హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు మోహన్‌కు షాక్, నో టిక్కెట్, కొండా సురేఖకు డౌట్: దరిద్రులంటూ వారిపై కేసీఆర్ ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

దరిద్రులంటూ వారిపై కేసీఆర్ ఫైర్

హైదరాబాద్: అసెంబ్లీ రద్దు అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మధ్యాహ్నం టీఆర్ఎస్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ రద్దుకు గల కారణాలను ఆయన తెలిపారు. అంతకుముందు కేబినెట్ భేటీ అయి అసెంబ్లీ రద్దుపై ఏకవ్యాఖ్య తీర్మానానికి ఆమోదం తెలిపింది. అనంతరం గవర్నర్‌ను కలిసి తీర్మానం ప్రతిని అందించారు. గవర్నర్ దానిని ఆమోదించి, ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని సూచించారు. అనంతరం ఆయన తెరాస భవన్‌కు వచ్చి మాట్లాడారు.

అసెంబ్లీ రద్దు వెనుక మరో కోణం: హైదరాబాద్ టు ఢిల్లీ, కేసీఆర్ 'ట్రిపుల్' ప్లాన్అసెంబ్లీ రద్దు వెనుక మరో కోణం: హైదరాబాద్ టు ఢిల్లీ, కేసీఆర్ 'ట్రిపుల్' ప్లాన్

ఈ సందర్భంగా ఆయన 105 మంది అభ్యర్థులను ప్రకటించారు.ఆంధోల్ నుంచి ప్రముఖ నటుడు బాబు మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మోహన్ బాబు స్థానంలో జర్నలిస్ట్ క్రాంతి కిరణ్‌కు టిక్కెట్ ఇస్తున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే నల్లా ఓదేలుకు కూడా టిక్కెట్ నిరాకరించినట్లు తెలిపారు. వరంగల్ ఈస్ట్ కొండా సురేఖ స్థానం. దానిని పెండింగులో పెట్టారు.

తెలంగాణకు ప్రథమ శత్రువు కాంగ్రెస్

తెలంగాణకు ప్రథమ శత్రువు కాంగ్రెస్

తెలంగాణకు ప్రథమ శత్రువు కాంగ్రెస్ అని కేసీఆర్ అన్నారు. నవంబర్ 1 తెలంగాణకు బ్లాక్ డే అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ నుంచి అందరూ మోసం చేశారన్నారు. ఉద్యమం సమయంలో వందలాది మందిని కాల్పించింది ఇందిరా గాంధీ అన్నారు. కాంగ్రెస్ తెలంగాణను నాశనం చేశారని, వాళ్లే దరిద్రులు, వారి పీడ తెలంగాణకు విరగడ అయిందన్నారు. కేసీఆర్ తెలంగాణ భూమిని విడిపించిన భూమి పుత్రుడు అన్నారు.

అందుకే నాడు ఒంటరి పోరు

అందుకే నాడు ఒంటరి పోరు

పటిష్టమైన తెలంగాణ కోసం 2014లో తాము ఒంటరిగా పోటీ చేశామని కేసీఆర్ చెప్పారు. ఈ మధ్య తెలంగాణలో రాజకీయాల్లో అసహనం చూస్తున్నామని చెప్పారు. అది అవాంఛనీయం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా అనేక రాష్ట్రాల సీఎంలు మనలను పొగిడారని చెప్పారు. ఎకనామిక్స్ టైమ్స్ అవార్డు కూడా వచ్చిందన్నారు. ఈ నాలుగేళ్లలో తెలంగాణ 21.96 శాతం పెరిగిందన్నారు. అనేక పోరాటాలు, త్యాగాల మీద తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు.

కాకిగోల చేస్తున్నారు

కాకిగోల చేస్తున్నారు

ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనులపై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ, పిచ్చిపిచ్చి పనులు చేశారని, అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్లారని చెప్పారు. కొత్త రాష్ట్రం అనతికాలంలో ఎంతో ఆర్థికాభివృద్ధి సాధించిందని తెలిపారు. ప్రతిపక్షాలు కాకిగోల చేస్తున్నాయన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో కరెంట్ కోతలు ఎదుర్కొన్నామని, పారిశ్రామికవేత్తలు కూడా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారన్నారు. తమపై ఒక్కటంటే ఒక్క ఆరోపణ లేదన్నారు. 35 ఏళ్లు కరెంట్‌తో ఇబ్బందులు పడ్డామన్నారు. కాంగ్రెస్ వారు రౌండ్ టేబుల్స్, వారి బొంద టేబుల్స్ పెట్టుకుంటున్నారన్నారు. తాము నిబ్దదతతో కరెంట్ సమస్యను పరిష్కరించామని చెప్పారు.

ఇద్దరికే టిక్కెట్లు ఇవ్వడం లేదు, ఐదింటిపై డైలమా

ఈ సందర్భంగా కేసీఆర్ 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇందుకు సంబంధించిన జాబితాను ఆయన మీడియా ప్రతినిధులకు అందించారు. తాను కేవలం ఇద్దరికే టిక్కెట్లు ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు. ఐదు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లు ఉన్న చోట చర్చించాల్సి ఉందని చెప్పారు. ఈ ఏడు చోట్ల మినహా అందరు సిట్టింగులకు టిక్కెట్లు ఇస్తున్నామని చెప్పారు. మేడ్చల్, మల్కాజిగిరి, చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో చర్చించాల్సి ఉందని తెలిపారు. ఇలా అసెంబ్లీని రద్దు చేస్తూనే అలా 105 మందిని ప్రకటించడం సంచలన విషయమే.

డిసెంబర్ నాటికల్లా ఫలితాలు

తనకు తెలిసి అక్టోబర్ మొదటి వారంలో ఎన్నికల ప్రక్రియ (ముందస్తు) ప్రారంభమై నవంబర్‌లో ఎన్నికలు జరిగి, డిసెంబర్‌లో ఫలితాలు వస్తాయని కేసీఆర్ చెప్పారు. తమకు వచ్చిన సమాచారం మేరకు ఇతర నాలుగు రాష్ట్రాలతో ఎన్నికలు తెలంగాణకు జరుగుతాయన్నారు. మొత్తం 119 స్థానాలకు గాను 105 సీట్లు ప్రకటించానని, మిగతా 14 స్థానాలపై వారం, పది రోజుల్ సెటిల్ చేస్తామని చెప్పారు. చెన్నూర్, ఆందోల్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు టిక్కెట్ నిరాకరిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో మరోసారి తాము గెలవాలన్నారు. తాము గెలిస్తే ప్రగతి రథ చక్రం ఆగిపోదన్నారు. అసమర్థులకు, అవినీతిపరులకు పట్టం కట్టవద్దని తెలంగాణ ప్రజలను కోరుతున్నానని చెప్పారు. ఇవి ముందస్తు ఎన్నికలు కాదని, ఇప్పటికే సాధారణ ఎన్నికల జోన్‌లోకి వచ్చామని, కాబట్టి ముందస్తు కాదన్నారు. తాను ఏం చేసినా తెలంగాణ మేలు కోరి చేస్తాను తప్పితే, నష్టం చేయనని చెప్పారు. తెలంగాణ భవిష్యత్తు తనకు ముఖ్యమని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పని 76 అంశాలను తాము నెరవేర్చామన్నారు. కళ్యాణ లక్ష్మి, బీడీ కార్మికులకు సహకారం వంటివి తాము చేశామన్నారు. కళ్యాణ లక్ష్మిని ఓసీలోని పేదలకు కూడా వర్తింప చేశామన్నారు.

English summary
We are announcing a list of 105 candidates today: K Chandrashekhar Rao after state cabinet decides to dissolve Telangana assembly for early polls, Says KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X