వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాంకేతికతను పరిచయం చేసి అభివృద్ధి చేసింది రాజీవ్ గాంధే..! సంస్మరణ సభలో కాంగ్రెస్ నేతలు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కంప్యూటర్, సెల్ ఫోన్ లు పంచాయతీ రాజ్ వ్యవస్థ పటిష్టం కావడానికి రాజీవ్ గాంధీ తీసుకు వచ్చిన సంస్కరణలే కారణమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎల్ టి టి ఈ తీవ్రవాదుల చేతిలో రాజీవ్ చంపబడ్డారన్నారు. చనిపోయిన 28 ఏండ్ల తర్వాత రాజీవ్ గాంధీ ప్రతిష్ట ను దెబ్బ తీసేలా మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్ ను నమ్మడం లేదు. మాకు దేశ వ్యాప్తంగా, రాష్ట్రంలోనూ మాకు ఆశించిన ఫలితాలు వస్తాయి. సోమాజిగూడ చౌరస్తాలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఆయన 28వ వర్ధంతి సంస్మరణ సభ జరిగింది. రాజీవ్ గాంధీ విగ్రహానికి టీపీసీసీ చీఫ్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలీ పూల మాల వేసి నివాళి అర్పించారు.

టెక్నాలజీ ని పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ..! సంస్మరణ సభలో టీపిసిసి నేతలు..!!

టెక్నాలజీ ని పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ..! సంస్మరణ సభలో టీపిసిసి నేతలు..!!

షబ్బీర్ అలీ మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ 5 ఏండ్లలో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఐటీ లో మనం అగ్రగామిగా ఉండడానికి కారణం ఆయనే. ఆయన తెచ్చిన సంస్కరణల వల్లనే కేంద్రం నుంచి గ్రామాలకు నేరుగా నిధులు వస్తున్నాయి. మోది వచ్చిన తరువాత గ్రామాలకు నిధులు ఇవ్వడం లేదు. రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, మహాత్మ గాంధీ లను కూడా తిడుతున్నారు. స్వాతంత్ర్య పోరాటం లో ఆర్ఎస్ఎస్, హిందు సేన వాళ్ళు ఉన్నారా. మహాత్మాగాంధీ ని చంపిన గాడ్సే నేషలిస్ట్ అని సాద్వి ఎలా అంటారు.

 చరిత్రను వక్రీకరిస్తున్న మోదీ..! బీజేపిపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు..!!

చరిత్రను వక్రీకరిస్తున్న మోదీ..! బీజేపిపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు..!!

మోదీ అబద్దాలు చెప్పడంలో మొదటి వరుసలో ఉంటారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉండాలని 18 ఏండ్ల కే ఓట్ హక్కు ను కల్పించిన వ్యక్తి రాజివ్ గాంధీ అన్నారు. కేంద్రం నుంచి గ్రామాలకు నేరుగా నిధులు ఇవ్వాలని చట్టం తీసుకువచ్చిన మహనీయుడు రాజివ్ గాంధీ అని కొనియాడారు. మాజీ సీఎల్పీ నేత కే. జానారెడ్డి మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ తీసుకు వచ్చిన సంస్కరణల వలన 21 శతాబ్దంలో మనం అన్ని రంగాలలో ముందున్నాము.

 ఐటీ లో విప్లవాత్మక మార్పులు..! కాంగ్రెస్ చొరవేనన్న టీ కాంగ్రెస్..!!

ఐటీ లో విప్లవాత్మక మార్పులు..! కాంగ్రెస్ చొరవేనన్న టీ కాంగ్రెస్..!!

ఐటీ రంగంలో భారతీయులు 3వ వంతు ఉండడానికి కారణం రాజీవ్ అని మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య కీర్తించారు. దేశంలో పొలిటికల్ టెర్రరిజం ఎక్కువయ్యింది. రాజీవ్ మరణం పై మోదీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. గాంధీని కించపరుస్తూ సాద్వి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. రాజకీయ టెర్రరిజాన్ని అడ్డుకోవాలి. మోదీ 5 ఏండ్ల లో ఏమి చేసారో ఎవరికి తెలవదు.. కానీ రాజివ్ గాంధీ 5 ఏండ్ల లో టీవీ లు సెల్ ఫోన్ లు, యాంటి టెర్రరిజం పాలసీలు, ఎన్నికల సంస్కరణలు, గ్రామాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు లాంటివి చేశారని పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు.

 రాహుల్ కాంగ్రెస్ ఆశాకిరణం..! ప్రశంసలు కురిపించిన నాయకులు..!!

రాహుల్ కాంగ్రెస్ ఆశాకిరణం..! ప్రశంసలు కురిపించిన నాయకులు..!!

ఆయన బాటలోనే రాహుల్ గాంధీ ప్రయాణం చేస్తున్నారు. మాజీ ఎంపీ హనుమంతరావు మాట్లాడుతూ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన మొదటి నాయకుడు. ఆయన చనిపోయిన తర్వాత బోఫర్స్ కేస్ లో క్లీన్ చిట్ వచ్చింది. కార్గిల్ యుద్దంలో బోఫర్స్ తుపాకులు ఉపయోగపడ్డాయ్ అని ఎల్ కే అద్వానీ చెప్పారు. మోదీ 5 ఏండ్ల లో ఏమి చేయకనే మహాత్మాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీని తిడుతున్నారు. మత ప్రాతిపదికన నడిచే పార్టీలతో మేము పొత్తు పెట్టుకోమన్నారు.

English summary
TPCC Chief Uttam Kumar Reddy said that computer and cell phones were reforms brought by Rajiv Gandhi to strengthen Panchayati Raj.Rajiv was killed by ltte terrorists. We condemn Modi's remarks that the 28 years after the death of Rajiv Gandhi should be damaged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X