వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగిసిన పోలింగ్: క్యూలైన్లో నిలుచున్న వారికి ఓటు, 70 శాతానికి పైగా ఓటింగ్ నమోదయ్యే ఛాన్స్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజు (శుక్రవారం, 07-12-2018) ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనున్నాయి. 119 నియోజకవర్గాలకు గాను 106 చోట్ల ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మరో 13 నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.

Telangana assembly elections Live Updates: Voting for 119 seats today, counting Dec 11

Newest First Oldest First
5:06 PM, 7 Dec

తెలంగాణలో పోలింగ్ సమయం సాయంత్రం ఐదు గంటల వరకు ముగిసింది. ఐదు గంటలలోపు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 70 శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశముంది.
4:25 PM, 7 Dec

సమస్యాత్మక కేంద్రాలుగా సిర్పూర్‌, చెన్నూర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచలం, మంథని.
4:24 PM, 7 Dec

సాయంత్రం నాలుగు గంటలకు 13 సమస్యాత్మక నియోజకవర్గాలలో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మిగతా 106 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గంట ముందుగానే పోలింగ్‌ ముగిసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో క్యూలైన్లలో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఐదు, ఖమ్మం జిల్లాలో ఐదు, వరంగల్‌ జిల్లాలో రెండు, కరీంనగర్‌ జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని ఎన్నికల సంఘం అధికారులు సమస్యాత్మక స్థానాలుగా గుర్తించారు.
3:52 PM, 7 Dec

తెలంగాణలో ఓటింగ్ గతంలో కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు 56.17 శాతం పోలింగ్ నమోదయింది.
3:49 PM, 7 Dec

హుజూర్‌న‌గ‌ర్‌లో ఓ పోల్ ఆఫీస‌ర్‌పై ఓట‌ర్లు దాడి జరిగింది. మేళ్ల‌చెరువు మండ‌లంలోని వెల్ల‌టూరు గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేసేందుకు వెళ్లిన దివ్యాంగ వృద్ధురాల‌కు సహాయ‌ప‌డేందుకు వ‌చ్చిన పోల్ ఆఫీస‌ర్‌.. ఓట‌రు ఇష్టానికి వ్య‌తిరేకంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై ఆ ఓట‌రు అభ్యంత‌రం వ్య‌క్తం చేయగా.. ఆ త‌ర్వాత అక్క‌డ ఉన్న ఓట‌ర్లుకు, పోల్ సిబ్బందికి మ‌ధ్య‌ వాగ్వాదం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో పోల్ ఆఫీస‌ర్‌పై ఓట‌ర్లు దాడి చేశారు. విధుల్లో ఉన్న మిగ‌తా పోల్ సిబ్బంది.. ఆ పోల్ ఆఫీస‌ర్‌ను అక్క‌డ నుంచి త‌ప్పించారు. ఈ ఘ‌ట‌న‌పై రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ వివ‌ర‌ణ కోరారు.
2:46 PM, 7 Dec

ఐమాక్స్ థియేటర్ వద్ద ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. ఎన్నికల సందర్భంగా మార్నింగ్ షోను నిలిపివేశారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న రోబో సినిమా ప్రేక్షకులు ఆందోళన చేపట్టారు. డబ్బులు తిరిగి చెల్లించడంతో వివాదం సద్దుమణిగింది.
2:44 PM, 7 Dec

119 నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
1:51 PM, 7 Dec

నల్గొండ జిల్లాలోని తుంగతుర్తిలో పోలింగ్ సిబ్బంది పోలింగ్ బూత్‌ను మూసేసింది. లంచ్ టైమ్ అయిందంటూ వారు పోలింగ్ బూత్‌ను ముశారు. ఇది కలకలం రేపుతోంది. పోలింగ్ సిబ్బంది నిర్వాకంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పలువురు తమ సోషల్ మీడియా ప్లాట్ పాంలపై పోస్ట్ చేశారు.
1:31 PM, 7 Dec

మధ్యాహ్నం గం.1.30 నిమిషాల వరకు 49.15 శాతం ఓటింగ్ నమోదయింది.
12:43 PM, 7 Dec

సినీ నటుడు మహేష్ బాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పేరు ఓటర్ లిస్టులో లేదు. జాబితా నుంచి తమ లాంటి వారి పేర్లు వెళ్లిపోయాక ఎన్నికలు పారదర్శకంగా ఎలా జరుగుతున్నట్లు అని ఆమె ట్విట్టర్‌లో ఘాటుగా ప్రశ్నించారు.
12:36 PM, 7 Dec

బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్ బూత్ నెంబర్ 229లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
12:34 PM, 7 Dec

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చింతమడకలో ఓటు వేశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని చోట్ల ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగులో పాల్గొంటున్నారని చెప్పారు. హైదరాబాదులో కూడా ఓటింగులో పాల్గొంటున్నారని, అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు.
12:23 PM, 7 Dec

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
12:19 PM, 7 Dec

మరికొందరు ఇతర ఓటర్లు కూడా పలు నియోజకవర్గాల్లో వెనక్కి వెళ్లిపోయారు.
12:14 PM, 7 Dec

ప్రముఖ టెన్నిస్ తార సానియా మీర్జా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
12:12 PM, 7 Dec

ఈవీఎంలు మొరాయించడంతో పలువురు ఓటు వేయకుండా వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఓటు వేయకుండా వెనుదిరిగారు. అరవింద్ ఇంక్ లేని వేళ్లు చూపించారు.
12:08 PM, 7 Dec

ఈవీఎంలు మొరాయించడంతో పలుచోట్ల ఓటర్లు వెనుదిరుగుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యాహ్నం 11 గంటలకు 23.4 శాతం పోలింగ్ నమోదయింది.
11:29 AM, 7 Dec

కల్వకుర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని కాంగ్రెస్, వారే దాడి చేశారని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఓటమి భయంతో బీజేపీ, తెరాస నేతలు దాడులకు పాల్పడుతున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కల్వకుర్తిలో వంశీచంద్ రెడ్డిపై దాడి జరిగినట్లుగా తెలుస్తోంది.
11:20 AM, 7 Dec

కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కోస్గిలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో భారీగా పోలీసులను మోహరించారు.
11:02 AM, 7 Dec

దాదాపు 229 కేంద్రాల్లో ఈవీఎంల సమస్యలు వచ్చాయి. మరోవైపు ఓటు వేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి పోలింగ్ బూత్‌లో కుప్పకూలిపోయిన సంఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. పరమాండ్ల స్వామి అనే వ్యక్తి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చి పైడిపల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతనికి చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి తరలించే సమయానికి మృతి చెందాడు.
10:43 AM, 7 Dec

ఉదయం పదిన్నర గంటల సమయానికి 14 శాతం పోలింగ్ జరిగింది.
10:31 AM, 7 Dec

హిమయత్ నగర్‌లోని సెయింట్ ఆంటోనీ స్కూల్‌లో మంత్రి (ఆపద్ధర్మ) కేటీ రామారావు సతీమణి శైలిమ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వివేకానంద నగర్ సొసైటీ కార్యాలయంలో తన ఓటు హక్కును శేరిలింగంపల్లి తెరాస అభ్యర్థి అరికెపూడి గాంధీ, ఆయన కుటుంబ సభ్యులు వినియోగించుకున్నారు. తెలంగాణ జన సమితి చీఫ్ కోదండరాం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
10:21 AM, 7 Dec

ప్రముఖ నటుడు జూ.ఎన్టీఆర్ శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
10:09 AM, 7 Dec

మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ పాతబస్తీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
10:08 AM, 7 Dec

ఉదయం గం.9.30 వరకు తెలంగాణలో 10.15 శాతం ఓటింగ్ నమోదయింది.
10:07 AM, 7 Dec

నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లాలోని పొతంగల్‌లో బూత్ నెంబర్ 177లో ఓటు వేశారు.
10:06 AM, 7 Dec

నటుడు శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి తదితరులు ఓటు వేశారు. చిరంజీవి తన కుటుంబంతో పాటు వచ్చి జూబ్లీహిల్స్ బూత్ 148లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. దర్శకులు రాజమౌళి ఓటేశారు.
10:05 AM, 7 Dec

కార్వాన్ అసెంబ్లీ అభ్యర్థి అమర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.
9:45 AM, 7 Dec

తెలంగాణలో ఉదయం తొమ్మిది గంటల వరకు దాదాపు తొమ్మిది శాతం ఓటింగ్ నమోదయింది.
9:12 AM, 7 Dec

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అల్లు అర్జున్‌ చెప్పారు. సినీ కథా రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఫిలింనగర్‌లో ఓటు వేశారు. నందమూరి సుహాసిని మెహిదీపట్నంలో ఓటు వేశారు.
READ MORE

English summary
Telangana assembly elections: Polling held between 7 am and 5 pm for 106 of the 119 seats, while voting in 13 Maoist affected seats start at 7 am and end at 4 pm. The main contest is between the ruling Telangana Rashtra Samithi and the Congress led four party Peoples Front.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X