• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొలువుదీర‌నున్న తెలంగాణ అసెంబ్లీ..! రెండ‌వ‌సారి కూడా బ‌ల‌హీన ప్ర‌తిప‌క్ష‌మే..!!

|

హైదరాబాద్: తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన సుధీర్గ కాలం త‌ర్వాత తెలంగాణ శాస‌న స‌భ కొలువుతీర బోతోంది. గురువారం తెలంగాణ ఎమ్మెల్యేలు ప్ర‌మాణం చేయ‌బోతున్నారు. కొత్త పాత క‌ల‌యిక‌తో ఈ సారి అసెంబ్లీ క‌ళ‌క‌ళ‌లాడ‌బోతోంది. అత్యంత సీనియ‌ర్ లు, తొలిసారి శాస‌న స‌భ‌లో అడుగు పెట్ట బోతున్న వారికి స‌భ స్వాగ‌తం ప‌ల‌క‌బోతోంది. ఐతే ప్ర‌భుత్వ విధానాల‌ను విమ‌ర్శించే ప్ర‌తిప‌క్షం మాత్రం గ‌తంలో కంటే ఈసారి మ‌రింత బ‌ల‌హీనంగా ఉండ‌డం విశేషం..! కొత్తగా కొలువు దీరుతున్న శాసనసభ కు సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం..!!

కొత్త అసెంబ్లీలో విశేషాలు..! పాత కొత్త క‌ల‌యిక‌ల‌తో ఏర్ప‌డ‌నున్న‌ శాస‌న స‌భ‌..!!

కొత్త అసెంబ్లీలో విశేషాలు..! పాత కొత్త క‌ల‌యిక‌ల‌తో ఏర్ప‌డ‌నున్న‌ శాస‌న స‌భ‌..!!

జనవరి 17 నుంచి తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు తొలిరోజే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నాలుగురోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాలు సభ్యుల ప్రమాణ స్వీకారంతో ప్రారంభం అవుతాయి. అనంతరం స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో ముగియనున్నాయి. తెలంగాణా ఆవిర్భావం తర్వాత రెండోసారి తెలంగాణా శాసనసభ కొలువు దీరనుంది. డిసెంబర్ 11వ తేదీనే ఎన్నికల ఫలితాలు వెలువడ్డా, వివిధ కారణాలతో శాసనసభ కొలువుదీర‌లేదు.

ఉత్సాహంతో కొత్త ఎమ్మెల్యేలు..! ముస్తాబైన అసంబ్లీ..!!

ఉత్సాహంతో కొత్త ఎమ్మెల్యేలు..! ముస్తాబైన అసంబ్లీ..!!

సభలో మొత్తం సభ్యుల సంఖ్య 119తో పాటు ఒక అంగ్లో ఇండియన్ స‌భ్యుడు ఉంటారు. దీంతో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 120, పార్టీల వారిగా సభ్యులు ఇలా ఉన్నారు.తెలంగాణా రాష్ట్ర సమితి - .88, కాంగ్రెస్ - 19, ఎంఐఎం -7,
టిడిపి-2, బిజెపి -1 కాగా సంతంత్రులు ఇద్ద‌రు, వీరు అదికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇదిలా ఉండ‌గా
శాసనసభలో సీనియర్ నేత, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 7 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

అదికార పార్టీకి సంపూర్ణ మెజారిటి..! ఈసారి కూడా బ‌ల‌హీన ప్ర‌తిప‌క్ష‌మే..!!

అదికార పార్టీకి సంపూర్ణ మెజారిటి..! ఈసారి కూడా బ‌ల‌హీన ప్ర‌తిప‌క్ష‌మే..!!

ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఉప సభాపతితో పాటు మరిన్నికీలక పదవులు నిర్వహించిన అనుభవం ఉంది.1985 నుంచి పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ గెలుపు సాధించారు.డబుల్ హ్యట్రిక్ సాధించిన ఎమ్మెల్యేలు గా ముంతాజ్ ఖాన్, ఎంఐఎం, ఎర్రబెల్లి దయాకర్ రావ్, టిఆర్ ఎస్, రెడ్యా నాయక్, టిఆర్ ఎస్ నుండి శాస‌ర స‌భ‌లో అడుగ‌పెట్ట‌బోతున్నారు. ఇక మొట్ట మొద‌టి సారి శాసనసభలో అడుగు పెడుతున్న ఎమ్మెల్యేల 23 మంది కాగా, గత అసెంబ్లీలో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు 76 మంది ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీలుగా గెలుపొందిన మల్లారెడ్డి , బాల్క సుమన్ లు ఈసారి శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి, తొలిసారి శాసనసభలో అడుగు పెడుతున్నారు.

 ప‌ద‌వులు ఎవ‌రిని వ‌రిస్తాయో..! ఆశావ‌హుల్లో కొసాగుతున్న ఉత్కంఠ‌..!!

ప‌ద‌వులు ఎవ‌రిని వ‌రిస్తాయో..! ఆశావ‌హుల్లో కొసాగుతున్న ఉత్కంఠ‌..!!

ఎమ్మెల్సీలుగా కొనసాగిన మైనంపల్లి హన్మంత్ రావ్, నరెందర్ రెడ్డిలు శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ ఖాన్ బుధవారం సాయంత్రం గవర్నర్ సమక్షంలో ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం సభలో సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. శాసనసభలో శాసనసభ్యుడిగా కేసిఆర్ తో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలౌతుంది. కొత్తగా కొలువుదీరనున్న అసెంబ్లీ కావడంతో, అసెంబ్లీని కూడా ముస్తాబు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే అధికారులు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు.

English summary
The Telangana Legislative Assembly is going to farm. Telangana MLAs are going to be sworn in on Thursday. This time the assembly is going to be screwed up with a new old combination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X