వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి 2 టీఎంసీలు ఇచ్చేందుకు తెలంగాణ ఓకే.. ఏపీ, తెలంగాణ ఈఎన్సీలతో బోర్డు సెక్రటరీ భేటీ

|
Google Oneindia TeluguNews

తెలుగురాష్ట్రాల మధ్య జలజగడానికి ఫుల్ స్టాప్ పడినట్టే అనిపిస్తోంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవో నంబర్ 203తో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా కృష్ణా, గోదావరి నదులపై అనుమతి లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా.. కృష్ణా, గోదావరి బోర్డులకు ఫిర్యాదు చేసింది.

కృష్ణా ప్రాజెక్టులపై తాడోపేడో-త్వరలో రివర్ బోర్డు భేటీ- అజెండా ఇవ్వాలని ఏపీ, తెలంగాణకు లేఖకృష్ణా ప్రాజెక్టులపై తాడోపేడో-త్వరలో రివర్ బోర్డు భేటీ- అజెండా ఇవ్వాలని ఏపీ, తెలంగాణకు లేఖ

తాగునీటి కోసం..

తాగునీటి కోసం..

తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు మేరకు కృష్ణా రివర్ బోర్డు సెక్రటరీ పరమేశం శుక్రవారం ఏపీ, తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్‌లతో సమావేశమయ్యారు. చర్చలు మంచి వాతావరణంలో జరిగాయని.. ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై డిస్కస్ చేశామని తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధరరావు పేర్కొన్నారు. తాగునీటి కోసం నీరివ్వాలని ఏపీ కోరగా.. సానుకూలంగా స్పందించినట్టు మురళీధరరావు తెలిపారు. ఆ నీరు తాగునీటి అవసరాలకేనని చెప్పడంతో తెలంగాణ అభ్యంతరం తెలుపులేదు.

తమ వాటా నీటినే..

తమ వాటా నీటినే..

తమ వాటా నుంచి 2 టీఎంసీల నీటిని తీసుకెళ్తున్నట్టు ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మీడియాకు తెలిపారు. సాగర్ కుడికాల్వ నుంచి నీరు తీసుకెళ్లేందుకు తెలంగాణ అంగీకరించిందని ఆయన తెలిపారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం ఈ నీటిని వినియోగిస్తారని చెప్పారు. సాగర్, శ్రీశైలం నుంచి తమకు రావాల్సిన నీటి కేటాయింపులను వాడుకుంటామని తెలియజేశారు. తాగునీటి అవసరాల కోసం అని చెప్పడంతో.. తెలంగాణ కూడా అంగీకరించింది. దీంతో ఫిర్యాదుల పర్వంపై కృష్ణా బోర్డు విచారణ కాంప్రమైజ్ అయిందని చెప్పాలి.

Recommended Video

Telangana, Andhra Likely To Experience Heatwave Conditions: IMD
ప్రాజెక్టులపై చర్చలు..

ప్రాజెక్టులపై చర్చలు..

కానీ తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కృష్ణా, గోదావరి బోర్డులు విచారించాల్సి ఉంది. తాగునీటి కోసం 2 టీఎంసీలు ఇచ్చినందున.. తెలంగాణ ప్రాజెక్టులపై కూడా ఏపీ కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో తెలుగురాష్ట్రాల మధ్య జలవివాదం సమసిపోయిందని చెప్పొచ్చు.

English summary
telangana agree to give 2 tmc water to drinking water for andhra pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X