హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసలైన దీపావళి అప్పుడే: కేసీఆర్‌పై స్మృతి ఇరానీ నిప్పులు, తెలుగులో మాట్లాడటంతో..

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : కేసీఆర్‌పై స్మృతి ఇరానీ నిప్పులు...!

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని (టీఆర్ఎస్ పార్టీ) ఓడించడమే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అసలైన దీపావళి పండుగ అని కేంద్రమంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ ఆదివారం అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఆదరణ పెరుగుతుండటంతో కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు.

ఆదివారం రాత్రి బీజేపీ నేత, తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి మద్దతుగా హైదరాబాదులోని అంబర్‌పేట నియోజకవర్గంలో చేపట్టిన ఎన్నికల ప్రచార సభకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదల ప్రజల కోసం ఆయుష్మాన్‌ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. దీనిని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడ్డుకుంటున్నారన్నారు. అనేక పథకాల అమలు తీరులోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తోందన్నారు.

 అమరవీరులను అలా అవమానించిన కేసీఆర్

అమరవీరులను అలా అవమానించిన కేసీఆర్

తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించకుండా అమరవీరులను టీఆర్ఎస్ అవమానించిందని స్మృతి ఇరానీ మండిపడ్డారు. డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ విమోచన దినంగా భావించి కేసీఆర్‌ను ఓడించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నియంతలా మారారన్నారు. వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

కుటుంబ పాలన అనుకుంటున్నారు

కుటుంబ పాలన అనుకుంటున్నారు

ప్రజాస్వామ్యం అంటే కుటుంబ పాలన అని టీఆర్ఎస్ భావిస్తోందని స్మృతి ఇరానీ అన్నారు. రాష్ట్రం మొత్తం ఒక కుటుంబ పాలన కింద ఉందన్నారు. పేదల కోసం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. మోడీకి దేశవ్యాప్తంగా ఆదరణ ఉందన్నారు. బీజేపీ, కిషన్ రెడ్డి విజయాన్ని నిజమైన దీపావళి వేడుకగా భావించాలని చెప్పారు. పేదల ప్రజల కోసం మోడీ ఎన్నో పథకాలు ప్రారంభించారన్నారు.

ఆ సర్వేలతో సంబంధం లేదు, మెదక్‌లో పోటీ చేయమంటున్నారు: లగడపాటి, జగన్ మీద దాడిపై...ఆ సర్వేలతో సంబంధం లేదు, మెదక్‌లో పోటీ చేయమంటున్నారు: లగడపాటి, జగన్ మీద దాడిపై...

తెలుగులో మాట్లాడిన స్మృతి ఇరానీ

తెలుగులో మాట్లాడిన స్మృతి ఇరానీ


కాగా, స్మృతి ఇరానీ దాదాపు పది నిమిషాలు మాట్లాడారు. ఆమె మొదట కాసేపు తెలుగులో మాట్లాడి అందరినీ అలరించారు. ఆమె తెలుగులో మాట్లాడినప్పుడు కార్యకర్తలు కేరింతలు కొట్టారు.

నేతలు ఎవరు ఏమన్నారంటే?

నేతలు ఎవరు ఏమన్నారంటే?

అంబర్ పేట బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజలు బీజేపీతోనే ఉన్నారని చెప్పారు. తమ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టి బీజేపీ గెలుపునకు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... సంక్షేమ పథకాల అమలులో కేంద్రం ముందంజలో ఉందన్నారు.

English summary
Union minister Smriti Irani on Sunday said the defeat of the TRS would be the real Diwali for the people of the state. She criticised the government for not implementing ‘Modicare’, the Centre’s health insurance scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X