• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అమ్మాయిలు అంత ఈజీగా పడిపోతున్నారా.. సైబర్ క్రిమినల్స్ వలకు చేపల్లా చిక్కుతున్నారా?

|

హైదరాబాద్ : ఆకర్షణ.. టీనేజీ వయసులో అదో మత్తు లాంటిది. బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెడుతున్న క్రమంలో తమకు అన్నీ తెలుసు అన్నట్లుగా ప్రవర్తించే ఏజ్ గ్రూప్ అది. ఇంట్లో ఏ కొద్దిగా అభద్రతా భావం కనిపించినా.. తమను సరిగా పట్టించుకోవడం లేదని ఫీలయినా.. అవతలి వారికి ఈజీగా ట్రాప్ అయ్యే వయసు అది. పిల్లలు థర్టీన్ టు నైన్‌టిన్ ఏజ్‌లో తప్పటడుగు వేయకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కచ్చితంగా తల్లిదండ్రులదే అంటున్నారు నిపుణులు. సోషల్ మీడియా వేదికగా ఆ ఏజ్ పిల్లల్ని ట్రాప్ చేసే ఘరానా మోసగాళ్లు ఎక్కువై పోతున్న తరుణంలో వన్‌ఇండియా తెలుగు స్పెషల్ స్టోరీ.

మంచి, చెడు.. నిర్ణయం మన చేతుల్లో..!

మంచి, చెడు.. నిర్ణయం మన చేతుల్లో..!

సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. అరచేతిలో ప్రపంచం చూస్తున్న వేళ ఫింగర్ టిప్స్‌పై అన్నీ సమకూరుతున్న రోజులివి. అయితే దాని నుంచి ఎంత మంచి జరుగుతుందో అదే స్థాయిలో చెడు కూడా ఎక్కువై పోయింది. ఇక సైబర్ నేరగాళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. సోషల్ మీడియాను వాడుకుని జనాలను నట్టేట ముంచుతున్నారు. అదే సమయంలో మహిళలకు వల వేస్తూ.. తీరా ముగ్గులోకి దించాక పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు. అదే క్రమంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. టీనేజ్ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ రెచ్చిపోతున్నారు కొందరు. వారిని ట్రాప్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నారు. కాదు, కూడదంటే దోమను చంపినంత ఈజీగా చంపేస్తున్నారు.

అద్దె గర్భం పేరిట మహిళలకు వల.. నల్గొండ జిల్లాలో దుమారం..!

ఫ్రెండ్ షిప్ ముసుగులో దారుణాలు.. దోమను చంపినంత ఈజీగా..!

ఫ్రెండ్ షిప్ ముసుగులో దారుణాలు.. దోమను చంపినంత ఈజీగా..!

టెక్నాలజీ మాయలో పడి మంచేదో చెడేదో తెలుసుకోలేని పరిస్థితి దాపురించింది. సోషల్ మీడియా వేదికగా ఫ్రెండ్‌షిప్ ముసుగులో జరుగుతున్న ఆకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఆ క్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో పదో తరగతిని విద్యార్థినిని దారుణంగా హత్య చేయడం కలకలం రేపుతోంది. ఫేస్ బుక్ ఫ్రెండ్ నవీన్ రెడ్డి ఆ అమ్మాయిని బండరాయితో మోది చంపాడనే విషయం వెలుగుచూడటంతో అలజడి రేగింది. అసలు ఆ అమ్మాయితో వాడు పరిచయం ఎందుకు పెంచుకున్నాడు.. చివరకు ఎందుకు చంపాడనేది మిస్టరీగా తయారైంది. ఎవడో ముక్కు మొహం తెలియని వాడితో ఫ్రెండ్‌షిప్ ఎందుకు అనే దానికి ఈ మర్డర్ పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది.

ఫేస్‌బుక్ వేదికగా టీనేజ్ అమ్మాయిలకు వల.. వాడి పని అదే..!

ఫేస్‌బుక్ వేదికగా టీనేజ్ అమ్మాయిలకు వల.. వాడి పని అదే..!

ఇటీవల ఓ పోలీస్ అధికారి ఇంటర్వ్యూ చూస్తే కళ్లు బైర్లు కమ్మే నిజాలు కనిపించాయి. ఒకడు అదే పనిగా అమ్మాయిలను ట్రాప్ చేయడమే వ్యాపకంగా పెట్టుకున్న తీరు విస్మయం కలిగించింది. టీనేజీ బాలికలను మాత్రమే వాడు ముగ్గులోకి దించుతున్నాడట. ఫేస్‌బుక్‌లో ఏదో ఒక స్కూల్ అమ్మాయి ప్రొఫైల్ చూసి అదే ప్రొఫైల్‌కు దగ్గరగా మరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తాడట. ఆ అమ్మాయి పొందు పరిచిన వివరాలను మక్కీకి మక్కీ దించి ఒక అకాడమిక్ ఇయర్ మాత్రం ఛేంజ్ చేసి సదరు అమ్మాయి చదివిన స్కూల్ ఫ్రెండ్స్ అందరికీ రిక్వెస్ట్ పంపిస్తాడట.

అలా ఒక్కొక్కరుగా ఫ్రెండ్ షిప్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాక.. క్రమక్రమంగా వారితో ఛాటింగ్ మొదలు పెడతాడు. అవతల ఉన్నది అమ్మాయేనని.. తమ స్కూల్ పూర్వ విద్యార్థినిగా భావించి మంచి చెడు అన్నీ మాట్లాడేస్తారట. ఇక అక్కడి నుంచి వాడిలోని వికృత రూపం బయటేస్తాడు. తన బాయ్‌ఫ్రెండ్‌తో చాలా ఎంజాయ్ చేస్తున్నానంటూ కహానీలు చెప్పి.. నీ న్యూడ్ ఫోటోలు షేర్ చేయవా అంటూ అడుగుతాడు. ఆ క్రమంలో వాడితో ఛాటింగ్ చేసే అమ్మాయిలు.. అవతల ఉన్నది అమ్మాయే కదా అంటూ కొందరు నగ్న చిత్రాలు పంపిస్తారు. ఇక దాని తర్వాత అసలు ఎపిసోడ్ మొదలు పెడతాడు. ఆ ఫోటోలు తన చేతికి చిక్కాక వారిని వేధిస్తుంటాడు. అయితే లొంగ దీసుకోవడమో లేదంటే బెదిరించి డబ్బు గుంజడమో చేస్తుంటాడు.

ముగ్గులోకి దించాక అసలు రూపం.. వింటే ఓకే, లేదంటే అంతే..!

ముగ్గులోకి దించాక అసలు రూపం.. వింటే ఓకే, లేదంటే అంతే..!

అలాంటి మూర్ఱులు ఎక్కువై పోతున్నారు. సమాజంలో చీడ పురుగుల్లా తయారవుతున్నారు. అమాయక బాలికలను వంచించి మోసాలకు తెగబడుతున్నారు. ఫ్రెండ్ షిప్ పేరుతో దగ్గరై ఆ తర్వాత అసలు రూపం బయట పెడుతూ రాక్షాసానందం పొందుతున్నారు. వారికి భయపడి కొందరు చెప్పినట్లు వింటున్నారు.. లేని పక్షంలో వారి ఆకృత్యాలకు బలి అవుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల ఎక్కువ కావడం భయాందోళన పుట్టిస్తోంది. టీనేజ్ పిల్లలున్న తల్లిదండ్రులకు నిద్ర లేకుండా చేస్తోంది. 13 నుంచి 19 ఏళ్ల వయసు పిల్లలు సహజంగానే అదోలా ఉంటారు. ఇంట్లో కుటుంబ సభ్యులు ఏమన్నా అంటే చాలు వారికి రాక్షసుల్లా కనిపిస్తారు. అదే బయటివాళ్లు కాస్తా చనువుగా మాట్లాడితే దగ్గరై పోతారు. అందుకే పేరెంట్స్ కూడా టీనేజర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.

ఈటల తూటాలు.. సంచలన వ్యాఖ్యలు.. టార్గెట్ ఎవరు.. తెలంగాణ రాజకీయాల్లో హీట్..!

చదువుపై దృష్టి పెట్టక మధ్యలో ఇవన్నీ ఎందుకు?

చదువుపై దృష్టి పెట్టక మధ్యలో ఇవన్నీ ఎందుకు?

అసలు పదో తరగతి, ఇంటర్ చదివే విద్యార్థులకు ఫేస్‌బుక్ లాంటి వేదికలతో ఏం పని. ఏదో సరాదాగా మొదలయ్యే వ్యాపకం చివరకు ప్రాణాల మీదకు తెస్తోంది. అదేదో కామెడీ డైలాగ్ లాగా ఏ అకౌంట్ లేదు గానీ ఫేస్‌బుక్ అకౌంట్ మాత్రం ఉందనే రీతిలో తయారైంది నేటి యువత పరిస్థితి. ఒకరిని చూసి మరొకరు స్మార్ట్ ఫోన్లు వాడటం.. సోషల్ మీడియా వేదికలకు అడిక్ట్ కావడం.. ఇవన్నీ కూడా ప్రమాదాలకు హేతువని హెచ్చరిస్తున్నారు నిపుణులు. విద్యార్థి లక్షణం ఏంటి.. బుద్ధిగా చదువుకోవడం.. కెరీర్‌పై ద‌ృష్టి సారించడం.. మరి మధ్యలో ఫేస్‌బుక్ తొక్కా తోలు అని ఇవన్నీ ఎందుకు. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి. అపరిచితులకు దూరంగా ఉండండి. ముక్కు మొహం తెలియని వాళ్లతో అసలు ఫ్రెండ్ షిప్ ఎందుకు. ఒక్కసారి ఆలోచించండి.. అందమైన భవిష్యత్తుకు పునాది వేసుకోండి.

English summary
Attraction .. It was like intoxication in the teenage age. It is the age group that behaves as if they knew everything from childhood to adulthood. If there is a slight insecurity in the house .. They do not care for themselves.. It is the age when the trap is easy for outers. OneIndia Special Story on teenage girls trap on Social Media platforms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X