వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగం, కోటి ఎకరాలకు సాగు నీటికి హమీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేసేలా చేస్తున్నాయని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి.

తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి సోమవారం నాడు గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు.అయితే కాంగ్రెస్ పార్టీ సభ్యులు గవర్నర్ ప్రసంగిస్తున్నంత సేపు నినాదాలు చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్లకార్డులు ప్రదర్శించారు.

ప్రసంగ పాఠాన్ని చింపి గవర్నర్ పైకి వేశారు. హెడ్ ఫోన్ ను నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విసిరేయడంతో శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ కంటికి గాయమైంది.

Telangana Assembly Budget sessions begins

ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులకు గోదావరి, కృష్ణా జలాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు.

. శాసనసభ సమావేశాలు నిర్మాణాత్మకంగా జరగాలనే ఆకాంక్షను గవర్నర్ వ్యక్తం చేశఆరు. ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు.

Telangana Assembly Budget sessions begins

రాష్ట్రంలో అధిక జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని.. అందువల్లే ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23లక్షల పంపు సెట్లకు 24 గంటల ఉచిత విద్యు‌త్‌ అందించడం కొత్త రికార్డుగా గవర్నర్ చెప్పారు.

గతేడాది హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ప్రారంభమైందని.. పీపీపీ పద్ధతిలో చేపట్టిన ఈ ప్రాజెక్టు మొదటి దశలో భాగంలో 30కిలోమీటర్ల మార్గం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. జాతీయ రహదారులను జిల్లా, మండల రహదారుతో అనుసంధానం చేస్తు్న్నట్లు వెల్లడించారు.

English summary
Telangana Assembly sessions begin on Monday . The budget session of Telangana Assembly began today with the address of Governor Narasimhan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X