ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాడెద్దుగా మారిన తెలంగాణ రైతు కుమారుడు: తొలకరి పలకరించినా..పొలం పనులకు దిగలేక

|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయి. తొలకరి వర్షాలు పలకరిస్తోన్నాయి. రుతుపవనాల ప్రభావం వల్ల క్రమం తప్పకుండా వర్షాలు పడుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని వర్షాలకు కురవడానికి అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ సైతం సూచిస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో రైతులు వ్యవసాయానికి ఉపక్రమిస్తోన్నారు. పొలం దున్నుకుంటోన్నారు. అంతా బాగానే ఉన్నప్పటికీ- ఆర్థిక స్థోమత లేని రైతన్నలు మాత్రం ఎప్పట్లాగే ఇబ్బందులను ఎదుర్కొంటోన్నారు. అప్పుల మీద ఆధారపడుతున్నారు.

Recommended Video

Farmer: రైతన్న దీన పరిస్థితి Son As Bullock For Cultivation ఒక వైపు ఎద్దు.. మరోవైపు కొడుకు..

ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎద్దును కొనలేని ఓ పేద రైతు.. పొలం దున్నడానికి తన కుమారుడినే కాడెద్దుగా మార్చిన ఉదంతం.. ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆరు ఎకరాల మేర పొలం ఉన్న ఆ రైతు వద్ద వ్యవసాయ అవసరాల కోసం ఉన్నది ఒక ఎద్దునే వినియోగిస్తోన్నాడు. కొద్దిరోజుల కిందటే మరో ఎద్దు మరణించింది. ఇప్పటికిప్పుడు మరొకటి కొనుగోలు చేయాలంటే కనీసం 40 వేల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తోందాయనకు. దీనితో- తప్పనిసరి పరిస్థితుల్లో తన కుమారుడి సహాయంతో పొలం దున్నారు.

 Telangana: A farmer in Adilabad forced to take the help of his son instead of bullock for cultivation

ఆ రైతు పేరు అభిరామ్.. ఆయన కుమారుడి పేరు సాయినాథ్. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం డోంగర్‌గావ్ ఆయన స్వస్థలం. తొలకరి పలకరించడంతో సాయినాథ్‌ను కాడెద్దుగా మార్చారు. ఒక వైపు ఎద్దు.. మరోవైపు కుమారుడితో నాగలిని దున్నించాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటికిప్పుడు 40 వేల రూపాయలను ఖర్చు పెట్టి.. జోడెద్దును కొనలేని పరిస్థితుల్లో ఉన్నానని అభిరామ్ చెబుతున్నారు. ఇదివరకు చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఓ రైతు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉండగా.. సోనూసూద్ ఆయనకు ట్రాక్టర్‌ను పంపించిన విషయం తెలిసిందే.

English summary
A farmer in Indravelli Mandal in Adilabad district forced to take the help of his son Sainath instead of another bullock for cultivation. He has sought the government to help him for cultivation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X