వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు: ఆర్టీసీ బస్సు బోల్తా: పలువురికి తీవ్ర గాయాలు

|
Google Oneindia TeluguNews

కామారెడ్డి: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు హడలెత్తిస్తోన్నాయి. విశాఖపట్నం జిల్లా అనంతగిరి వద్ద ప్రైవేటు బస్సు లోయలోకి దూసుకెళ్లిన ఘటన విస్మరించకముందే కర్నూలు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మరణించారు. పలువురు గాయపడ్డారు. అదే సమయంలోనే తెలంగాణలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 17 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

 కర్నూలు జిల్లాలో ఘోరం: 14 మంది అక్కడికక్కడే దుర్మరణం కర్నూలు జిల్లాలో ఘోరం: 14 మంది అక్కడికక్కడే దుర్మరణం

కామారెడ్డి జిల్లా టేక్రియాల్ వద్ద ఈ ఘటన సంభవించింది. మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆ సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు. నాందెడ్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఆర్టీసీ బస్సు మార్గమధ్యలో టేక్రియాల్ వద్దకు చేరుకున్న వెంటనే అదుపు తప్పింది. ఎదురుగా వస్తోన్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మంది గాయపడ్దారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Telangana: 17 injured in road accident in the Kamareddy district

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. అతివేగంతో నియంత్రణ కోల్పోవడం వల్లే బోల్తా కొట్టిందని పేర్కొన్నారు. ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి డ్రైవర్ హఠాత్తుగా బస్సును మళ్లించడానికి ప్రయత్నించడంతో అది బోల్తా పడిందని చెప్పారు.

English summary
17 persons injured in road accident in Kamareddy district of Telangana. The Maharashtra RTC bus towards Hyderabad from Nanded overtuned near Tekriyal in the district early morning of Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X