట్ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఉద్యోగం నుంచి ఇంకా తప్పుకోకుండా.. వేటుకు సంబంధించిన నోటీసులు అందుకున్నవారు మాత్రం ఫిర్యాదు చేయవచ్చునని, ఈ విషయంలో ఏమైనా చర్యలకు ఆస్కారం ఉంటుందని వారు తెలిపినట్లు సమాచారం.

రాజీనామాకు కంపెనీల ఒత్తిళ్లు:

రాజీనామాకు కంపెనీల ఒత్తిళ్లు:

కొద్దినెలల క్రితమే ఉద్యోగంలో చేరిన కొంతమంది టెక్కీలపై కంపెనీలు ఒత్తిడి తీసుకొచ్చి మరీ సాగనంపుతున్నట్లుగా చెబుతున్నారు. రాజీనామా చేయాల్సిందిగా తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని పేర్కొంటున్నారు. దీనిపై తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని లేబర్ డిపార్ట్ మెంట్ అధికారులు టెక్కీలకు సూచించారు.

English summary
As many as 20 techies working with Cognizant Technology Solutions and Tech Mahindra approached the Telangana Labour department on Friday alleging that they were axed for no good reasons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X