వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కేసీఆర్ ను కదిలించిన రైతు సెల్ఫీ వీడియో, సమస్య పరిష్కారానికి పరుగులు పెట్టిన అధికారులు

|
Google Oneindia TeluguNews

సోషల్ మీడియా లో వచ్చిన పిర్యాధుపై స్పందించిన తెలంగాణ సిఎమ్ కేసిఆర్ , రైతుతో నేరుగా ఫోన్లో మాట్లాడిన తెలంగాణ సిఎమ్ ,సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ ను ఆదేశం ,వెంటనే సంబంధిత రైతు గ్రామాన్ని పరీశీలించిన మంచిర్యాల కలెక్టర్,

రైతు సంక్షేమమే ద్యేయంగా పలు పథకాలు తీసుకువచ్చిన తెలంగాణ సిఎమ్ కేసిఆర్ వాటి అమలుపై అంతే శ్రద్ద తీసుకుంటున్నారు. అయినా అక్కడక్కడ పలు సమస్యలు తలెత్తున్నాయి, ముఖ్యంగా పట్టా పాస్ పుస్తకాలకు సంబంధించి 90 శాతం పూర్తాయ్యాయని ప్రభుత్వం చెబుతున్నా, స్థానిక వీఆర్వోల అశ్రద్ద ,అవినీతి వల్ల పలువురు రైతులు నష్టపోతున్నారు.

కాగా ఈనేపథ్యలోనే మంచిర్యాల జిల్లాకు నెన్నెల మండలం, నందులపల్లే కు గ్రామానికి చెందిన శరత్ అనే రైతు కుటుంభానికి చెందిన ఏడు ఎకరాల భూమికి సంబంధించి స్థానిక విఆర్వో గ్రామంలో లేని ఇతరులకు పట్టా పాస్ బుక్ చేశారు..శరత్ కుటుంభం ఆ భూమి గత 55 సంవత్సరాలుగా సాగు చేసుకోవడంతో పాటు, భూమి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి..దీంతో ఆయన ఎన్నిసార్లు అధికారుల వద్దకు వెళ్లీన సమస్య పరిష్కారం కాలేదు.దీంతో రైతు శరత్ నందుల పల్లేకు చెందిన స్థానిక విఆర్వో వల్ల రైతుల ఇబ్బందులు పడుతున్నారని ,తనకు సంబంధించిన ఏడు ఎకరాల భూమి ఇతరుల పేర రికార్డ్ చేశారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీనిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు.

సోషల్ మీడియా పోస్ట్ పై స్పందించిన సిఎమ్ కేసిఆర్

సోషల్ మీడియా పోస్ట్ పై స్పందించిన సిఎమ్ కేసిఆర్

అయితే ఈ పోస్ట్ ను చూసిన సిఎమ్ కేసిఆర్, వెంటనే రైతు శరత్ తో ఫోన్లో మాట్లాడారు, దీనికి సంబంధించి పిర్యాధును తనకు వాట్సప్ లో పెట్టమని తెలిపారు.అంతకుముందు మంచిర్యాల జిల్లా కలెక్టర్ తో పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శి స్మీత సబర్వాల్ తో మాట్లాడనని ఫోన్లో చెప్పారు.మరి కాసేపట్లో కలెక్టర్ మీ ఊరికి వస్తారని చెప్పారు. ఈనేపథ్యంలోనే ఇలాంటీ ఏవైన సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు.ఇక సిఎమ్ ఆదేశాలతో మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోలీ కేరీ గ్రామాన్ని సందర్శించి సమస్యను పరిష్కరించారు.

ఇది ఒక్కడి సమస్య కాదు,సిఎమ్

ఇది ఒక్కడి సమస్య కాదు,సిఎమ్

శరత్ తో మాట్లాడుతున్న సందర్భంలో జూన్ వరకు ధరణి వెబ్ సైట్ లో పోందుపరుస్తున్నామని
లోన్ కోసం కూడ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని ఈనేపథ్యంలోనే ఎలాంటీ పత్రాలు లేకుండానే ఆన్ లైన్ ద్వార రుణాలు పోందవచ్చని చెప్పారు.కాగా ఇలాంటీ సమస్యలు ప్రతి గ్రామంలో ఉన్నారు

సిఎమ్ ను అభినందించిన రైతు శరత్

సిఎమ్ ను అభినందించిన రైతు శరత్

కాగా శరత్ నేరుగా తనతో ఫోన్లో మాట్లాడిన సిఎమ్ కేసిఆర్ మాట్లాడడంతో ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు, ఆయన పై రైతు బంధావుడంటూ తెలిపారు, ఇలాంటీ సిఎమ్ రైతులు అర్దం చేసుకోవాలని అన్నారు.

English summary
telanagana cm kcr responds on social media complaint, on VRO bribe for Patta pass book ,CM kcr talk over phone with farmer,and order officials to clear the issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X